ట్రంప్ నోట బాలీవుడ్ మాట.. భారతీయ సినిమాలను మెచ్చుకున్న అగ్ర రాజ్యాధినేత..

donald trump visit to india | నిన్ననే బాహుబలి సినిమాలో తనపై యానిమేషన్ చేసిన పాటను ట్వీట్ చేసి సంచలనం సృష్టించిన అగ్రరాజ్యాధినేత తాజాగా భారతీయ సినిమాలపై ప్రశంసలు ఝల్లు కురిపించారు.  

news18-telugu
Updated: February 24, 2020, 6:25 PM IST
ట్రంప్ నోట బాలీవుడ్ మాట.. భారతీయ సినిమాలను మెచ్చుకున్న అగ్ర రాజ్యాధినేత..
ట్రంప్ నోట ‘డీడీఎల్’ మాట (Twitter/Photo)
  • Share this:
donald trump visit to india | నమస్తే ట్రంప్ ప్రోగ్రాం సందర్భంగా గుజరాత్‌లోని మోతెరా స్టేడియంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం తర్వాత మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు మన దేశం సాధిస్తున్న ప్రగతిపై ప్రశంసల ఝల్లులు కురిపించాడు. ఈ సందర్భంగా ఆయన మోదీని కొనియాడారు. మోదీ.... గ్రేట్ ఛాంపియన్ ఆఫ్ ఇండియా అంటూ ప్రశంసించారు. రాత్రి పగలు దేశం కోసం పాటు పడుతున్న వ్యక్తి ప్రధాని మోదీ అన్నారు. అమెరికా ఎప్పుడూ ఇండియాను ప్రేమిస్తుందన్నారు. భారత్‌ను గౌరవిస్తుందన్నారు. అమెరికాకూడా భారత్ పట్ల ఎంతో నమ్మకం ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం మొతిరాలో తనకు స్వాగతం పలకడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా అగ్ర రాజ్యాధినేత బాలీవుడ్ సినిమాలతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమను మెచ్చుకున్నారు. నిన్ననే బాహుబలి సినిమాలో తనపై యానిమేషన్ చేసిన పాటను ట్వీట్ చేసి సంచలనం సృష్టించిన అగ్రరాజ్యాధినేత తాజాగా భారతీయ సినిమాలపై ప్రశంసలు ఝల్లు కురిపించారు.

us president donald trump interesting comments on bollywood and indian movies,ట్రంప్ నోట బాలీవుడ్ మాట.. భారతీయ సినిమాలను మెచ్చుకున్న అగ్రరాజ్యాధినేత..,donald trump visit to india, trump visit to india,donald trump ddl,donald trump ddlj movie,donald trump bollywood movies,donald trump shah rukh khan dilwale dulhaniya lejayenge,donald trump wife, Donald Trump India visit live news, ivanka trump, donald trump twitter, melania trump, motera stadium, donald trump daughter, narendra modi, Sardar Vallabhbhai Stadium, Namaste Trump, Trump Agra Visit,డోనాల్డ్ ట్రంప్,ట్రంప్ భారత పర్యటన,మోదీ స్వాగతం,నమస్తే ట్రంప్,భారత్‌కు అమెరికా అధ్యక్షుడు,అహ్మదాబాద్‌లో ట్రంప్ పర్యటన,ట్రంప్ భారతీయ సినిమాలు,ట్రంప్ నోట భారతీ సినిమా మాట,ట్రంప్ దిల్వాలే దుల్హనియా లేజాయేంగే
డొనాల్డ్ ట్రంప్ నోట బాలీవుడ్ మాట (Twitter/Photo)


ఈ సందర్భంగా ఆదిత్యా చోప్రా దర్శకత్వంలో షారుఖ్ ఖాన్, కాజోల్ హీరో, హీరోయిన్లుగా నటించిన ‘దిల్‌వాలే దిల్హనియా లేజాంగే’ సినిమాపై ప్రత్యేకంగా ప్రశంసలు ఝల్లు కురిపించాడు. ఈ సినిమా దాదాపు మహారాష్ట్రలోని బొంబాయిలోని మరాఠ మందిర్‌లో 10ఏళ్లకు పైగా ఏకధాటిగా ఆడి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే కదా. అలాంటి చిత్రాన్ని ట్రంప్ ఈ వేదికపై ప్రస్తావించడం గమనార్హం. దాంతో పాటు దేశంలోని వివిధ భాషల్లో రూపొందే చిత్రాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. భారత్‌లో యేటా అన్ని భాషల్లో 2 వేలకు పైగా సినిమాలు రూపొందిస్తూ.. దేశ ఆర్ధిక ప్రగతిలో తనవంతు సహకారం అందిస్తోదంన్నారు. మొత్తానికి ట్రంప్ పర్యటనలో భారతీయ సినిమాలను ప్రస్తావించడం గమనార్హం.



First published: February 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు