Home /News /international /

US SCIENTISTS DEVELOPED A CONTACT LENS THAT CAN HELP IN THE EARLY DETECTION OF CANCER USING TEARS AND HELP IN THE TREATMENT GH SRD

Cancer Contact Lens: వారెవ్వా కన్నీళ్లను ఉపయోగించి క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించవచ్చు.. ఎలాగంటే..

Photo Credit : IANS

Photo Credit : IANS

Cancer Contact Lens: ఎక్సోసోమ్‌లు అంటే రోగనిర్ధారణలో క్యాన్సర్ బయోమార్కర్లుగా ఉంటూ శారీరక స్రావాలలో కనిపించే నానోమీటర్-సైజ్డ్‌ నీటిపొక్కులు. కన్నీళ్లలో కనిపించే ఎక్సోసోమ్‌లను బందీ చేసి..

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
నిశ్శబ్దంగా ఉండి ప్రాణాలను తీసే క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం ఒక సవాలే అని చెప్పవచ్చు. వ్యాధి లక్షణాలను ముందుగా పసిగట్టి టెస్ట్ చేయించుకుంటే తప్ప క్యాన్సర్ వచ్చిందనే విషయం రోగులకు కూడా తెలియదు. అయితే క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి ఎందరో ప్రాణాలను కాపాడేందుకు శాస్త్రవేత్తలు నిత్యం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా తాజాగా యూఎస్ శాస్త్రవేత్తలు కన్నీళ్లను ఉపయోగించి క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడంలో, చికిత్సలో సహాయపడే కాంటాక్ట్ లెన్స్‌ను అభివృద్ధి చేశారు. కాలిఫోర్నియాలోని టెరాసాకి ఇన్‌స్టిట్యూట్ ఫర్ బయోమెడికల్ ఇన్నోవేషన్ (Terasaki Institute for Biomedical Innovation) బృందం అభివృద్ధి చేసిన ఈ లెన్స్ ఎక్సోసోమ్‌లను క్యాప్చర్ చేయగలదు. అలానే, గుర్తించగలదు.

ఎక్సోసోమ్‌లు అంటే రోగనిర్ధారణలో క్యాన్సర్ బయోమార్కర్లుగా ఉంటూ శారీరక స్రావాలలో కనిపించే నానోమీటర్-సైజ్డ్‌ నీటిపొక్కులు. కన్నీళ్లలో కనిపించే ఎక్సోసోమ్‌లను బంధీ చేసి యాంటీబాడీలకు అత్తుక్కుని ఉండే మైక్రోచాంబర్లతో లెన్స్‌ను రూపొందించారు. ఈ యాంటీబాడీ-కంజుగేటెడ్ సిగ్నలింగ్ మైక్రోచాంబర్ కాంటాక్ట్ లెన్స్ (ACSM-CL)లో నానోపార్టికల్-ట్యాగ్డ్‌ నిర్దిష్ట యాంటీబాడీస్‌ను గుర్తించవచ్చు.



అదెలాగంటే ఆ యాంటీబాడీస్‌తో కాంటాక్ట్ లెన్స్ కలర్ మారుతుంది. ఇది క్యాన్సర్ ప్రీ-స్క్రీనింగ్ సమయంలో బాగా ఉపయోగపడుతుంది. అలానే ఇది సులభమైన, వేగవంతమైన, సున్నితమైన, తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఎక్కువ ఖర్చు లేకుండా ఎలాంటి మెడికల్ పరికరాలు శరీరంలో జొప్పించాల్సిన అవసరం లేని డయాగ్నొస్టిక్ టూల్‌గా ఇది పనిచేస్తుంది.

ఎక్సోసోమ్‌లు చాలా కణాలలో ఏర్పడతాయి. ప్లాస్మా, లాలాజలం, మూత్రం, కన్నీళ్లు వంటి అనేక శారీరక ద్రవాలలోకి ఇవి ఉత్పత్తి అవుతాయి. ఎక్సోసోమ్‌లు కణాల మధ్య వివిధ జీవఅణువులను రవాణా చేయగలవని పరిశోధనలో తేలింది. అయితే TIBI బృందం కన్నీళ్ల నుంచి ఎక్సోసోమ్‌లను గ్రహించడానికి వారి ACSM-CLని రూపొందించింది.

ఎందుకంటే కన్నీళ్లు అనేవి రక్తం, మూత్రం, లాలాజలం కంటే ఎక్సోసోమ్‌లు అనడానికి అత్యంత ఉత్తమమైన శుభ్రమైన మూలం. "ఎక్సోసోమ్‌లు అనేక బయోమెడికల్ అప్లికేషన్‌లను లక్ష్యంగా చేసుకోగల మార్కర్లు, బయోమోలిక్యూల్స్‌కి గొప్ప సోర్స్" అని TIBI డైరెక్టర్, CEO అలీ ఖడెమ్‌హోస్సేని వెల్లడించారు.

ఈ ప్రయోగాన్ని ధృవీకరించేందుకు ACSM-CL ని పది వేర్వేరు కణజాలం, క్యాన్సర్ కణ తంతువుల నుంచి సూపర్‌నాటెంట్లలో ఉత్పత్తి అయ్యే ఎక్సోసోమ్‌లపై పరీక్షించారు. ప్రతికూల నియంత్రణలతో పోల్చితే, అన్ని పరీక్ష శాంపిల్స్‌లో గమనించిన స్పెక్ట్రోస్కోపిక్ మార్పుల ద్వారా ఎక్సోసోమ్‌లను సంగ్రహించే, గుర్తించే సామర్థ్యం లెన్స్‌కి ఉందని నిర్ధారణ అయ్యింది. వాలంటీర్ల నుంచి సేకరించిన పది వేర్వేరు కన్నీటి నమూనాలపై ACSM-CL టెస్ట్ జరిపినప్పుడు ఈ ఫలితాలు వెల్లడయ్యాయి.

ఆఖరి ప్రయోగాలలో వివిధ సర్ఫేస్ మార్కర్ల మూడు వేర్వేరు సెల్ లైన్‌ల నుంచి సేకరించిన సూపర్‌నాటెంట్‌లలోని ఎక్సోసోమ్‌లు ACSM-CL ద్వారా పరీక్షించడం జరిగింది. ఈ సమయంలో మార్కర్-స్పెసిఫిక్ డిటెక్షన్ యాంటీబయాటిక్స్ విభిన్న కలయికలతో పాటు టెస్ట్ చేశారు. ఫలితాలు అనుకున్నట్టుగానే వచ్చాయి. అలా వివిధ సర్ఫేస్ మార్కర్లలో ఎక్సోసోమ్‌లను కచ్చితంగా సంగ్రహించే, గుర్తించే సామర్థ్యం యాంటీబాడీ-కంజుగేటెడ్ సిగ్నలింగ్ మైక్రోచాంబర్ కాంటాక్ట్ లెన్స్‌కి ఉందని ధ్రువీకరించారు.
Published by:Sridhar Reddy
First published:

Tags: Cancer, Trending news, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు