హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Joe Biden : పుతిన్ ఓ కసాయి..ఉక్రెయిన్ శరణార్థులని గుండెలకు హత్తుకుని ఓదార్చిన బైడెన్

Joe Biden : పుతిన్ ఓ కసాయి..ఉక్రెయిన్ శరణార్థులని గుండెలకు హత్తుకుని ఓదార్చిన బైడెన్

Joe Biden MeetS Ukraine Refugees : ఉక్రెయిన్ పై మిలటరీ యాక్షన్ ను రష్యా మొదలుపెట్టిన ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటి వరకు ఉక్రెయిన్ ను వీడి ఇరుగు పొరుగు దేశాలకు వలస వెళ్లి శరణార్థులుగా మారిన వారి సంఖ్య కోటికి చేరిందని ఐక్యరాజ్య సమితి శరణార్థుల ఏజెన్సీ (UNHCR)తెలిపింది. ఎక్కువ మంది సరిహద్దు దేశమైన పోలండ్ కు వెళ్లారు. ప్రస్తుతం పోలాండ్‌లో దాదాపు 12-13 లక్షల మంది శరణార్థులు ఉన్నట్లు వార్సా యూనివర్సిటీలో మైగ్రేషన్ రీసెర్చ్ ప్రొఫెసర్‌ మాసీజ్ డస్జ్‌జిక్ అంచనా వేశారు.

ఇంకా చదవండి ...

USA President Biden Poland Tour :  ఉక్రెయిన్‌ పై రష్యా యుద్ధం కొనసాగుతున్న సమయంలో శనివారం అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్..ఉక్రెయిన్ సరిహద్దు దేశం పోలండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన తెలిసిందే. పేరుకు పోలండ్ ప‌ర్య‌ట‌నే అయినా.. బైడెన్ ప‌ర్య‌ట‌న సాంతం ఉక్రెయిన్ ప‌రిస్థితుల‌ను అంచనా వేసేందుకేన‌ని

తెలుస్తోంది. ఉక్రెయిన్‌ సైనికులు, ప్రజల్లో నైతిక స్ధైర్యాన్ని నింపేందుకే బైడెన్‌ అక్కడికి సరిహద్దు దేశం పోలాండ్‌లో పర్యటించినట్లు సృష్టంగా అర్థమవుతోంది. శనివారం పోలండ్ చేరుకున్న బైడెన్ తొలుత ఆ దేశాధ్య‌క్షుడితో భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. పలువురు ఉక్రెయిన్‌ అధికారులతో కూడా బైడెన్‌ చర్చించారు. ఉక్రెయిన్‌ రక్షణ మంత్రి రెజ్నికోవ్‌, విదేశాంగ మంత్రి ఇవానోవిచ్‌ కులేబాతో బైడెన్‌ భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌లో తాజా పరిస్ధితిపై బైడెన్‌కు వారు వివరించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత ఆ దేశ కీలక అధికారులతో బైడెన్ ముఖాముఖి సమావేశం కావడం ఇదే తొలిసారి.

కాగా,పోలండ్ పర్యటనలో శనివారం బైడెన్.. రష్యా బీక‌ర దాడుల‌తో భీతిల్లిపోయి ఉక్రెయిన్‌ నుంచి శరణార్థులుగా వచ్చిన వారిని పోలండ్ రాజ‌ధాని వార్సాలో కలిశారు. వార్సాలోని ఉక్రెయిన్ శ‌రణార్థుల వద్ద‌కు వెళ్లిన బైడెన్ వారిని త‌న గుండెల‌కు హ‌త్తుకుని ఓదార్చారు. ఈ సంద‌ర్భంగా త‌మ వారి కోసం ప్రార్థించండి అంటూ ఉక్రెయిన్ శ‌ర‌ణార్ధులు త‌న‌కు చేసిన విన్న‌పాల‌ను ఆయ‌న మౌనంగానే స్వీక‌రించారు. మీరంతా ఎంతో ధైర్యవంతులు అంటూ ఉక్రెయిన్‌ శరణార్థుల కుటుంబాలతో బైడెన్ అన్నారు. ఉక్రెయిన్ శ‌ర‌ణార్థుల‌ను త‌న గుండెల‌కు హత్తు‌కుని ఓదార్చుతున్న బైడెన్ ఫొటోలు వైర‌ల్‌ గా మారిపోయాయి. ర‌ష్యాతో యుద్ధం కార‌ణంగా ఉక్రెయిన్‌కు చెందిన ల‌క్షలాది మంది ప‌లు దేశాల‌కు శ‌ర‌ణార్ధులుగా త‌ర‌లి వెళ్లిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ పై మిలటరీ యాక్షన్ ను రష్యా మొదలుపెట్టిన ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటి వరకు ఉక్రెయిన్ ను వీడి ఇరుగు పొరుగు దేశాలకు వలస వెళ్లి శరణార్థులుగా మారిన వారి సంఖ్య కోటికి చేరిందని ఐక్యరాజ్య సమితి శరణార్థుల ఏజెన్సీ (UNHCR)తెలిపింది. ఎక్కువ మంది సరిహద్దు దేశమైన పోలండ్ కు వెళ్లారు. ప్రస్తుతం పోలాండ్‌లో దాదాపు 12-13 లక్షల మంది శరణార్థులు ఉన్నట్లు వార్సా యూనివర్సిటీలో మైగ్రేషన్ రీసెర్చ్ ప్రొఫెసర్‌ మాసీజ్ డస్జ్‌జిక్ అంచనా వేశారు.

ALSO READ Russia-Ukraine War : పుతిన్ తో మాట్లాడిన తర్వాత..రష్యా రక్షణ మంత్రికి గుండెపోటు!

పోలండ్ పర్యటన సందర్భంగా బైడెన్..యుద్ధంతో ఉక్రెయిన్‌ లో మారణకాండకు కారణమైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ను ఓ కసాయిగా అభివర్ణించారు బైడెన్. రష్యా సైనిక చర్యపై ప్రతిస్పందన విషయంలో నాటో తూర్పు భాగాన్ని పశ్చిమం నుంచి వేరు చేసేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ యత్నించారని జో బైడెన్‌ ఆరోపించారు. కానీ, ఇందులో విఫలమైనందుకు పుతిన్‌ ఆశ్చర్యపోయి ఉంటారని భావిస్తున్నానన్నారు. నాటో సభ్య దేశాలంతా ఐక్యంగా ఉన్నాయని చెప్పారు. ఐరోపాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా స్థిరత్వం అమెరికాకు చాలా ముఖ్యమని బైడెన్ తెలిపారు

First published:

Tags: Joe Biden, Russia-Ukraine War, Ukraine, Vladimir Putin

ఉత్తమ కథలు