హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

US Presidential Election 2020: అమెరికా ప్రజలు అధ్యక్షుణ్ని ఎలా ఎన్నుకుంటారు?

US Presidential Election 2020: అమెరికా ప్రజలు అధ్యక్షుణ్ని ఎలా ఎన్నుకుంటారు?

జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ (File)

జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ (File)

US Presidential Election 2020: అమెరికా అధ్యక్ష ఎన్నికల టైమ్ దగ్గర పడుతోంది. ట్రంప్ ప్రత్యర్తి జో బిడెన్‌కి ప్రజాధరణ పెరుగుతోంది. అసలు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం.

US Presidential Election 2020: ప్రపంచంలో అత్యంత ప్రాచీన, అత్యంత శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశం అమెరికాలో... అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నవంబర్‌లో ప్రజలు అమెరికా అధ్యక్షుణ్ని ఎన్నుకుంటారు. ప్రపంచంలో ప్రధానంగా నాలుగు రకాల పాలనా విధానాలు ఉన్నాయి. అధ్యక్ష పాలన, పార్లమెంటరీ పాలన, స్విస్ సిస్టమ్, కమ్యూనిజం. అమెరికన్లు అధ్యక్ష పాలనను ఎంచుకున్నారు. ఫలితంగా... అధ్యక్షుడే అక్కడ సర్వాధికారి. ఆయన నిర్ణయానికి తిరుగుండదు. ఎవర్నీ అడగకుండానే నిర్ణయం తీసుకోగలిగే సూపర్ పవర్స్ అధ్యక్షుడికి ఉంటాయి. అందుకే అమెరికా అధ్యక్షుడు చేసే ప్రతి ప్రకటనా ప్రపంచ దేశాలపై ప్రభావం చూపిస్తుంది. మరి అధ్యక్షుణ్ని ఎలా ఎన్నుకుంటారు?

అమెరికా అధ్యక్ష ఎన్నికల విధానం:

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలియాలంటే... ముందు మనం... 244 ఏళ్ల అమెరికా ప్రజాస్వామ్య విధానం ఎలా ఉంటుందో గ్రహించాలి. అక్కడ ఏ సంవత్సరంలో ఎన్నికలు జరగాలి, ఏ రోజు ఎన్నికలు జరపాలి, ఎప్పుడు ఫలితాలు ప్రకటించాలి, ఎప్పుడు కొత్త అధ్యక్షుడు ప్రమాణస్వీకారం చెయ్యాలి... వంటి అన్నీ ముందే ఫిక్స్ చేస్తారు. మన దేశంలో 2024లో ఎన్నికలు జరగాలని ముందే ఫిక్స్ చెయ్యరు. ఎప్పుడు జరుగుతాయో చెప్పలేం. అమెరికాలో మాత్రం... నెక్ట్స్ ఎన్నికలు 2024లో జరుగుతాయి. అది ఫిక్స్.

అధ్యక్ష ఎన్నికలు ఏ సంవత్సరంలో జరుగుతాయి?:

ప్రతి సంవత్సరం లీప్ సంవత్సరంలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. మీకు తెలుసుగా... లీప్ ఇయర్లో సంవత్సరానికి 366 రోజులు ఉంటాయి. ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయి. మనం గ్రహించాల్సింది ఏంటంటే... మొదటి, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో కూడా... అమెరికా అధ్యక్ష ఎన్నికలు టైమ్ ప్రకారమే జరిగాయి.

ఎన్నికల ఏడాదిలో... సంవత్సరం మొత్తం ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. ఎన్నికలు జరిగే రోజు, ప్రమాణ స్వీకారం చేసే రోజు ఎప్పుడన్నది మాత్రం రాజ్యాంగంలో రాసి ఉంటుంది. ఎన్నికలు నవంబర్‌లో మొదటి మంగళవారం ఉంటాయి. కొత్త అధ్యక్షుడు తర్వాతి సంవత్సరం జనవరి 20న ప్రమాణస్వీకారం చేస్తారు.

