హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

NASA: నాసా కీలక నిర్ణయం.. కల్పనా చావ్లాకు అరుదైన గౌరవం

NASA: నాసా కీలక నిర్ణయం.. కల్పనా చావ్లాకు అరుదైన గౌరవం

కల్పనా చావ్లా (Spaceflight.nasa.gov)

కల్పనా చావ్లా (Spaceflight.nasa.gov)

కల్పన చావ్లా అంతరికక్ష ప్రయాణానికి గొప్ప త్యాగం చేయగా, తోటి వ్యోమగాములు ఆమె అడుగుజాడల్లో నడవడానికి ప్రేరణగా నిలుస్తుంది

భారత సంతతికి చెందిన వ్యోమగామి దివంగత కల్పనా చావ్లాకు అరుదైన గౌరవం దక్కింది. పేరును అమెరికన్ కార్గో అంతరిక్ష నౌకకు ఆమె పేరును పెట్టాలని నాసా నిర్ణయించింది. మానవ అంతరిక్ష ప్రయాణానికి ఆమె చేసిన కృషికి గాను అమెరికన్ గ్లోబల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ నార్త్రోప్ గ్రుమ్మన్, దాని తదుపరి సిగ్నస్ క్యాప్సూల్‌కు "S.S. కల్పనా చావ్లా" అని పేరు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని కంపెనీ ప్రకటిస్తూ "నాసాలో పనిచేస్తూ భారత సంతతికి చెందిన మొదటి మహిళా వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన కల్పనా చావ్లాను ఈ రోజు మనం గౌరవిస్తున్నాము. మానవ అంతరిక్ష ప్రయాణానికి ఆమె చేసిన సేవలు శాశ్వత ప్రభావాన్ని చూపించాయి" అని నాసా బుధవారం ట్వీట్ చేసింది.

అంతేకాక "మాజీ వ్యోమగామి కల్పన చావ్లా పేరు మీద ఎన్జి 14 సిగ్నస్ వ్యోమనౌకకు పేరు పెట్టడం మాకు గర్వంగా ఉంది. మానవ అంతరిక్ష ప్రయాణంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పేరు మీద స్పేస్‌క్రాఫ్ట్‌కు పేరు పెట్టడం కంపెనీ సంప్రదాయం. అంతరిక్షానికి వెళ్ళిన భారత సంతతికి చెందిన మొదటి మహిళగా కల్పన చావ్లా చరిత్రలో తనకు ఉన్న ప్రముఖ స్థానాన్ని పురస్కరించుకుని ఎంపికయ్యారు. కల్పన చావ్లా అంతరికక్ష ప్రయాణానికి గొప్ప త్యాగం చేయగా, తోటి వ్యోమగాములు ఆమె అడుగుజాడల్లో నడవడానికి ప్రేరణగా నిలుస్తుంది.'' నాసా తన వెబ్‌సైట్లో అని పేర్కొంది.

కాగా, భారత సంతతికి కల్పనా చావ్లా అంతరిక్షంలోకి ప్రవేశించిన మొట్టమొదటి ఇండో అమెరికన్ మహిళగా నిలిచిపోయారు. 2003లో ఆరుగురు సిబ్బందితో ప్రయానిస్తున్న అంతరిక్ష నౌక కొలంబియాలో కుప్పకూలడంతో ఆమె మరణించిన విషయం తెలిసిందే. కల్పనా చావ్లా 1962 మార్చి 17న హర్యానాలోని కర్నాల్‌లో జన్మించారు. 1982లో భారతదేశంలోని పంజాబ్ ఇంజనీరింగ్ కళాశాల నుండి ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పొందారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. 1984 లో ఆమె టెక్సాస్ విశ్వవిద్యాలయం నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ, 1988 లో కొలరాడో విశ్వవిద్యాలయం నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో పీహెచ్డీ పట్టా పొందారు. సింగిల్-మరియు మల్టీ-ఇంజిన్ విమానాలు, సీప్లేన్లు మరియు గ్లైడర్ల కోసం ఆమె వాణిజ్య పైలట్ లైసెన్స్లను కలిగి ఉంది. అంతేకాకుండా సర్టిఫైడ్ పైలెట్ లైసెన్స్ను కలిగి ఉండటమే కాకుండా సర్టిఫైడ్ ఫ్లయిట్ ఇన్స్ట్రక్టర్ హోదాను కలిగి ఉంది.

అంతేకాదు 1988లో కాలిఫోర్నియాలోని అమెస్ రీసెర్చ్ సెంటర్లో పవర్డ్-లిఫ్ట్ కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ పరిశోధకురాలిగా చావ్లా నాసాలో తన వృత్తిని ప్రారంభించారు. "గ్రౌండ్-ఎఫెక్ట్" లో విమానం ఎగురుతున్నప్పుడు ఎదురయ్యే సంక్లిష్ట వాయు ప్రవాహాల అనుకరణపై ఆమె రీసెర్చ్ చేశారు. 1993లో కల్పనా చావ్లా ఓవర్సెట్ మెథడ్స్ ఇంక్లో వైస్ ప్రెసిడెంట్గా మరియు ఏరోడైనమిక్స్ పరిశోధకుడిగా చేరారు. 1994లో ఆమె నాసా అంతరిక్షంలోకి పంపే వ్యోమగామిగా ఎంపికయ్యారు. నవంబర్ 1996లో చావ్లాను అంతరిక్ష నౌక కొలంబియాలో ఎస్టిఎస్ -87లో మిషన్ స్పెషలిస్ట్‌గా నియమించారు.

First published:

Tags: America, NASA, USA

ఉత్తమ కథలు