#HowdyModi | మోదీకి బర్త్ డే శుభాకాంక్షలు... లేట్‌గా చెప్పినా వెరైటీగా చెప్పిన ట్రంప్
#HowdyModi | నరేంద్ర మోదీకి హూస్టన్‌లో జరుగుతున్న మెగా ఈవెంట్ సాక్షిగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన ట్రంప్... భారత ప్రధానిని ఆశ్చర్యపరిచారు.
news18-telugu
Updated: September 23, 2019, 12:26 AM IST

నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్
- News18 Telugu
- Last Updated: September 23, 2019, 12:26 AM IST
భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. వాస్తవానికి నరేంద్ర మోదీ పుట్టిన రోజు సెప్టెంబర్ 17. అయితే, ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న నరేంద్ర మోదీకి అక్కడ హూస్టన్‌లో జరుగుతున్న మెగా ఈవెంట్ సాక్షిగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన ట్రంప్... మోదీని ఆశ్చర్యపరిచారు. అమెరికాలోని హూస్టన్‌లో #HowdyModi మెగా ఈవెంట్ జరిగింది. టెక్సాస్ ఇండియా ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అమెరికా నలుమూలల నుంచి భారతీయ అమెరికన్లు తరలివచ్చారు. సుమారు 50వేల మందికి పైగా రావడంతో స్టేడియం కళకళలాడింది.
‘నా స్నేహితుడు, భారత ప్రధాని నరేంద్ర మోదీని హూస్టన్‌లో కలవడం ఆనందంగా ఉంది. భారత్ ఎప్పుడూ అమెరికాకు ఘనమైన, విధేయత కలిగిన మిత్రదేశం. భారతదేశం అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ ఎన్నో చేస్తున్నారు. నేను, మోదీ కలిసిన ఈ చరిత్రాత్మక సందర్భం 50వేల మంది సమక్షంలో జరగడం ఆనందంగా ఉంది. ఇండియన్ అమెరికన్లు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. కొన్ని నెలల క్రితం భారత్‌లో జరిగిన ఎన్నికల్లో మోదీకి మళ్లీ అధికారం వచ్చారు. అందుకు ఆయనకు అభినందనలు. ఈ రోజు మరో మైలురాయిని కూడా అందుకుంటున్నారు. ఈ సమయంలో చెబుతున్నా. హ్యాపీ బర్త్ డే.’ అని ట్రంప్ అన్నారు.

అమెరికా వైట్‌హౌస్‌లో అరుదైన సత్కారం అందుకున్న శునకం..
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మైకేల్ బ్లూమ్‌బర్గ్...ట్రంప్‌కు గట్టి పోటీ
భారతీయులకు ట్రంప్ షాక్...ఇకపై వారికి హెచ్1బీ వీసాలు నో...
ఐసిస్ చీఫ్ బాగ్దాది ఆత్మాహుతి.. ధ్రువీకరించిన డొనాల్డ్ ట్రంప్..
ఐసిస్ ఛీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీ హతం
వలసలు ఆపేందుకు ట్రంప్ వింత నిర్ణయం.. సరిహద్దుల్లో పాముల్ని, మొసళ్లను..
Loading...