బిన్ లాడెన్ కుమారుడు మృతి చెందినట్లు ధ్రువీకరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

హమ్జా బిన్ లాడెన్ ఆఫ్గనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దుల్లో జరిగిన దాడుల్లో మరణించినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అలాగే అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ హమ్జా బిన్ లాడెన్ మరణంతో ముఖ్య నాయకుడిని కోల్పోయిందని తెలిపారు.

news18-telugu
Updated: September 14, 2019, 10:45 PM IST
బిన్ లాడెన్ కుమారుడు మృతి చెందినట్లు ధ్రువీకరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
బిన్ లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్ ఖతం
  • Share this:
అంతర్జాతీయ ఉగ్రవాది ఉసామా బిన్ లాడెన్ కుమారుడు, మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది హమ్జా బిన్ లాడెన్ అమెరికా భద్రతా కాల్పులలో మరణించాడని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. హమ్జా బిన్ లాడెన్ ఆఫ్గనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దుల్లో జరిగిన దాడుల్లో మరణించినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అలాగే అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ హమ్జా బిన్ లాడెన్ మరణంతో ముఖ్య నాయకుడిని కోల్పోయిందని తెలిపారు. ఈ మేరకు అమెరికా అధ్యక్ష నివాసం వైట్ హౌస్ జారీ చేసిన ఒక ప్రకటనలో ట్రంప్ ప్రకటించారు. ఇదిలా ఉంటే రెండేళ్ల క్రితమే అమెరికా భద్రతా దళాల సైనిక చర్యలో హమ్జా బిన్ లాడెన్ మరణించినట్లు అమెరికా నిఘా సంస్థ సీఐఏ పేర్కొంది.

ఉసామా బిన్ లాడెన్‌ 20 మంది సంతానంలో 15వ సంతానమైన హమ్జా బిన్ లాడెన్‌ తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని అల్ ఖైదాలో కీలక నాయకుడిగా ఎదిగాడు. అమెరికా భద్రతా దళాలు అతడి తలకు 10 లక్షల డాలర్ల బహుమానాన్ని ప్రకటించాయి. ఇదిలా ఉంటే తండ్రి బిన్ లాడెన్ ఇప్పటికే అబోటాబాద్ ఆపరేషన్ లో అమెరికా భద్రతా దళాల చేతిలో నేలకొరిగిన విషయం తెలిసిందే.

First published: September 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>