గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో(Mexico) కొత్త ‘లో కాస్ట్ షిప్ కిల్లింగ్ స్మార్ట్ బాంబ్’ను యూఎస్ ప్రదర్శించింది. మమోడిఫైడ్ 2,000 పౌండ్ల GBU-31 జాయింట్ డైరెక్ట్ అటాక్ మ్యూనిషన్(JDAM)ను F-15E స్ట్రైక్ ఈగిల్ నుంచి ప్రయోగించడంతో.. పూర్తి స్థాయి ఉపరితల నౌక ధ్వంసం అయింది. ఇటీవల AFRL ప్రారంభించిన ట్రయల్ క్విక్సింక్ జాయింట్ కెపాబిలిటీ టెక్నాలజీ ప్రదర్శనలో ఇది భాగం. Quicksink ప్రత్యేకమైనది, ఇది DOD ఆయుధ వ్యవస్థలకు కొత్త సామర్థ్యాలను అందించగలదన్న AFRL ప్రోగ్రామ్ మేనేజర్ కిర్క్ హెర్జోగ్ పేర్కొన్నాడు. యుద్ధ కమాండర్లు, జాతీయ నాయకులకు సముద్రపు ముప్పుల నుండి రక్షించడానికి కొత్త మార్గాలను అందిస్తుందని కిర్క్ హెర్జోగ్ అన్నాడు. జాయింట్ ఫోర్స్‌కు ఇన్హెరెంట్ ఫ్లెక్సిబిలిటీ(Flexibility) ద్వారా ఉపరితల సముద్ర ముప్పులను ఎదుర్కోవడానికి క్విక్సింక్ ఉమ్మడి దళానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓడను హెవీవెయిట్ టార్పెడో ఢీకొన్నప్పుడు ఎలా ఉంటుందో ఈ ఆయుధ ప్రభావం కూడా అదే విధంగా ఉంటుందని విశ్లేషణ.
బాంబ్ ఎలా పని చేస్తుంది..?
AFRL వీడియో ప్రకారం, క్విక్సింక్ ఆయుధం F-35 ద్వారా కంటైనర్ నౌకపై ప్రయోగించారు. P-8 పోసిడాన్ సముద్ర గస్తీ విమానం నుంచి లాంచ్ అవుతున్న F-35 టార్గెటింగ్ డేటాను స్వీకరిస్తున్నట్లు వీడియో దృశ్యాలు ఉన్నాయి. ఆయుధం లక్ష్యం సమీపంలోకి వెళ్లి 'ఆల్-వెదర్ మెరిటైమ్ సీకర్'ని యాక్టివేట్ చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అటానమస్లీ లక్ష్యాన్ని సెర్చ్ చేసి.. లక్ష్యంపై దాడి చేయడానికి బాంబ్ లాక్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. మందుగుండు సామగ్రి దాని ప్రస్తుత GPS-సహాయక ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్‌ను నోస్‌పై అమర్చిన కొత్త సీకర్‌తో కంబైన్ చేస్తున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఈ "ఆల్-వెదర్ మెరిటైమ్ సీకర్" కనీసం ఒక RF/రాడార్ సీకర్‌ని కలిగి ఉందని, మల్టీ-మోడ్ డిజైన్ కావచ్చని కూడా నిపుణులు చెబుతున్నారు. మందుగుండు సామాగ్రి దాని వార్‌హెడ్‌లో ఏదైనా అదనపు మార్పులను కలిగి ఉందనే అంశం అస్పష్టం.
స్మార్ట్ బాంబ్ ప్రయోజనాలు..
సాంప్రదాయ ఎయిర్ లాంచ్డ్ యాంటీ షిప్ మిసైల్ కంటే స్మార్ట్ బాంబ్ చాలా ఫ్లెక్సిబుల్, లో కాస్ట్. స్మార్ట్ బాంబు ప్రభావం హెవీవెయిట్ టార్పెడో ఓడను ఢీకొట్టినట్లుగా ఉంటుందని రిపోర్ట్స్ తెలుపుతున్నాయి. ఒకే జలాంతర్గామి నుంచి ప్రయోగించే టార్పెడో ప్రభావవంతంగా ఉన్నప్పటికీ, ఇది జలాంతర్గామి స్థానాన్ని కూడా అందిస్తుంది. క్విక్సింక్తో తక్కువ ధరలో మరింత చురుకైన పరిష్కారాన్ని కనుగొన్నామని 85వ టెస్ట్, ఎవాల్యుయేషన్ స్క్వాడ్రన్ మేజర్ ఆండ్రూ స్వాన్సన్ అన్నారు. వైమానిక దళ పోరాట విమానాలకు, పోరాట కమాండర్లు, వార్ఫైటర్లకు ఉపయోగపడుతుందని వ్యాఖ్య. అయినప్పటికీ క్విక్సింక్ రేంజ్లో పరిమితి ఉండే అవకాశం.. ప్రాథమిక JDAM 15 మైళ్ల పరిధిని కలిగి ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. నావికాదళానికి దగ్గరగా ఉండే వాయు రక్షణ వ్యవస్థలకు హాని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
రష్యా, చైనాకు యూఎస్ మెసేజ్..
రష్యా, చైనా దూకుడు విధానాలను కొనసాగిస్తున్న నేపథ్యంలో స్మార్ట్ బాంబు పరీక్ష నిర్వహించారు. నల్ల సముద్రం నుంచి ఉక్రెయిన్ నగరాలపై రష్యా నావికాదళం క్షిపణి దాడులు నిర్వహిస్తోంది. తిరిగి పోరాడటానికి ప్రయత్నిస్తోన్న ఉక్రెయిన్.. ఇటీవల రష్యా ప్రధాన మోస్క్వాను కూడా దళాలు ధ్వంసం చేశాయి. మే 2న నల్ల సముద్రంలో రెండు రష్యన్ రాప్టర్-క్లాస్ పెట్రోల్ షిప్‌లను ధ్వంసం చేయడానికి బైరక్టార్ డ్రోన్లను ఉక్రెయిన్ ఉపయోగించింది. కొన్ని నష్టాలను కలిగించినప్పటికీ రష్యన్ నావికాదళంపై ఉక్రెయిన్ ఎదురుదాడి అసమర్థం. రష్యా బలగాలను ఎదుర్కోవడానికి నిరంతరం ఆయుధాలను అమెరికా ఉక్రెయిన్‌కు పంపుతోంది. హిందూ మహాసముద్రం, దక్షిణ చైనా సముద్రంలో చైనా నౌకాదళాన్ని ఎదుర్కోవడానికి అమెరికా ప్రయత్నిస్తున్నది. చైనా వంటి పెద్ద నౌకాదళాన్ని కలిగిన వాటిని ఎదుర్కొనేందుకు పెద్ద మొత్తంలో యాంటీ షిప్ ఆయుధాలు అవసరం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.