హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

China Vs Russia Vs America: పెరుగుతున్న చైనా- రష్యా బెదిరింపులు.. మధ్య ఆసియా వ్యూహాలను రచిస్తున్న అమెరికా..

China Vs Russia Vs America: పెరుగుతున్న చైనా- రష్యా బెదిరింపులు.. మధ్య ఆసియా వ్యూహాలను రచిస్తున్న అమెరికా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జపాన్‌లో తన నౌకల సంఖ్యను నిశ్శబ్దంగా పెంచిన యూఎస్‌ నేవీ, తైవాన్ జలసంధికి దగ్గరగా కొత్త, మరింత సామర్థ్యం గల నౌకలను తరలించింది. ప్రపంచంలోనే అతిపెద్ద విదేశీ యూఎస్‌ నావికా స్థావరం జపాన్‌లోని యోకోసుకాకు ఐదు గైడెడ్-మిసైల్ డెస్ట్రాయర్లు చేరుకొన్నాయి.

ఇంకా చదవండి ...

జపాన్‌లో(Japan) తన నౌకల సంఖ్యను నిశ్శబ్దంగా పెంచిన యూఎస్‌ నేవీ, తైవాన్(Taiwan) జలసంధికి దగ్గరగా కొత్త, మరింత సామర్థ్యం గల నౌకలను తరలించింది. ప్రపంచంలోనే అతిపెద్ద విదేశీ యూఎస్‌ నావికా స్థావరం జపాన్‌లోని యోకోసుకాకు ఐదు గైడెడ్-మిసైల్(Missile) డెస్ట్రాయర్లు చేరుకొన్నాయి. 25 ఏళ్ల క్రితమే జపాన్‌కు తరలించిన USS జాన్ S.మెక్‌కెయిన్, USS కర్టిస్ విల్బర్ వంటి నౌకలను భర్తీ చేశారు. యోకోసుకాకు తరలించిన కొత్త నౌకలలో ముఖ్యంగా USS హోవార్డ్, USS డ్యూయీ, USS రాల్ఫ్ జాన్సన్(Johnson), USS రాఫెల్ పెరాల్టా, USS హిగ్గిన్స్ ఉన్నాయి. ఐదు కొత్త నౌకల్లో, నాలుగు ఫ్లైట్ IIA వెర్షన్‌లు అని, అవి రెండు హెలికాప్టర్(Heli crafter) హ్యాంగర్‌లతో ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. హ్యాంగర్ లేని ఏకైక నౌక సరికొత్త బేస్‌లైన్ 9 ఏజిస్ కంబాట్ సిస్టమ్‌తో తయారీ, దీనికి మిస్సైల్స్‌ నుంచి రక్షించే సత్తా ఉంది. ఇప్పుడు యోకోసుకాలోని అర్లీ బర్క్-క్లాస్ డెస్ట్రాయర్ల మొత్తం సంఖ్య ఎనిమిదికి చేరాయి.

Explained: టీవీ స్క్రీన్లలో QLED, UHD, OLED డిస్‌ప్లేల మధ్య తేడా ఏంటి..? వీటిలో ఏది బెస్ట్..?


విస్తరణ ఎందుకు ప్రధానం..

బాలిస్టిక్ క్షిపణి రక్షణపై దృష్టి సారించిన పాత నౌకలు, ఉత్తర కొరియా ముప్పు దృష్టిలో ఉంచుకుని మోహరించాయి. కొత్త నౌకలకు చైనా అడ్వాన్స్డ్‌ యుద్ధ విమానాలకు వ్యతిరేకంగా యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ వార్‌ఫేర్‌లో పాల్గొని మల్టీ టాస్క్ చేసే సత్తా ఉంది. వీటితో సబ్‌మెరైన్స్‌ను వెంబడించగలరు. యాంటీ-షిప్ క్రూయిజ్ మిస్సైల్స్‌ నుండి రక్షించగలరు. బాలిస్టిక్ క్షిపణులపై కూడా నిఘా ఉంచే అవకాశం ఉంటుంది.

MH-60R మెరిటైమ్ హెలికాప్టర్లను మోయగల కొత్త డెస్ట్రాయర్లు , ఇవి అన్ని భూగర్భ ముప్పులను ట్రాక్ చేసి, నాశనం చేయగలవు. శత్రువుల సబ్‌మెరైన్స్‌ను వేటాడేందుకు ప్రాథమిక సాధనం MH-60R, చైనా, రష్యాకు వ్యతిరేకంగా US నావికాదళ కార్యకలాపాలలో కీలక భాగంగా ఉన్నాయి.

