Joe Biden- Dr Pritesh Gandhi: జో బైడెన్ మరో కీలక నిర్ణయం.. ఏరి కోరి మరో భారతీయుడికి ప్రభుత్వంలో చోటు..

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, డాక్టర్ ప్రితేష్ గాంధీ (ఫైల్ ఫొటోలు)

గతంలో ట్రంప్ తీసుకున్న పలు వివాదాస్పద నిర్ణయాలను జో బైడెన్ పున:సమీక్ష చేస్తున్నారు. ప్రమాణస్వీకారానికి ముందే తన టీమ్ లో పెద్ద సంఖ్యలో భారత సంతతి పౌరులకు చోటు కల్పించిన జో బైడెన్, తాజాగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనిపై అమెరికాలోని భారతీయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

  • Share this:
    అమెరికా అధ్యక్షుడిగా జనవరి 20న ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి జో బైడెన్ వరుస నిర్ణయాలతో దూకుడు పెంచుతున్నారు. ఇప్పటికే గతంలో ట్రంప్ తీసుకున్న పలు వివాదాస్పద నిర్ణయాలను పున:సమీక్ష చేస్తున్నారు. ప్రమాణస్వీకారానికి ముందే తన టీమ్ లో పెద్ద సంఖ్యలో భారత సంతతి పౌరులకు చోటు కల్పించిన జో బైడెన్, తాజాగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. మరో భారత సంతతి వ్యక్తికి అమెరికా ప్రభుత్వంలో కీలక పదవిని ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. జోబైడెన్ సర్కారులో భారత అమెరికన్ డాక్టర్ ప్రితేష్ గాంధీకి చోటు కల్పించారు. ఆయనను హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా జో బైడెన్ నిర్ణయించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీకి ఆయన అడ్వైజర్ గా పనిచేయనున్నారు.

    జో బైడెన్ సర్కారులో ప్రితేష్ గాంధీకి చోటు దక్కడంపై భారతీయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆ పదవిలో ఉండి బోర్డర్ హెల్త్, కరోనా వంటి విపత్తులు వచ్చినప్పుడు తక్షణం తీసుకోవాల్సిన చర్యలు, టూరిజం, విపత్తుల వంటివి మనుషులపై చూపే ప్రభావాలపై ప్రితేష్ గాంధీ పనిచేయనున్నారు. ఈ పదవిలో ఉండి సమర్థవంతంగా పనిచేస్తానని, తనకు ఈ అవకాశాన్ని కల్పింని జో బైడెన్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ప్రితేష్ గాంధీ చెబుతున్నారు. ఇదిలా ఉండగా, పీపుల్స్ కమ్యూనిటీ క్లినిక్ లో అసోసియేట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్, డైరెక్టర్ గా ఆయన గతంలో విధులు నిర్వహించారు. ఆస్టిన్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన క్లినిక్స్ లో అది కూడా ఒకటి.

    ఇదిలా ఉండగా, జో బైడెన్ సర్కారు భారత సంతతి నేతలకు కీలక పదవులు ఇవ్వడంతో భారతీయ సంఘాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. డెమోక్రాట్స్ ఎప్పుడూ భారత సంతతికి పెద్ద పీట వేస్తుంటారన్న తమ నమ్మకం మరోసారి నిజమైందంటున్నారు. ఇప్పటికే హెచ్1బీ వీసాదారులకు జో బైడెన్ శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు కూడా అమెరికాలో ఉద్యోగాలు చేయొచ్చన్న ప్రతిపాదనలకు జో బైడెన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒబామా హయాంలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నా, ట్రంప్ సర్కారు దీన్ని రద్దుచేసింది. తాజాగా ట్రంప్ నిర్ణయాన్ని జో బైడెన్ రద్దు చేసి, జీవిత భాగస్వాములు కూడా ఉద్యోగాలు చేయొచ్చంటూ హెచ్ 1బీ వీసాదారులకు పండగలాంటి వార్తను చెప్పారు.
    Published by:Hasaan Kandula
    First published: