Home /News /international /

US RESTAURANT TREATS STAFF TO LAS VEGAS TRIP AS REWARD FOR THEIR WORK VB GH

Viral Post: ఆ రెస్టారెంట్ చేసిన పని చూస్తే.. మీరు తప్పకుండా మెచ్చుకుంటారు.. అసలేమైందంటే..

విహారయాత్రలో రెస్టారెంట్ ఉద్యోగులు

విహారయాత్రలో రెస్టారెంట్ ఉద్యోగులు

Viral Post: అమెరికాలో రామెన్ హౌస్ లూయిస్ విల్లే అనే రెస్టారెంట్ తన ఉద్యోగుల కష్టాన్ని గుర్తించింది. వారి సేవలకు ప్రతిఫలంగా హోటల్‌ను మూసివేసి వారి ఆలోచనలకు అందని పని చేసింది. ఆ పనికి ప్రతీ ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఆ పని ఎంటంటే..

ఇంకా చదవండి ...
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని ఏ విధంగా అతలాకుతలం చేసిందో వేరే చెప్పనక్కర్లేదు. దాదాపు అన్ని రంగాలు, వ్యాపారాలు కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు, పర్యాటక, ఆతిథ్య రంగం తీవ్రంగా దెబ్బతింది. హోటళ్లు, రెస్టారెంట్లు మూతబడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా పేరు చెప్పి ఉద్యోగులను తొలగించిన సంస్థలు కోకోల్లలు. కానీ ఓ రెస్టారెంట్ మాత్రం తన ఉద్యోగుల బాగోగులను పట్టించుకోవడమే కాదు.. వారిని ఓ విహారయాత్రకు కూడా తీసుకెళ్లింది. అమెరికాలో రామెన్ హౌస్ లూయిస్ విల్లే అనే రెస్టారెంట్ తన ఉద్యోగుల కష్టాన్ని గుర్తించింది. వారి సేవలకు ప్రతిఫలంగా హోటల్‌ను మూసివేసి మరీ, లాస్ వేగాస్ పర్యటనకు తీసుకెళ్లింది. రెస్టారెంట్ మూసివేయడం గురించి తన వినియోగదారులకు ఫేస్ బుక్ ద్వారా తెలియజేసింది. ట్రిప్ ప్రారంభానికి ముందు విమనాశ్రయంలో వెయిటింగ్ లాంజ్‌లో ఉద్యోగుల కూర్చున్న ఫొటోను సైతం సంస్థ ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది. "క్షమించండి.. మేము ఈ వారం రెస్టారెంట్‌ను మూసివేశాం. అన్ని సమాయాల్లోనూ మా ఉద్యోగులు చాలా కష్టపడి శ్రద్ధగా పనిచేశారు. కాబట్టి వారు విరామానికి అర్హులు. అందుకే వారిని వేగాస్ పర్యటనకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం" అని ఫోటోతో పాటు క్యాప్షన్ జత చేసింది.

ప్రస్తుతం ఈ పోస్టు ఆన్ లైన్‌లో వైరల్ అవుతోంది. రెస్టారెంట్ నిర్వాహాకులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ పోస్టుకు ఇప్పటికే ఫేస్ బుక్‌లో రెండు వేలకు పైగా లైకులు, దాదాపు 1.5 వేల షేర్లు వచ్చాయి. అంతేకాకుండా పలువురు నెటిజన్లు ఈ పోస్టుపై విశేషంగా స్పందించారు. "ఇది చాలా అద్భుతమైన ఆలోచన. ఉద్యోగులను ప్రశంసించడానికి ఇది గొప్ప మార్గం" అని ఓ వ్యక్తి కామెంట్ పెట్టారు.


హోటెల్ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ కామెంట్ సెక్షన్ ప్రతిస్పందనలతో నిండిపోయింది. ఇతర వ్యాపార సంస్థలు కూడా ఈ పోస్టును చూసి ప్రేరణ పొందాలని, కష్టపడి పనిచేసేవారికి తగిన ప్రతిఫలం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. లూయిస్ విల్లే యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం బట్టి చూస్తే.. సమీప భవిష్యత్తులో ఈ రెస్టారెంట్లో పనిచేసేందుకు ఉద్యోగ దరఖాస్తులు పోటెత్తే అవకాశం కనిపిస్తోంది.
Published by:Veera Babu
First published:

Tags: America, Employees, Vaccinated for Covid 19

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు