Home /News /international /

US SUPREME COURT ENDS CONSTITUTIONAL RIGHT TO ABORTION PAH

యూఎస్ సుప్రీం కోర్టు చారిత్రాత్మక నిర్ణయం.. అబార్షన్ లపై కీలక తీర్పు వెలువరించిన ధర్మాసనం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

America: సుప్రీం కోర్టు అబార్షన్ల పైన కీలక తీర్పు వెలువరించింది. దీనితో దాదాపు.. యాభై ఏళ్ల నుంచి వస్తున్న గర్భవిచ్ఛిత్తి హక్కును రద్దు చేస్తు తీర్పు వెలువరించింది.

అమెరికా సుప్రీం కోర్టు శుక్రవారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఇకపై అబార్షన్ చేయించుకునే రాజ్యంగ పరమైన హక్కును రద్దు చేసింది. ఇప్పటి వరకు అక్కడి మహిళలు తమ ఇష్టాను సారం గర్భవిచ్ఛిత్తి చేసుకునే వారు. ఈ క్రమంలో.. సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేసింది. అదే విధంగా, రాజ్యంగం అబార్షన్ చేసుకునే హక్కును ఇవ్వలేదని తెలిపింది. ఇకపై గర్భస్రావంపై మహిళలకు పరిమితం చేస్తు నిర్ణయం తీసుకుంది. అదే విధంగా, కొన్ని రాష్ట్రాలు ఈ విధానాన్ని అనుమతించవచ్చు లేదా పరిమితం చేయవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా  రష్యన్ జర్నలిస్ట్  కీలక నిర్ణయం తీసుకున్నాడు.

ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన పిల్లలకు సాయం చేయడానికి రష్యన్ జర్నలిస్ట్ డిమిత్రి మురాటోవ్ తన నోబెల్ శాంతి బహుమతి పతకాన్ని వేలం వేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన పిల్లలకు సహాయం చేయడానికి యునిసెఫ్ చేస్తున్న ప్రయత్నాలకు ఈ ఆదాయం నేరుగా అందుతుంది. 2021 అక్టోబరులో మురాటోవ్ బంగారు పతకాన్ని అందుకున్నారు.



స్వతంత్ర రష్యన్ వార్తాపత్రిక నోవాయా గెజిటాను ప్రారంభించడానికి ఆయన సహాయపడ్డారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన నేపథ్యంలో జర్నలిస్టులపై క్రెమ్లిన్ నిర్బంధం, ప్రజల అసమ్మతి మధ్య మార్చిలో ఆ పత్రిక మూతపడినప్పుడు.. మురాటోవ్‌ పబ్లికేషన్స్‌ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా పనిచేస్తున్నారు. మురాటోవ్ తన బహుమతిని వేలం వేయాలని నిర్ణయించుకున్నారు.. దానితో పాటు 500,000 డాలర్ల క్యాష్ ప్రైజ్‌ను స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. శరణార్థులుగా మారిన పిల్లల భవిష్యత్తుకు ఓ అవకాశం ఇవ్వడం కోసం విరాళం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

అనాథలైన పిల్లల గురించే ఆందోళన

మురాటోవ్‌ అసోసియేటెడ్ ప్రెస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఉక్రెయిన్‌లో ఘర్షణల కారణంగా అనాథలుగా మారిన పిల్లల గురించి తాను ఆందోళన చెందుతున్నానని చెప్పారు. వారి భవిష్యత్తును వారికి తిరిగి ఇవ్వాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. రష్యాకు వ్యతిరేకంగా విధించిన ముఖ్యమైన అంతర్జాతీయ ఆంక్షలు అరుదైన వ్యాధులకు మందులు, ఎముక మజ్జ మార్పిడి వంటి మానవతా సహాయాన్ని అవసరమైన వారికి చేరకుండా నిరోధించలేవని ఆయన అన్నారు. ఉక్రేనియన్లకు సహాయం చేయడానికి ప్రజలు తమ విలువైన ఆస్తులను వేలం వేస్తారు కాబట్టి ఇది ఒక ఉదాహరణగా ఫ్లాష్ మాబ్‌కు నాంది కావాలని మురాటోవ్ తెలిపారు. గతేడాది ఫిలిప్పీన్స్‌కు చెందిన జర్నలిస్ట్ మరియా రెస్సాతో కలిసి మురాటోవ్ నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు.

మురాటోవ్ 2014లో క్రిమియాను రష్యా చేజిక్కించుకోవడం, ఫిబ్రవరిలో ప్రారంభించిన యుద్ధంపై తీవ్ర విమర్శలు చేశారు. దాదాపు 5 మిలియన్ల మంది ఉక్రేనియన్లు భద్రత కోసం ఇతర దేశాలకు పారిపోయారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అతిపెద్ద మానవతా సంక్షోభాన్ని ఈ యుద్ధం సృష్టించింది
Published by:Paresh Inamdar
First published:

Tags: Abortion, Supreme Court, USA

తదుపరి వార్తలు