అఫ్గానిస్థాన్(Afghanistan)లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కాబూల్ ఎయిర్‌పోర్టు (Kabul Airport)వద్ద ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడులతో మరింత దిగజారాయి. బాంబు పేలుళ్లతో మరింతగా వణుకుతున్నారు అప్గాన్లు. ఎలాగైనా దేశం విడిచి వెళ్లాలన్న ఉద్దేశంతో కాబూల్ ఎయిర్‌పోర్టుకు తరలివెళ్తున్నారు. ఎయిర్‌పోర్టు బయట వేలాది మంది పడిగాపులు కాస్తున్నారు. ఐతే బాంబు పేలుళ్లతో అప్రమత్తమైన తాలిబన్లు(Taliban). విమానాశ్రయం వద్ద భారీ రద్దీని తగ్గించేందుకు రంగంలోకి దిగారు. కాబుల్ విమానాశ్రయాన్ని దిగ్బంధించారు. ప్రజలు ఎయిర్‌పోర్టుకు వైపునకు రాకుండా అదనపు సిబ్బందిని మోహరిస్తున్నారు. మరిన్ని చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. కాబూల్ ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లే మూడు ద్వారాలతో పాటు ఇతర ప్రాంతాలను అమెరికా బలగాలు వదలివెళ్లడంతో తాలిబన్ దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అఫ్గాన్ సైన్యం నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలు, ఆయుధాలతో ఎయిర్ పోర్టు సమీపంలో గస్తీ కాస్తున్నారు.
US soldiers have left three gates and some other parts of Kabul airport and now Taliban forces control these areas, Taliban says: TOLOnews
— ANI (@ANI) August 28, 2021
ఆకలితో పిల్లలు.. బ్రెడ్ కోసం తండ్రి ఏం చేస్తున్నాడో చూడండి..ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు
మరోవైపు ఆగస్టు 31 లోపు తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇది వరకే స్పష్టం చేశారు. ఆ లోపు తమ పౌరులను పూర్తిగా అక్కడి నుంచి తరలించాలని ఆయన భావిస్తున్నారు. అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు కూడా ప్రజల తరలింపు చర్యలను వేగవంతం చేస్తున్నాయి. డెడ్ లైన్ దగ్గర పడుతుండడతో చాలా మంది అప్గాన్లు ఎయిర్‌పోర్టుకు చేరుకొని.. అక్కడి నుంచి దేశం దాటి వెళ్లాలని భావిస్తున్నారు. ఆగస్టు 31 దాటితే కాబూల్‌లో అమెరికా దళాలు ఉండవు. అప్పుడు కాబూల్ ఎయిర్‌పోర్టు కూడా పూర్తిగా తాలిబన్ల ఆధీనంలోకి వెళ్తుంది. అప్పుడు తాము పక్క దేశాలకు వెళ్లేందుకు అవకాశం ఉండదని.. కనీసం విమానాలు కూడా రావని అప్గాన్ ప్రజలు వాపోతున్నారు. అంతర్జాతీయ సమాజం కలగజేసుకొని తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
US Drone Strike: అమెరికా ప్రతీకారం.. అతడిని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి..
కాగా, గురువారం సాయంత్రం కాబూల్ ఎయిర్‌పోర్టులో వరుస పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఐసిస్-కే ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులతో మారణహోమం సృష్టించారు. దాదాపు ఏడు పేలుళ్లు జరిగినట్లు స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ ఘటనల్లో ఇప్పటి వరకు 200 మందికి పైగా మరణించారు. మరో 300 మంది గాయపడ్డారు. మృతుల్లో అమెరికాకు చెందిన 13 మంది సైనికులు కూడా ఉన్నారు. పేలుళ్లలో తమ సైనికులు మరణించడంపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐసిస్-కే ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఆదేశాలతో శుక్రవారం రాత్రి ఐసిస్-కే స్థావరాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్ దాడులకు పాల్పడింది అమెరికా. ఈ దాడుల్లో ఇద్దరు కీలక నేతలు హతమయినట్లు అమెరికా పెంటగాన్ కార్యాలయం తాజాగా ప్రకటించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Kabul, Kabul blast, Taliban