Home /News /international /

US RECORDS HIGHEST EVER DAILY NUMBER OF 512K COVID CASES AS OMICRON SPREADS CDC FORECAST ABOUT 45K NEW DEATHS MKS

అమెరికాలో Omicron కొవిడ్ కల్లోలం.. ఒక్కరోజులోనే 5లక్షల కొత్త కేసులు.. నెలలో 45వేల మరణాలు

అమెరికాలో కరోనా విలయం

అమెరికాలో కరోనా విలయం

రోనా పుట్టినప్పటి నుంచి లేనన్ని కొత్త కేసులు ఇప్పుడు ఒమిక్రాన్ వల్ల వస్తున్నాయి. అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (అంటువ్యాదుల నియంత్రణ, నివారణ కేంద్రం-సీడీసీ) లెక్కల ప్రకారం అమెరికాలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 5.12లక్షల కొత్త కేసులు, 1762 మరణాలు నమోదయ్యాయి. రాబోయే నెలలో 45వేల మంది చనిపోతారని..

ఇంకా చదవండి ...
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మూడో వేవ్ విలయతాండవం సృష్టిస్తోంది. రెండేళ్ల రికార్డులను చెరిపేస్తూ రెట్టింపు సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ మరణాలు భారీగా పెరిగాయి. కరోనా కాటుకు అమెరికాలో ఇప్పటికే 8.42లక్షల మంది బలైపోగా, రాబోయే నెల రోజుల్లో మరో 45 వేల మంది కచ్చితంగా చనిపోతారని నిపుణులు అంచనా వేశారు. భారతీయ వలసదారులు ఎక్కువగా నివసించే కాలిఫోర్నియా, న్యూయార్క్ రాష్ట్రాల్లో మహమ్మారి ప్రతాపం తీవ్రంగా ఉంది. కొత్తగా నమోదవుతోన్న, మరణాలు సంభవించిన కేసుల్లో సగానికిపైగా ఒమిక్రాన్ బాధితులే కావడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. వివరాలివి..

ఒమిక్రాన్ దెబ్బకు అమెరికా విలవిల్లాడుతోంది. పాత వేరియంట్లతో కలిసి కొత్త మహమ్మారి అక్కడ విలయవాతావారణానికి కారణమైంది. కరోనా పుట్టినప్పటి నుంచి లేనన్ని కొత్త కేసులు ఇప్పుడు ఒమిక్రాన్ వల్ల వస్తున్నాయి. అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (అంటువ్యాదుల నియంత్రణ, నివారణ కేంద్రం-సీడీసీ), జాన్ హోప్కిన్స్ యూనివర్సిటీ లెక్కల ప్రకారం అమెరికాలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 5.12లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 5.5 కోట్లకు చేరువైంది.

petrol price : మోదీకే మాస్టర్ స్ట్రోకా? పెట్రోల్ ధర రూ.25 తగ్గింపు ఉద్దేశమేంటి? 5రాష్ట్రాల ఎన్నికలు?



అమెరికాలో కరోనా కాటుకు నిన్న ఒక్కరోజే 1762 మంది బలయ్యారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 8.42లక్షలకు పెరిగింది. ప్రస్తుతం అక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య 1.2కోట్లుగా ఉంది. కొత్తగా నమోదైన ఇన్ఫెక్షన్లు, మరణాల్లో 58.6 శాతం ఒమిక్రాన్ కేసులేనని సీడీసీ తెలిపింది. గడిచిన వారం రోజులుగా అమెరికాలో రోజుకు సరాసరి 2.4లక్షల కొత్త కేసులు వస్తుండగా, మంగళవారం మాత్రం అతి భారీగా 5.12లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. కాలిఫోర్నియా, న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో కొత్త కేసులు, మరణాల ఉధృతి అధికంగా ఉంది.

Petrol price సంచలనం: లీటర్ పెట్రోల్‌పై రూ.25 తగ్గింపు.. ఆ కార్డు ఉన్నోళ్లకు మాత్రమే..



సీడీసీ నిపుణుల అచనాల ప్రకారం అమెరికాలో ప్రస్తుత మూడో వేవ్ మరో రెండు నెలలు కొనసాగనుంది. రాబోయే నాలుగు వారాల్లో కనీసం 45వేల కొవిడ్ మరణాలు నమోదవుతాయని సీడీసీ అధికారులు చెప్పారు. ప్రస్తుతం రోజువారీగా 1500పైచిలుకు మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మంగళవారం ఈ సంఖ్య 1700 దాటింది. కొత్త కేసులు, మరణాల పరంగా అమెరికాలో ఒమిక్రాన్ విలయాన్ని కొనసాగిస్తోంది. వైరస్ వ్యాప్తి పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఒక్క మంగళవారం రోజే 2,969 విమానాలు రద్దయ్యాయి. మరో 11,500 విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. కేవలం అమెరికాలోనే 1772 విమానాలు రద్దుకాగా, 5,458 విమాన సర్వీసులు వాయిదా పడ్డాయి. గడిచిన వారం రోజులుగా వేల సంఖ్యలో విమానాలు రద్దవుతుండటంతో క్రిస్మస్ సెలవులపై వెళ్లినవారు ఇళ్లకు తిరిగిరాలేక ఇబ్బందులు పడుతున్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: Covid, Omicron, USA

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు