హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Viral tweet: అమెరికా అధ్యక్షుడి ఆఫీస్‌లో మార్పులు... ట్రంప్ ఏర్పాటు చేయించిన ఆ బటన్‌ తొలగింపు

Viral tweet: అమెరికా అధ్యక్షుడి ఆఫీస్‌లో మార్పులు... ట్రంప్ ఏర్పాటు చేయించిన ఆ బటన్‌ తొలగింపు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (ప్రతీకాత్మక చిత్రం)

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (ప్రతీకాత్మక చిత్రం)

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్ కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికాకు 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత బైడెన్ తన ఆఫీసు వాతావరణాన్ని పూర్తిగా మారుస్తున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్ కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికాకు 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత బైడెన్ తన ఆఫీసు వాతావరణాన్ని పూర్తిగా మారుస్తున్నారు. దీనికి సంబంధించిన వార్తలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ బుధవారం క్యాపిటల్ హిల్ బిల్డింగ్ వద్ద బైడెన్, కమలా హారిస్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ప్రెసిడెంట్ అధికారిక కార్యాలయమైన ఓవల్ ఆఫీస్‌ను ఇప్పుడు పూర్తిగా మార్చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్‌ హయాంలో ఓవల్ ఆఫీస్‌లోని అతడి డెస్క్‌పై ఒక రెడ్ బటన్ ఉండేది. వైట్‌హౌజ్‌లో ట్రంప్‌ను ఇంటర్యూ చేసినప్పుడు ఒక జర్నలిస్ట్ దీన్ని గుర్తించాడు. ఆ బటన్ నొక్కగానే సిబ్బంది వెండి పళ్లెంలో డైట్ కోక్ తీసుకువచ్చి ఆయనకు అందించేవారు. తాజాగా దీన్ని తొలగించాలని బైడెన్ వైట్‌హౌజ్ సిబ్బందిని ఆదేశించారు. ఈ వివరాలను టామ్ న్యూటన్ డన్ (Tom Newton Dunn) వార్తాసంస్థ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

బైడెన్ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆఫీస్ డెస్క్ ఫోటోను, గతంలో ట్రంప్‌ ఆఫీస్‌లో ఉన్నప్పటి ఫోటోలను న్యూటన్ డన్ వార్తాసంస్థ ప్రచురించింది. ట్రంప్ ఏర్పాటు చేయించిన డైట్ కోక్ బటన్ కొత్త డెస్క్‌పై లేదు. దాన్ని తీసివేయమని బైడెన్ సూచించాడట. "ప్రెసిడెంట్ బైడెన్ డైట్ కోక్ బటన్‌ను తొలగించారు. 2019లో మేము ట్రంప్‌ను ఇంటర్యూ చేసినప్పుడు ఆ రెడ్ కలర్ బటన్‌పై తెలియని ఆసక్తి ఏర్పడింది. ట్రంప్ దాన్ని నొక్కగానే సిబ్బంది డైట్ కోక్‌ తీసుకువచ్చారు. ఇప్పుడు ఆ బటన్ పోయింది" అని న్యూటన్ డన్ వార్తాసంస్థ ఈ ఫోటోలకు ట్యాగ్‌ పెట్టింది.

* ఇంటర్నెట్లో వైరల్

న్యూటన్ డన్ చేసిన ఈ ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయింది. ట్రంప్ వ్యవహార శైలి నచ్చనివారు అతడిపై మీమ్స్ తయారు చేసి పోస్ట్ చేస్తున్నారు. కొంతమంది యూజర్లు వెరైటీ కామెంట్లు పెడుతూ జోక్స్ పేలుస్తున్నారు. ఈ ట్వీట్‌ను లక్షమందికి పైగా లైక్ చేశారు. 23వేల మంది రీట్వీట్‌ చేశారు. ఇలాంటి మార్పులు ఇంకా ఎన్నో చేయాల్సి ఉందని బైడెన్ అభిమానులు ఈ ట్వీట్‌కు కామెంట్లు పెడుతున్నారు. నెటిజన్లు ఈ మార్పుపై తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. బైడెన్ తన ఆఫీస్‌లో సీజర్ ఛావెజ్, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, రోసా పార్క్స్ వంటి కార్మిక నాయకులు, పౌర హక్కుల కార్యకర్తల శిల్పాలను ఏర్పాటు చేయించారు.

First published:

Tags: Donald trump, Joe Biden, Us, White house

ఉత్తమ కథలు