మరో చిత్రమేంటంటే... ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వచ్చినా... సదరు అభ్యర్థి గెలుస్తాడన్న నమ్మకం లేదు. మీకు తెలుసుగా... 2016లో డొనాల్డ్ ట్రంప్ కంటే... హిల్లరీ క్లింటన్‌కి ఎక్కువ ఓట్లు వచ్చాయి. కానీ ఆమె ఓడిపోయింది.

అమెరికా అధ్యక్షుణ్ని ఎవరు ఎన్నుకుంటారు?:

అమెరికా ప్రజలు తమ అధ్యక్షుణ్ని డైరెక్టుగా ఎన్నుకోరు. వారు ఎలక్టొరల్ కాలేజీని మాత్రమే ఎన్నుకుంటారు. అమెరికా కాంగ్రెస్‌లో ఎంత మంది సభ్యులుంటారో... అంతే మంది ఎలక్టొరల్ కాలేజీలో ఉంటారు. అమెరికా కాంగ్రెస్ అంటే... అమెరికా పార్లమెంట్ అన్నమాట. ఇందులో రెండు సభలుంటాయి. ఒకటి సెనెట్. రెండోది ప్రతినిధుల సభ. సెనెట్ అనేది ఎగువ సభ. ప్రతినిధుల సభ అనేది దిగువ సభ.

ఎగువ సభ (సెనెట్)లో సభ్యుల ఎన్నికకూ... ఇండియాలో ఎన్నికకూ తేడా ఉంటుంది. ఇండియాలో రాజ్యసభ సభ్యులను పరోక్షంగా ఎన్నుకుంటారు. అమెరికాలో మాత్రం డైరెక్టుగా ఎన్నుకొని సెనెట్‌కి పంపుతారు.

ప్రతినిధుల సభ (దిగువ సభ)లో 435 ప్లస్ మరో 3 సభ్యులుంటారు. ఆ ముగ్గురూ వాషింగ్టన్ డీసీకి ప్రాతినిధ్యం వహిస్తారు. అక్కడ అలాంటి ఓ ప్రత్యేకత ఉంది. సెనెట్ (ఎగువ సభ)లో 100 మంది సభ్యులుంటారు.

ఎలక్టొరల్ కాలేజీలో... అమెరికాలోని అన్ని రాష్ట్రాలకూ దామాషా ప్రకారం కోటా ఉంటుంది. అంటే... ఆయా రాష్టారలకు సెనెట్, ప్రతినిధుల సభలో ఉన్న కోటాను బట్టి... ఎలక్టొరల్ కాలేజీలో వారి కోటా ఫిక్స్ అవుతుంది. ఇండియాలోలాగే... అమెరికాలోనూ చాలా రాజకీయ పార్టీలు ఉన్నా... రెండు పార్టీలే ఆధిపత్యం చెలాయిస్తాయి. వాటి చుట్టే అమెరికా రాజకీయాలూ చక్కర్లు కొడతాయి. అవే డెమొక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ.

లిస్ట్ సిస్టం అంటే ఏంటి?

ప్రజలు అమెరికా ఎలక్టొరల్ కాలేజీ సభ్యులను ఎన్నుకోవడానికి లిస్ట్ సిస్టంను అమలు చేస్తున్నారు. అంటే... లిస్ట్ గెలుపు లేదా లిస్ట్ ఓటమి. ఇంకా ఈజీగా దీన్ని అర్థం చేసుకుందాం. కాలిఫోర్నియా రాష్ట్రాన్ని తీసుకుందాం. అక్కడ డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు... 55 మంది అభ్యర్థుల లిస్టును జారీ చేస్తాయి. ఓటర్లు... వారందరినీ గెలిపించాలి, లేదా అందర్నీ ఓడించాలి. అంతేగానీ... కొంత మందిని గెలిపించడం, కొంతమందిని ఓడించడం అన్నది ఉండదు. ఈ కారణంగానే... తక్కువ ఓట్లు వచ్చి కూడా ట్రంప్ విజయం సాధించారు.