* MH-60R స్పెసిఫికేషన్స్‌ వివరాల్లోకి వెళ్తే.. Sonobooy లాంచర్, వివిధ రాడార్లు, టార్పెడోలు, యాంటీ షిప్ క్షిపణులు ఉన్నాయి. కొత్త హ్యాంగర్‌తో కూడిన డెస్ట్రాయర్‌లు US నావికాదళానికి మరింత ఉపయోగపడతాయని నివేదికలు చెబుతున్నాయి. యు.ఎస్. నేవీ ఫ్లైట్ IIA డెస్ట్రాయర్లు, హెలికాప్టర్లు, ఎయిర్‌క్రూలతో, ఇండో-పసిఫిక్ అంతటా యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ పరిధిని, సామర్థ్యాలను పెంచాయని యూఎస్‌ 7వ ఫ్లీట్ డిప్యూటీ పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ లెఫ్టినెంట్ మార్క్ లాంగ్ఫోర్డ్ పేర్కొన్నారు. ల్యాండ్‌ బేస్డ్‌ హెలికాప్టర్‌కు మించిన ప్రాంతాలకు తీసుకెళ్లగల సామర్థ్యం ఈ కొత్త హెలికాప్టర్లకు ఉందని మార్క్‌ తెలిపారు

సహాయక సామగ్రిని కలిగి ఉండటమే కాకుండా, కొత్త నౌకల సిబ్బందికి అదనపు వసతిని ఇచ్చే సముద్ర హెలికాప్టర్లు.. అంటే కొత్త ఫ్లైట్ IIA షిప్‌లకు సొంత హెలికాప్టర్ల సదుపాయం ఉంది.

అమెరికాకు యోకోసుకా ఎందుకు కీలకం..

13 అమెరికన్ యుద్ధనౌకలతో, US మిలిటరీలో అత్యంత వ్యూహాత్మక స్థావరాలలో యోకోసుకా ఒకటి. తైవాన్‌ను విలీనం చేసుకోవడానికి చైనా ప్రయత్నించవచ్చనే ఆందోళనల మధ్య యోకోసుకాకు ప్రాధాన్యత పెరిగింది. యోకోసుకా నుండి 30 నాట్ల వేగంతో తైవాన్ జలసంధికి ప్రయాణించడానికి కేవలం ఒకటిన్నర రోజులు పడుతుందని అంచనా. గ్వామ్, సింగపూర్, పెరల్ హార్బర్ మొదలైన వాటితో ఈ ప్రాంతంలోని ఇతర US నావికా స్థావరాల కంటే ఇది వేగవంతమైనది. జపాన్‌లో నాగసాకి నైరుతి ప్రిఫెక్చర్‌లోని ససెబోలో ఉన్న యూఎస్‌ నేవీ రెండో ప్రధాన స్థావరం.. ఈ సైట్ తైవాన్‌కు మరింత దగ్గరగా ఉంది. అక్కడున్న మరో తొమ్మిది అమెరికన్ నౌకలు, ఒకినావాలోని యుఎస్ మెరైన్‌లను యుద్ధభూమికి తరలించే సదుపాయంతో ఐదు పెద్ద ఆంఫిబియస్‌ ఓడలు ఉన్నాయి.


US వ్యూహంలో మార్పులకు ప్రేరణ ఏంటి..?

US నౌకాదళ కార్యకలాపాల ఆవశ్యకతను చైనా, రష్యాల దూకుడు చర్యలు పెంచాయి. 2021 అక్టోబర్‌లో చైనా, రష్యాకు చెందిన 10 నౌకలు జపాన్‌కు ఉత్తరాన ఉన్న సుగరు జలసంధి గుండా ప్రయాణం చేశాయి. చైనా, రష్యా నౌకలు సంయుక్తంగా ఈ జలాల నుంచి వెళ్లడం ఇదే తొలిసారి. చాలా రోజుల తర్వాత అదే ఓడల సముదాయం దక్షిణ చోక్‌పాయింట్, ఒసుమి జలసంధి ద్వారా వెళ్లినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. వెంట వెంటనే రెండు సార్లు నౌకల ప్రయాణాలతో చైనా, రష్యాలు జపాన్‌ను రెచ్చగొట్టాయి. ఇటీవల తన అత్యంత సామర్థ్యం గల ఓడలను తైవాన్ జలసంధికి దగ్గరగా బీజింగ్ తరలించింది.

First published:

Tags: America, Japan, Russia

ఉత్తమ కథలు