హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

అమెరికా అధ్యక్ష అభ్యర్థి Joe Biden, Kamala Harris గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు

అమెరికా అధ్యక్ష అభ్యర్థి Joe Biden, Kamala Harris గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు

డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్

డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్

US Elections 2020 - Ganesh Chaturthi 2020 | అమెరికా, భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా గణేశ్ చతుర్థి పర్వదినాన్ని జరుపుకుంటున్న భారతీయులకు డెమోక్రటిక్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్(Joe Biden) శుభాకాంక్షలు తెలిపారు.

  అమెరికా, భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా గణేశ్ చతుర్థి పర్వదినాన్ని జరుపుకుంటున్న భారతీయులకు డెమోక్రటిక్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా హిందువులు వినాయక చవితి వేడుకలు జరుపుకుంటున్నారు. అటు అమెరికాలోనూ హిందువులు గణేశ చతుర్థి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 10 రోజుల పాటు నిత్యపూజలు అందుకోనున్న గణపయ్య విగ్రహాలను..చివరి రోజున నిమజ్జనం చేయనున్నారు. కోవిడ్-19 నేపథ్యంలో చాలా వరకు ఈ సారి నిరాడంబరంగా తమ ఇళ్లలోనే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భౌతికదూరం తదితర కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా హిందువుల పర్వదినం వినాయక చవితిని జరుపుకుంటున్న మీకు అన్ని విఘ్నాలు తొలగిపోవాలని కోరుకుంటున్నట్లు అమెరికా అధ్యక్ష అభ్యర్థి బైడెన్ పేర్కొన్నారు. దేవుడి విజ్ఞానపు ఆశీస్సులు కలగాలని, కొత్త ప్రారంభానికి దారి చూపించాలని కోరుకుంటున్నట్లు ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

  అటు భారత సంతతికి చెందిన కమలా హారిస్ కూడా భారతీయులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

  అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో జో బైడెన్, కమలా హారిస్ ...భారతీయులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం. ఇప్పటికే తమ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌ను బైడెన్ బరిలో నిలపడం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో తాము విజయం సాధిస్తే...భారత్ ఎదుర్కొంటున్న ప్రాంతీయ, సరిహద్దు వివాదాల్లో ఆ దేశానికి తాము అండగా నిలుస్తామని భారత స్వాతంత్ర్య దినోత్సవ రోజున జరిగిన ఓ కార్యక్రమంలో జో బైడెన్ హామీ ఇచ్చారు. అలాగే భారతీయులకు మేలు జరిగేలా హెచ్1బీ వీసాలను ప్రక్షాళన చేస్తామని, గ్రీన్ కార్డుల కోటాను ఎత్తివేస్తామని డెమోక్రటిక్ పార్టీ హామీ ఇచ్చింది.

  Published by:Janardhan V
  First published:

  Tags: Ganesh Chaturthi 2020, Joe Biden, US Elections 2020

  ఉత్తమ కథలు