ప్రెసిడెన్షియల్ ప్రైమరీస్ అంటే:

ఇండియాలో... ప్రధాని అభ్యర్థి ఎవరనేది ప్రజలు డిసైడ్ చెయ్యరు. పార్టీలు డిసైడ్ చేస్తాయి. అమెరికాలో మాత్రం తమ అధ్యక్షుడు ఎవరనేది ప్రజలే డిసైడ్ చేస్తారు. అటు డెమొక్రాట్ల తరపున ఓ అభ్యర్థి, ఇటు రిపబ్లికన్ల తరపున ఓ అభ్యర్థిని ప్రజలే ఎంపిక చేస్తారు. ఇందులో పార్టీలకు ఛాన్స్ ఉండదు. అమెరికాలో ఈ రెండు పార్టీల నుంచి తామే అధ్యక్ష అభ్యర్థులం అని చాలా మంది అనుకుంటారు. కానీ... ఫైనల్ అభ్యర్థి ఎవరో ప్రజలే డిసైడ్ చేస్తారు.

అమెరికాలో అధ్యక్ష అభ్యర్థిని ప్రజలతోపాటూ... పార్టీ సభ్యులు డిసైడ్ చేస్తారు. అంతే తప్ప పార్టీలు సొంతంగా డిసైడ్ చెయ్యలేవు. ఈ విధానాన్నే ప్రెసిడెన్షియల్ ప్రైమరీస్ అంటారు. ఈ ప్రక్రియ 1970లో మొదలైంది. ఈ ప్రైమరీ విధానాన్ని 34 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. మిగతా 16 రాష్ట్రాల్లో కోకస్ సిస్టం ఉంది. ప్రైమరీస్‌లో అధ్యక్ష అభ్యర్థిని ప్రజలు డిసైడ్ చేస్తారు. కోకస్ (Coccus) విధానంలో... ప్రముఖ నేతలు అధ్యక్ష అభ్యర్థిని డిసైడ్ చేస్తారు. ఇందుకోసం ఓ కమిషన్ ఏర్పాటవుతుంది. ఈ కమిషన్ కొన్ని సూచనలు చేస్తుంది. ఈ సూచనల్ని కొన్ని పార్టీలు పాటిస్తాయి. కొన్ని వ్యతిరేకిస్తాయి. ఈ కమిషన్‌కి రాజ్యాంగ బధ్ధత లేదు.

ప్రెసిడెన్షియల్ ప్రైమరీస్‌ వర్కర్లు... తమ అభ్యర్థిని ఎంపిక చేసుకుంటారు. లేదా... నేషనల్ కన్వెన్షన్ కోసం ఓ ఎన్నిక జరుగుతుంది. ఈ నేషనల్ కన్వెన్షన్‌లో డెలిగేట్స్, సూపర్ డెలిగేట్స్ ఉంటారు. వాళ్లు రెండు పార్టీలకూ ఉంటారు.

డెలిగేట్స్, సూపర్ డెలిగేట్స్ మధ్య తేడా ఏంటి?

నేషనల్ కన్వెషన్‌లో రాష్ట్రాల నుంచి ఎన్నికైన వారు డెలిగేట్స్. సూపర్ డెలిగేట్స్ అంటే... ఆల్రెడీ పార్టీ అధ్యక్షులు లేదా... మాజీ అధ్యక్షులు, సూపర్ డెలిగేట్స్‌ని నియమించే పార్టీ పార్లమెంట్ సభ్యులు. ఈ ఎన్నిక ఆగస్టులో జరుగుతుంది. నేషనల్ కన్వెన్షన్‌లో... ఫైనల్ అభ్యర్థులను ఎన్నుకుంటారు. ఇందులోనే డెమొక్రటిక్ పార్టీ తరపున ఎవరు అభ్యర్థిగా నిలబడాలి, రిపబ్లికన్ పార్టీ తరపున ఎవరు అభ్యర్థిగా నిలబడాలో డిసైడ్ చేస్తారు. ఈ నేషనల్ కన్వెన్షన్... వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు సమయాల్లో ఏర్పాటవుతుంది. ఈ మొత్తం ప్రక్రియ ఓ నెలపాటూ కొనసాగుతుంది.

అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైన వారు... ఉపాధ్యక్ష అభ్యర్థిని తనకు వీలైన వారిని ఎన్నుకోవచ్చు. ఇదంతా జరిగాక... ఎన్నికల ప్రచారానికి 2 నెలల సమయం ఉంటుంది. అంటే... సెప్టెంబర్, అక్టోబర్. ఈ రెండు నెలల్లో ఎన్నికల ప్రచారానికి బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేస్తారు. అందుకే... ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఎన్నికలుగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు నిలుస్తున్నాయి.

అమెరికాలో ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది?

ఇండియాలోలాగా అమెరికాలో భారీ ర్యాలీలుండవు. అక్కడ డిబేట్లు టీవీలో జరుగుతాయి. రెండు పార్టీల అభ్యర్థులూ... లైవ్ టీవీ డిబేట్స్‌లో పాల్గొంటారు. ఆ తర్వాత... నవంబర్ మొదటి మంగళవారం ఎన్నిక జరుగుతుంది. ఈ సంవత్సరం నవంబర్ 3న ఇది ఉంటుంది. ఆ రోజున అమెరికా ప్రజలు... ఎలక్టొరల్ కాలేజీ సభ్యులను ఎన్నుకుంటారు. ఈ ఎన్నిక అమెరికా అంతటా ఒకే రోజు జరుగుతుంది. ఆ రోజు... అధ్యక్షుడి ఎన్నిక, పార్లమెంట్ సభ్యుల ఎన్నిక, కాన్సిలర్ల ఎన్నిక, గవర్నర్ల పోస్టుకు ఎన్నిక అన్నీ జరుగుతాయి.

ఎలక్టొరల్ కాలేజీలో సభ్యులు... తమ పార్టీ అభ్యర్థినే ఎన్నుకోవాలనే రాజ్యాంగ బద్ధమైన రూల్ ఏదీ లేదు. మొత్తంగా ఎవరైతే 270 లేదా అంతకంటే ఎక్కువ ఓట్లు సాధిస్తారో, వారు అధ్యక్షులు అవుతారు. ఆ తర్వాత వచ్చే సంవత్సరం జనవరి 20న ప్రమాణ స్వీకారం ఉంటుంది.

US Presidential Election 2020, us presidential election process, How do Americans choose their president, us presidential election news, us presidential election polls, us presidential election results date, us presidential election 2020 date, us presidential election results, అమెరికా అధ్యక్ష ఎన్నికలు, అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ, అమెరికా అధ్యక్ష ఎన్నికల విధానం, అమెరికన్లు అధ్యక్షుణ్ని ఎలా ఎన్నుకుంటారు,
జో బిడెన్ (ఎడమ), డొనాల్డ్ ట్రంప్ (కుడి) (File)

2020 అధ్యక్ష అభ్యర్థులు ఎవరు?

ఈసారి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ ఉండగా... డెమొక్రటిక్ పార్టీ తరపున జో బిడెన్ అభ్యర్థిగా ఉన్నారు. ట్రంప్... ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా... మైక్ పెన్స్‌ని ఎంచుకోగా... జో బిడెన్... కమలా హ్యారిస్‌ను ఎంచుకున్నారు.

(పంకజ్ కుమార్, న్యూస్18)

Published by:Krishna Kumar N
First published:

Tags: US Elections 2020

ఉత్తమ కథలు