అమెరికా (US Shooting)లో ఘోరం జరిగింది. గన్ కల్చర్ మరోసారి పేట్రేగిపోయింది. ఓ స్కూల్లో నెత్తుటేరులు పారించింది. టెక్సాస్ (Texas Shooting)లోని ఓ ఎలిమెంటరీ స్కూల్లోకి 18 ఏళ్ల యువకుడు తుపాకీతో చొరబడి.. విచక్షిణారహితంగా కాల్పులు జరిపాడు. దుండగుడి కాల్పుల్లో 18 మంది చిన్నారులు, ముగ్గురు టీచర్లు మరణించారు. చనిపోయిన విద్యార్థుల వయసు 4 నుంచి 11 ఏళ్ల మధ్య ఉంటుందని టెక్సాస్ అధికారులు తెలిపారు. మెక్సికో సరిహద్దులో ఉండే ఉవాల్డేలో అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు (Texas Police) ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. దుండుగుడు స్కూల్లోనే ఉండడంతో అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులపైకి కాల్పులు జరపరడంతో వారు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఎన్కౌంటర్లో ఆ ఉన్మాది కూడా మరణించాడు. ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.
#UPDATE | Texas school shooting death toll rises to 18 children, 3 adults, as per Texas state senator: AFP
— ANI (@ANI) May 25, 2022
విద్యార్థులపై కాల్పులు జరిపిన యువకుడిని 18 ఏళ్ల సాల్వడార్ రామోస్‌గా గుర్తించారు. మంగళవారం మధ్యాహ్నం ఓ యువకుడు.. రాబ్ ఎలిమెంటరీ స్కూల్ (Robb Elementary School) సమీపంలోకి కారులో వచ్చాడు. కారును కొద్దిదూరంలో వదిలేసి.. నడుచుకుంటూ లోపలికి వచ్చాడు. అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లి పిల్లలపై కాల్పులు జరిపాడు. అతడితో తుపాకీతో పాటు రైఫిల్ కూడా ఉండి ఉండవచ్చని.. అందుకే ఈ స్థాయిలో విధ్వంసం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఘటన జరిగిన స్కూల్లో మొత్తం 500 మంది విద్యార్థులు ఉన్నారు. సమాచారం అందిన నిమిషాల వ్యవధిలోనే పోలీసులు స్కూల్‌కి వెళ్లి.. దుండగుడిని మట్టుబెట్టారని.. లేదంటే మరింత పిల్లల ప్రాణాలు పోయేవని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో టెక్సాస్ మొత్తం ఉలిక్కిపడింది. అమెరికాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అసలు స్కూల్లోకి చొరబడి ఎందుకు కాల్పులు జరిపాడన్నది తెలియాల్సి ఉంది.
శ్రీలంకలో చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలోపెరిగిన ఆయిల్ ధరలు..లీటర్ పెట్రోల్ రూ.420
టెక్సాస్‌లో కాల్పుల ఘటనపై ఆ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబార్ట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లలో ఇది అత్యంత ఘోరమైన ఘటన అని ఆయన పేర్కొన్నారు. కాల్పుల్లో 14 మంది చిన్నారులు మరణించారని ఆయన చెప్పారు. కానీ ఆ తర్వాత కాసేపటికే టెక్సాస్ స్టేట్ సెనేటర్ రోలాండ్ గుటిరేజ్ సీఎన్ఎస్ వార్తా సంస్ధతో మాట్లాడుతూ.. 18 మంది పిల్లలు, ముగ్గురు పెద్దవారు మరణించారని వెల్లడించారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టెక్సాస్ గవర్నర్‌తో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. చిన్నారుల మృతి నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా మూడురోజులు సంతాపదినాలను ప్రకటించారు. చిన్నారుల మృతికి సంతాపంగా ప్రభుత్వ కార్యాలయాలు, మిలటరీ, నేవల్ బేస్‌లు, రాయబార కార్యాలయాల్లో అమెరికా జాతీయ జెండాను సగం వరకు అవనతం చేయనున్నారు.
Cancer killing Virus: క్యాన్సర్ వ్యాధిని తరిమికొట్టే కొత్త వైరస్.. ఇదే తొలిసారి..
కాగా, 2018లో కూడా ఇలాంటి ఘోరమే జరిగింది. ఫ్లోరిడాలోని పార్క్ ల్యాండ్‌లో జరిగిన కాల్పుల్లో 14 మంది హైస్కూల్ విద్యార్థులతో పాటు ముగ్గురు టీచర్లు మరణించారు. ఆ ఘటన తర్వాత.. ఇదే అత్యంత దారుణ సంఘటన. ఇటీవల న్యూయార్క్‌లోని బఫలో కూడా ఇలాంటి దారుణమే జరిగింది. దుండగుడి కాల్పుల్లో 10 మంది మరణించారు. అమెరికాలో గన్ కల్చర్ కారణంగా ఏటా వేలాది మంది మరణిస్తున్నారు. 2020లో అమెరికాలో జరిగిన కాల్పుల్లో 19350 మంది చనిపోయారు. ఇది 2019తో పోలిస్తే 35 శాతం అధికం. తాజా ఘటనతో అమెరికా తుపాకీ సంస్కృతిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తుపాకుల వాడకాన్ని నియంత్రించేలా చట్టం తీసుకురావాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amercia, International news, Us news, Us shooting