US Green card: ట్రంప్ కొరడా...అమెరికాలో గ్రీన్ కార్డు కావాలంటే...అవి వదులుకోవాల్సిందే...

ఫుడ్ స్టాంప్స్, మెడికల్ ఎయిడ్, హౌసింగ్ సదుపాయాలు పొందేవారికి గ్రీన్ కార్డ్ నిరాకరిస్తున్నట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ తన తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.

news18-telugu
Updated: August 13, 2019, 10:41 AM IST
US Green card: ట్రంప్ కొరడా...అమెరికాలో గ్రీన్ కార్డు కావాలంటే...అవి వదులుకోవాల్సిందే...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
  • Share this:
అమెరికా గ్రీన్ కార్డు పొందేందుకు నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ ట్రంప్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వం నుంచి చవకగా ఆహారం పొందేందుకు అల్పాదాయ వ్యక్తులకు ఇచ్చే వోచర్లు(ఫుడ్ స్టాంప్స్), మెడికల్ ఎయిడ్, హౌసింగ్ సదుపాయాలు పొందేవారికి గ్రీన్ కార్డ్ నిరాకరిస్తున్నట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ తన తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. అమెరికాలో స్థిరపడాలని కోరుకునే వారికి ఈ కొత్త రూల్ ఒక రకంగా శరాఘాతమే అని చెప్పవచ్చు. అయితే అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకునేందుకు జారీ చేసే గ్రీన్ కార్డ్ కావాలంటే ఇకపై ప్రభుత్వం నుంచి విదేశీయులు ఎలాంటి సహాయం పొందకుండా ఉండేందుకు అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు.
Published by: Krishna Adithya
First published: August 13, 2019, 10:41 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading