• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • US POLLS 2020 WHO WILL BE THE NEXT AMERICAN PRESIDENT SUSPENSE CONTINUES MS

US ELECTIONS 2020: వొడువని ముచ్చట..! ఆరడుగుల దూరంలో బైడెన్.. అయోమయంలో ట్రంప్..!!

US ELECTIONS 2020: వొడువని ముచ్చట..! ఆరడుగుల దూరంలో బైడెన్.. అయోమయంలో ట్రంప్..!!

జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ (ఫైల్)

US ELECTIONS 2020: అదే ఉత్కంఠ. అదే అనిశ్చితి. ఇంకా తేలని అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం. పోలింగ్ ముగిసి శుక్రవారానికి మూడు రోజులు కావస్తున్నా ఫలితాల ప్రక్రియ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.

  • News18
  • Last Updated:
  • Share this:
    నూవ్వానేనా అన్నట్టు సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం ఇంకా తేలలేదు. అధ్యక్ష పీఠముడి ఇంకా కొనసాగుతూనే ఉంది. బుధవారమే పోలింగ్ ముగిసినా.. కౌంటింగ్ ఇంకా కొనసాగుతున్నది. మూడు రోజులు కావస్తున్నా ప్రపంచానికి పెద్దన్న ఎవరనేది తేలనేలేదు. అయితే ఇరువురు అభ్యర్థులు గెలుచుకున్న ఎలక్టోరల్ ఓట్ల సంఖ్యాపరంగా చూస్తే బైడెన్ విజయం లాంఛనమే అనిపిస్తున్నా.. కౌంటింగ్ రావలసి ఉన్న రాష్ట్రాల్లో నెగ్గితే మాత్రం మరోసారి ట్రంప్ నెగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని అమెరికా మీడియా చెబుతున్నది. మరోవైపు విజయం పై బైడెన్ ధీమా వ్యక్తం చేయగా.. కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయని... విజయం తనదేనంటూ ట్రంప్ కోర్టులకెక్కాడు. ఈ సస్సెన్స్ ఈరోజు కూడా కొనసాగేలా ఉంది.

    బుధవారం ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ.. గురువారం కూడా కొనసాగగా.. అది ఇప్పటికీ అయిపోలేదు. పోలింగ్ భారీగా నమోదుకావడంతో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమవుతున్నది. మునుపెన్నడూ లేనంతగా ఈసారి అమెరికాలో పోలింగ్ నమోదుకావడంతో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ తో పాటు, మెయిల్ ఇన్ ఓట్లు లెక్కించడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. 50 రాష్ట్రాలున్న అమెరికాలో ఇప్పటికే 45 రాష్ట్రాల ఫలితాలు వెలువడ్డాయి. కీలకంగా ఉన్న మిచిగాన్ ఫలితం కూడా బైడెన్ కే అనుకూలంగా వచ్చింది. ఇక మిగిలిన ఐదు రాష్ట్రాలలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది.

    ఆ ఐదు రాష్ట్రాలివే..
    కౌంటింగ్ కొనసాగుతున్న ఐదు రాష్ట్రాలు.. నెవాడా, నార్త్ కరోలినా, జార్జియా, పెన్సిల్వేనియా, అలస్కా లలో కౌంటింగ్ నడుస్తున్నది. ఇవే అగ్రరాజ్యం అధినేత ఎవరో తేల్చనున్నాయి. అలస్కాలో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నా.. మిగిలిన నాలుగు రాష్ట్రాలలో నూవ్వానేనా అన్నట్టు పోటీ ఉంది.

    us polls, us polls counting, us elections 2020 counting, us polls 2020, us elections, us elections 2020, us eletions results, us polls results, us news, american presidential elections, presidential election news, president elections, donald trump, trump news, joe biden, kamala harris, democrats, republicans యూఎస్ ఎన్నికలు, యూఎస్ ఎన్నికలు 2020, అమెరికా అధ్యక్ష ఎన్నికలు, అమెరికా ఎన్నికలు 2020, యూఎస్ ఫోల్స్ 2020, డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్, ఎలక్ట్రోరల్ ఓట్లు, వైట్ హౌస్, అమెరికా న్యూస్
    వైట్ హోస్ (ఫైల్ ఫోటో)


    ఆరడుగుల దూరంలో అధ్యక్ష పీఠం..
    డెమొక్రాట్ అభ్యర్థి, రాజకీయ కుర వృద్ధుడుగా పేరున్న జో బైడెన్ ఇప్పటివరకు పూర్తైన కౌంటింగ్ లో 264 ఓట్లు సాధించి అధ్యక్ష పీఠానికి ఆరడుగుల దూరంలో నిలిచారు. ప్రపంచ పెద్దన్ కావాలంటే ఆయనకు కావాల్సినవి ఆరు ఓట్లు. ప్రస్తుతం నెవాడాలో ఆయన ఆధిక్యం కొనసాగుతున్నది. అక్కడ ఆరు ఎలక్టోలర్ ఓట్లు ఉన్నాయి. అక్కడ ఆధిక్యం నిలబెట్టుకుంటే వైట్ హౌస్ కు వెళ్లబోయేది ఆయనే. మరోవైపు ట్రంప్ కు 214 ఎలక్టోరల్ ఉన్నాయి. రెండోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలంటే ఆయన మరో 56 ఓట్లు సాధించాలి. ప్రస్తుతం కౌంటింగ్ జరుగుతున్న ఐదు రాష్ట్రాలన్నింటిలో విజయం సాధిస్తే.. ఆయనకు విజయావకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ బైడెన్ తో ఆయన టఫ్ ఫైట్ ను ఎదుర్కొంటున్నారు. ఈ ఐదు రాష్ట్రాలలో ట్రంప్ కు గంపగుత్తగా మెజారిటీ రావడం కష్టమే కనిపిస్తున్నది.

    us polls, us polls counting, us elections 2020 counting, us polls 2020, us elections, us elections 2020, us eletions results, us polls results, us news, american presidential elections, presidential election news, president elections, donald trump, trump news, joe biden, kamala harris, democrats, republicans యూఎస్ ఎన్నికలు, యూఎస్ ఎన్నికలు 2020, అమెరికా అధ్యక్ష ఎన్నికలు, అమెరికా ఎన్నికలు 2020, యూఎస్ ఫోల్స్ 2020, డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్, ఎలక్ట్రోరల్ ఓట్లు, వైట్ హౌస్, అమెరికా న్యూస్
    డొనాల్డ్ ట్రంప్.. (ఫైల్)


    కోర్టులకెక్కిన ట్రంప్..
    అమెరికా అధ్యక్ష ఫలితాల కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయని ట్రంప్ కోర్టులకెక్కారు. బైడెన్ గెలిచిన రాష్ట్రాలన్నింటిపై తనకు అనుమానాలున్నాయని.. వాటన్నింటినీ రీ కౌంటింగ్ చేయాలని ఆయన మద్దతుదారులు కోర్టులలో కేసులు వేశారు అయితే పెన్సిల్వేనియా కోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పు రావడం గమనార్హం. కౌంటింగ్ ను ఆరడుగుల దూరం నుంచి పరిశీలించేందుకు పార్టీలకు చెందిన పర్యవేక్షకులను అనుమతించాలంటూ కామన్వెల్త్ కోర్టు ఆదేశించింది. బ్యాలెట్లను తెరిచి, లెక్కించే ప్రక్రియను దగ్గరి నుంచి పరిశీలించేలే పర్యవేక్షకులను అనుమతించాలని ట్రంప్ బృందం కోర్టులను ఆశ్రయించింది.

    మరోవైపు ఇరు పార్టీలకు చెందిన మద్దతుదారులు అమెరికాలో రోడ్డెక్కారు. విజయం మాదే అంటే మాదేనంటూ రోడ్లమీద ర్యాలీలు తీస్తున్నారు. పలువురు ట్రంప్ మద్దతుదారులు.. రోడ్లమీదవకు వచ్చి నిరసనలు చేపట్టారు. ఉత్తర కరోలినా రాష్ట్రంలో రిపబ్లిక్ పార్టీ మద్దతుదారులు నిరసనలు చేయడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    కాగా, అమెరికాలో జరుగుతున్న పరిణామాలను ప్రపంచ దేశాలన్నీ నిశితంగా గమనిస్తున్నాయి. అగ్రరాజ్యం కావడంతో ఆ దేశ అధ్యక్షుడెవరనేదానమీద సాధారణంగానే ఉత్కంఠ ఉండగా.. తాజా ఎన్నికల ఫలితాలు దానిని మరింత పెంచాయి. దీంతో అధ్యక్షుడెవరైనా అగ్రరాజ్యంతో సఖ్యంగా ఉండాలంటే పెద్దన్న ఎవరైనా వారితో సత్సంబందాలు నెరపడానికి అన్ని దేశాలు ఉవ్విళ్లూరుతున్నాయి.
    Published by:Srinivas Munigala
    First published: