హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

US Presidential Elections: ఆధునిక చరిత్రలో ట్రంప్ మోస్ట్ రెసిస్ట్ ప్రెసిడెంట్.. చివరి డిబేట్‌లో బిడెన్

US Presidential Elections: ఆధునిక చరిత్రలో ట్రంప్ మోస్ట్ రెసిస్ట్ ప్రెసిడెంట్.. చివరి డిబేట్‌లో బిడెన్

చివరి ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో పాల్గొన్న ట్రంప్, బిడెన్(Image-REUTERS)

చివరి ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో పాల్గొన్న ట్రంప్, బిడెన్(Image-REUTERS)

అమెరికా అధ్యక్ష ఎన్నికల చివరి ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో అధ్యక్ష అభ్యర్థులు డోనాల్డ్ ట్రంప్, జో బిడెన్‌ల మధ్య చర్చ కొనసాగుతుంది.

  అమెరికా అధ్యక్ష ఎన్నికల చివరి ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో అధ్యక్ష అభ్యర్థులు డోనాల్డ్ ట్రంప్, జో బిడెన్‌ల మధ్య చర్చ కొనసాగుతుంది. ఎన్నికలకు రెండు వారాల కంటే తక్కువ సమయం ఉండటంతో.. అందరి దృష్టి ఈ డిబేట్‌పైనే కేంద్రీకృతమైంది. ఈ డిబేట్‌లో కరోనాతో పాటు, ట్రంప్ అనుసరించిన వలస విధానంపై హోరా హోరిగా చర్చ జరిగింది. కరోనా మరణాల చీకటి కాలాన్ని ఆరికట్టడానికి ట్రంప్ ఎలాంటి ప్రణాళికలు చేపట్టలేదని బిడెన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లక్షలాది మంది మరణాలకు కారణమైన వ్యక్తికి మాట్లాడే అర్హత లేదని ట్రంప్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో కరోనా మరణాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. బిడెన్ వ్యాఖ్యలపై స్పందించిన ట్రంప్.. వైద్యంలో పురోగతి సాధించడం ద్వారా కరోనా త్వరలోనే అంతమవుతుందని వ్యాఖ్యానించారు. తొలి డిబేట్ తర్వాత కరోనా బారినపడిన తాను కోలుకున్నానని కూడా ఈ సందర్భంగా ట్రంప్ తెలిపారు.

  ఇక, మాజీ అధ్యక్షుడు బారాక్ ఒబామా పాలన గందరగోళ పరిస్థితులు నెలకొల్పిందని విమర్శించారు. ఉత్తర కొరియాతో సంబంధాల విషయంలో సరిగా వ్యవహరించలేదని అన్నారు. అయితే తాను అధికారంలోకి వచ్చాక లక్షలాది మంది ప్రాణాలకు ముప్పు కలిగించే యుద్దాన్ని తప్పించానని చెప్పుకొచ్చారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చిన బిడెన్.. కిమ్‌తో సంబంధాలు ఏర్పరుచుకోవడం ద్వారా ట్రంప్ ఓ దుండగుడిని చట్టబద్ధం చేశారని మండిపడ్డారు. మరోవైపు ట్రంప్ అనుసరించిన వలస విధానాన్ని బిడెన్ తీవ్రంగా తప్పుబట్టారు. అమెరికాలో సంస్థాగత జాత్యహంకారం ఉందని.. తాము ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తామని చెప్పారు. ఆధునిక చరిత్రలో ట్రంప్ మోస్ట్ రెసిస్ట్ ప్రెసిడెంట్ అని ఆరోపించారు.

  అయితే అంతకుముందు ట్రంప్ మాట్లాడుతూ.. నల్ల జాతీయుల కోసం తాను చేసినదానికంటే ఏ అధ్యక్షుడు కూడా ఎక్కువగా చేయలేదని.. ఇక్కడున్నవారిలో అతి తక్కువ జాత్యహంకారం కలిగిన వ్యక్తినని చెప్పుకొచ్చారు. ఇక, అమెరికా పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలుగుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్థించుకున్నారు. గాలి కాలుష్యం కాకుండా చూసుకోవడంలో భారత్, చైనా, రష్యాలు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదని విమర్శించారు.

  ఇక, సెప్టెంబర్‌లో జరిగిన తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో ట్రంప్, బిడెన్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ డిబేట్‌లో అవసరమైన సమయంలో మైక్ కట్ చేసేలా మ్యూట్ బటన్‌ను తీసుకొచ్చారు. మొత్తంగా అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య మూడు డిబేట్స్ నిర్వహిస్తారు. అయితే ట్రంప్ కరోనా బారిన పడటం.. వర్చువల్ డిబేట్‌కు ఆయన విముఖత వ్యక్తం చేయడంతో రెండో డిబెట్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Donald trump, Joe Biden, US Elections 2020

  ఉత్తమ కథలు