రోజూ కరోనా పరీక్షలు చేయించుకుంటానన్న ట్రంప్.. కారణమిదే..

రోజూ కరోనా పరీక్షలు చేయించుకుంటానన్న ట్రంప్.. కారణమిదే..

డొనాల్డ్ ట్రంప్ (File)

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇక నుంచి నిత్యం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటానని ప్రకటించారు. అమెరికాలోని శ్వేతసౌధంలో పనిచేస్తున్న ట్రంప్ వ్యక్తిగత సహాయకుడికి కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

  • Share this:
    ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇక నుంచి నిత్యం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటానని ప్రకటించారు. ఇందుకు కారణం లేకపోలేదు. అమెరికాలోని శ్వేతసౌధంలో పనిచేస్తున్న ట్రంప్ వ్యక్తిగత సహాయకుడికి కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్వేతసౌధంలో అధ్యక్షుడి వద్ద పనిచేసే సిబ్బందికి ప్రతిరోజు పరీక్షలు చేస్తున్నారు. ‘మీరు ఏం చేసినా, కరోనా నిర్ధారణ పరీక్ష కచ్చితం కాదు. ఇప్పటివరకు వారానికోసారి వైరస్ నిర్ధారణ పరీక్షులు చేయించుకున్నాం. ఇక నుంచి రోజుకొకసారి చేయించుకుంటాం. రోజూ పరీక్షలు చేసినా ఏదో జరుగుతుంది. వైరస్ సోకిన వ్యక్తితో అంత సన్నిహితంగా లేను. ఆ వ్యక్తిగత సహాయకుడు మంచి వ్యక్తి. అయితే ఇది వింతగా ఉంది.’ అంటూ తన అధికారిక నివాసంలో జరిగిన సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలావుంటే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌కు నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందని అధికారిక ప్రతినిధి తెలిపారు. అయితే ఈ సమావేశం జరుగుతున్నంత సేపు వారిద్దరూ మాస్కులు ధరించలేదని తెలుస్తోంది. వారేకాక అక్కడి సిబ్బంది సైతం మాస్కులు ధరించడం లేదు.
    Published by:Narsimha Badhini
    First published: