అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన టీమ్‌లో భారత సంతతి అమెరికన్లకు పెద్ద పీట వేస్తున్నారు. ఇప్పటికే 20 మందికి పైగా భారత సంతతి వ్యక్తులను తన టీమ్‌లో నియమించుకున్న బైడెన్.. తాజాగా, ఇద్దరు భారత సంతతి మహిళలను కీలక పదవుల్లో నియమించారు. వీరిలో ఒకరు మీరా జోషి. ఈమెను రవాణా శాఖలోని ఫెడరల్ మోటార్ క్యారియర్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌కు అడ్మినిస్ట్రేటర్‌గా నామినేట్ చేశారు. అలాగే, మరో భారత సంతతి మహిళ రాధిక ఫాక్స్‌ను పర్యావరణ పరిరక్షణ సంస్థ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్‌గా నామినేట్ చేసినట్లు వైట్‌హౌజ్ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన 2021 జనవరి 20 నాటి నుండి ఈ ఇద్దరూ ఆయన అడ్మినిస్ట్రేషన్‌లో పనిచేస్తున్నారు. మీరా జోషి ఇప్పటివరకు డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో ఫెడరల్ మోటార్ క్యారియర్ డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తుండగా.. ఆమెకు ఇప్పుడు అదే శాఖలో అడ్మినిస్ట్రేటర్‌గా ప్రమోషన్ దక్కింది.
ఇక, రాధికా ఫాక్స్ వాటర్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీలో ప్రిన్సిపల్ డిప్యూటీ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తుండగా.. ఆమెకు ఇప్పుడు ఇదే శాఖలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్‌గా ప్రమోషన్ లభించింది. కాగా, వీరిద్దరితో పాటు ప్రస్తుతం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఫైజల్ అమీన్‌కు పదోన్నతి కల్పించే యోచనలో ఉన్నట్లు జో బైడెన్ తెలిపారు.ఫైజల్‌ను పర్యావరణ పరిరక్షణ సంస్థకు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా నియమించే అవకాశం ఉంది.
డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటీరియర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ వంటి కీలక శాఖల్లో మొత్తం 12 కీలక పోస్టులకు అభ్యర్థులను నామినేట్ చేసే పనిలో ఉన్నారు జో బైడెన్. ఇందులో భాగంగానే ఈ ముగ్గురికీ పదోన్నతి కల్పించనున్నారు.
సీనియర్ న్యాయవాది అయిన మీరా జోషికి వివిధ ప్రభుత్వ పర్యవేక్షణ సంస్థల్లో దశాబ్దానికి పైగా పనిచేసిన అనుభవం ఉంది. ఆమె ప్రస్తుతం న్యూయార్క్ సిటీ టాక్సీ అండ్ లిమోసిన్ కమిషన్ చైర్పర్సన్, సీఈఓగా కూడా పనిచేస్తున్నారు.
దేశంలోనే అతిపెద్ద హైర్ ట్రాన్స్‌పోర్టేషన్ రెగ్యులేటర్‌లో చేపట్టిన ‘విజన్ జీరో’ క్యాంపెయిన్‌కు ఆమె నాయకత్వం వహించారు. అధిక -ప్రమాదం ఉన్న డ్రైవర్లు, అసురక్షిత వాహనాలను కట్టడి చేసేందుకు, ప్రమాదాలను తగ్గంచేందుకు ఆమె కృషి చేశారు. రాధికా ఫాక్స్ ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్లో చేరక ముందు యూఎస్ వాటర్ అలయన్స్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేశారు. నీటికి సంబంధించిన సమస్యలు పరిష్కరించడంలో ఆమె సమర్థవంతమైన ఆఫీసర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో ఆమె ఫెడరల్ పాలసీ డైరెక్టర్‌గానూ పనిచేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, International news, Joe Biden, Us news