హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Omicron : వ్యాక్సిన్ వేసుకోకుంటే చావు తప్పదా? -USలో తొలి ఒమిక్రాన్ మరణం -UKలో ఇప్పటికే 12 మంది మృతి

Omicron : వ్యాక్సిన్ వేసుకోకుంటే చావు తప్పదా? -USలో తొలి ఒమిక్రాన్ మరణం -UKలో ఇప్పటికే 12 మంది మృతి

అమెరికాలో ఒమిక్రాన్ కారణంగా చనిపోయిన తొలి వ్యక్తి ఇప్పటిదాకా ఒక్క డోసు వ్యాక్సిన్ కూడా తీసుకోలేదని వెల్లడైంది. అటు బ్రిటన్ లోనూ తొలి ఒమిక్రాన్ మృతుడు వ్యాక్సిన్ వేసుకోలేదని ఆయన కుటుంబీకులు ఆలస్యంగా వెల్లడించారు. దీంతో వ్యాక్సిన్ వేసుకోకపోతే ఒమిక్రాన్ కాటుకు బలికాక తప్పదనే భయాందోళనలు పెరుగుతున్నాయి..

ఇంకా చదవండి ...

కరోనా మహమ్మారి రెండో వేవ్ లో లక్షల మందిని బలి తీసుకున్న డెల్టా వేరియంట్ కంటే ఐదు రెట్లు ప్రమాదకారి అయిన ఒమిక్రాన్ తన తీవ్రతను చాటుకుంటోంది. బ్రిటన్ లో స్వైర విహారం చేస్తోన్న కొత్త మహమ్మారి ఇప్పటికే 12 మందిని పొట్టనపెట్టుకుంది. కాగా, అగ్రరాజ్యం అమెరికాలోనూ ఇవాళ తొలి ఒమిక్రాన్ మరణం నమోంది. అమెరికాలో ఒమిక్రాన్ కారణంగా చనిపోయిన తొలి వ్యక్తి ఇప్పటిదాకా ఒక్క డోసు వ్యాక్సిన్ కూడా తీసుకోలేదని వెల్లడైంది. అటు బ్రిటన్ లోనూ తొలి ఒమిక్రాన్ మృతుడు వ్యాక్సిన్ వేసుకోలేదని ఆయన కుటుంబీకులు ఆలస్యంగా వెల్లడించారు. ఇప్పటిదాకా ప్రపంచ ఆరోగ్య సంస్థగానీ, ఆయా దేశాల ప్రభుత్వాలుగానీ అధికారికంగా హెచ్చరికలు చేయకున్నా జరుగుతోన్న పరిణామాలను బట్టి వ్యాక్సిన్ వేసుకోకపోతే ఒమిక్రాన్ కాటుకు బలికాక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో హెచ్చరికలు జారీ అయ్యాయి. వివరాలివి..

యూరప్ దేశాల్లో తీవ్ర ప్రభావం చూపుతూ, పదుల సంఖ్యలో మరణాలకు కారణమైంది ఒమిక్రాన్. ఈ కరోనా కొత్త వేరియంట్‌ అమెరికాలోనూ పురివిప్పుతోంది. ఒమిక్రాన్‌ కారణంగా అమెరికాలో మొదటి మరణం నమోదైంది. టెక్సాస్‌లోని హారిస్‌ కౌంటిలో సోమవారం ఓ వ్యక్తి మరణించినట్లు కౌంటీ ఆరోగ్యశాఖ పేర్కొంది. సదరు వ్యక్తి ఇప్పటి వరకు టీకా తీసుకోలేదని, అతని వయసు 50 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని ఏబీసీ న్యూస్‌ వెల్లడించింది.

shocking : దొరక్క దొరక్క దొరికింది.. అనుకునేలోపే సాంతం దోచేసింది.. ముదురు పెళ్లికూతురా మజాకా!అమెరికాలో ఒమిక్రాన్ వల్ల చనిపోయిన తొలి వ్యక్తి.. ఇంతకు రెండు సార్లు కొవిడ్‌ బారినపడ్డాడని, అయినా కూడా అతను వ్యాక్సిన్లపై వ్యతిరేకత కారణంగా టీకా వేయించుకోలేదని అధికారులు పేర్కొన్నారు. హారిస్ కౌంటీ మెజిస్ట్రేట్‌ లీనా హిడ్గాలో కరోనా కొత్త వేరియంట్‌ కారణంగా ఒకరు మృతి చెందారని, ఇదే ఒమిక్రాన్‌ కారణంగా నమోదైన తొలి మరణమని ట్వీట్‌ చేశారు. ఈ నెల 18 వరకు చేపట్టిన వీక్లీ సర్వేలో.. అమెరికాలో ఒమిక్రాన్ విజృంభిస్తున్నట్లు తేలింది. అమెరికాలో కరోనా కేసుల్లో 73శాతం ఒమిక్రాన్‌ వేరియంటే కారణమని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ సోమవారం పేర్కొంది.

wife delivery : నువ్వేం మనిషివయ్యా!! -YouTubeలో చూస్తూ భార్యకు ప్రసవం.. చివరికి ఇలా..దక్షిణాఫ్రికా నుంచి పుట్టుకొచ్చిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ రోజు రోజుకు ప్రపంచదేశాలకు విస్తరిస్తున్నది. ఇప్పటికే సుమారు 60కిపైగా దేశాలకు ఇది విస్తరించింది. యూరప్ దేశాల్లో ఒమిక్రాన్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో నెదర్లాండ్స్ ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించింది. ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్ లాంటి దేశాలు క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను రద్దు చేశాయి. బ్రిటన్‌లో రెండు వారాల కిందట తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. ఆ చనిపోయిన వ్యక్తి ఇప్పటిదాకా వ్యాక్సిన్ తీసుకోలేదని ఆలస్యంగా వెల్లడైంది. బ్రిటన్ లో సోమవారం నాటికి ఒమిక్రాన్ వల్ల 12 మంది మృత్యువాతపడ్డారు. వీళ్లలో వ్యాక్సిన్ పొందని వారు ఎందరనేది తెలియాల్సి ఉంది. మొత్తం 104 మంది ఒమిక్రాన్ బాధితులు ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని బ్రిటన్‌ ఉప ప్రధాని డొమినిక్‌ రాబ్‌ పేర్కొన్నారు.

First published:

Tags: Coronavirus, Covid, Omicron, Omicron corona variant, Uk, USA

ఉత్తమ కథలు