Home /News /international /

US POLLS 2020 LIVE UPDATES IS TRUMP GOING TO WIN AGAIN DETAILS HERE MS

US ELECTIONS 2020: ‘స్వింగ్’ లోనూ ట్రంపే ‘కింగ్’.. మరోసారి అధ్యక్ష పీఠం ఆయనదేనా..!

డొనాల్డ్ ట్రంప్ (ఫైల్)

డొనాల్డ్ ట్రంప్ (ఫైల్)

అమెరికా 45 వ అధ్యక్ష ఎన్నికలు హోరాహోరిగా సాగుతున్నాయి. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం.. మరోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడానికి ట్రంప్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది.

  • News18
  • Last Updated :
    నెక్ టు నెక్ ఫైట్ గా నడుస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలలో మరోసారి అధ్యక్ష పీఠం పై ట్రంప్ కూర్చోనున్నారా..? సర్వేలు, అంచనాలు మళ్లీ తప్పబోతున్నాయా..? అగ్రారజ్యాధిపతి గా మరోసారి ట్రంపే ఉండనున్నారా..? వస్తున్న ఫలితాలైతే అదే విషయాన్ని రూఢీ చేస్తున్నాయి. వైట్ హౌస్ లో కాలరెగరేసేది ట్రంపే అని చెబుతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో ఆయనే ముందున్నారు. సంచలనాలు సృష్టిస్తాడనుకుంటున్న బైడెన్ కు మరోసారి నిరాశే తప్పేలా లేదని ఫలితాల సరళిని చూస్తే అర్థమవుతున్నది.

    కోవిడ్, బ్లాక్ లివ్స్ మ్యాటర్, అంతర్జాతీయ పరిణామాలు, యూఎన్ నుంచి బయటకు తొలగడం.. తదితర అంశాలేవీ అమెరికా ఓటర్లన్నీ ప్రభావితం చేసినట్టు కనిపించడం లేదు. ఇప్పటివరకు వస్తున్న ఫలితాలను చూస్తే మరోసారి ట్రంపే వైట్ హౌస్ కింగ్ కాబోతున్నట్టు తెలుస్తున్నది. ఫలితాలు వెలువడుతున్న కొద్దీ ప్రపంచవ్యాప్తంగా వాటిని చూస్తున్న వారిలో ఉత్కంఠ పెరుగుతున్నది. డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మధ్య హోరాహోరి పోటీ నడుస్తున్నా.. ఆధిక్యంలో మాత్రం ట్రంప్ కనిపిస్తున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు.. పాపులర్ ఓటర్లలో ట్రంప్ తొలినుంచి ఆధిక్యం కనబరుస్తున్నారు. విజేతను నిర్ణయించే ఎలక్టోరల్ ఓట్లలో మొదట్లో ఆధిక్యం కనబరిచిన బైడెన్.. తర్వాత వెనుకబడ్డట్టు కనిపిస్తున్నది.

    ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో 18 రాష్ట్రాలను ట్రంప్ గెలుచుకోగా.. 17 రాష్ట్రాలను బైడెన్ కైవసం చేసుకున్నారు. అయితే ఎలక్ట్రోరల్ ఓట్ల విషయంలో మాత్రం బైడెన్ కు 224 ఓట్లు రాగా.. ట్రంప్ కు 285 దాకా వచ్చినట్టు మీడియా కథనాల ద్వారా తెలుస్తున్నది. కీలక రాష్ట్రాలుగా పేరున్న స్వింగ్ స్టేట్స్ లోనూ.. ట్రంపే ముందంజలో ఉన్నారు. ఫ్లోరిడా, జార్జియా లలో ట్రంప్ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక పాపులర్ ఓట్ల విషయానికి వస్తే.. ట్రంప్ 50.13 శాతం ఓట్లతో ముందంజలో ఉంటే.. బైడెన్ 48.33 శాతం ఓట్లు దక్కించుకున్నారు.

    అత్యంత కీలకంగా వ్యవహరించే ఫ్లోరిడాలో డెమొక్రాట్ల అంచనాలు తలకిందులయ్యాయా..? ఫలితాలను చూస్తే అదే అనిపిస్తున్నది. అధ్యక్ష పీఠానికి చేరేవారికి అది ఆ రాష్ట్రం ఒక రాచమార్గం. అక్కడ గెలిస్తే ఇక ప్రపంచానికి పెద్దన్న అవ్వాల్సిందే. అయితే మొదటినుంచి ఫ్లోరిడా లో బైడెన్ విజయం ఖాయం అనుకున్నారు. సర్వేలు అవే చెప్పాయి. కానీ ఫలితాల సరళి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వస్తున్నది. ఇక్కడ తొలుత స్వల్ప ఆధిక్యం కనబరిచిన ట్రంప్.. తర్వాత క్రమంగా ఆ తేడాను బైడెన్ అందుకోలేనంతగా తీసుకెళ్లారు. ఫ్లోరిడాతో పాటు కీలక రాష్ట్రాలైన జార్జియా, ఒహైయా, టెక్సాస్ లోనూ ట్రంప్ ముందంజలోనే ఉన్నారు.
    Published by:Srinivas Munigala
    First published:

    Tags: US Elections 2020

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు