అమెరికాలో విద్యార్థులపై కాల్పులు.. గిటార్‌ లోంచీ గన్స్ తీసి...

Colorado Shooting : అమెరికాలో గన్ కల్చర్... అక్కడి విద్యార్థుల పాలిట శాపమవుతోంది. ఎప్పుడు ఎవరు దాడి చేస్తారో తెలియని పరిస్థితి.

Krishna Kumar N | news18-telugu
Updated: May 8, 2019, 11:44 AM IST
అమెరికాలో విద్యార్థులపై కాల్పులు.. గిటార్‌ లోంచీ గన్స్ తీసి...
ఆందోళనలో విద్యార్థులు (Image : AP)
  • Share this:
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కొలరాడో రాష్ట్రం డెన్వర్‌లోని సైన్స్ అండ్ టెక్నాలజీ స్కూల్లోకి ఇద్దరు స్టూడెంట్స్ ఆయుధాలతో చొరబడ్డారు. గిటార్ లోంచీ గన్స్ తీసి... ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ దారుణంలో ఒక విద్యార్థి అక్కడికక్కడే చనిపోగా.. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వాళ్లను దగ్గర్లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. గాయాలు తీవ్రంగా ఉండటం వల్ల... 8 మందిలో ఎంత మంది కోలుకుంటారో అప్పుడే చెప్పలేమంటున్నారు డాక్టర్లు. అమెరికా టైమ్ ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఫైరింగ్ జరిగింది. కాల్పులకు పాల్పడింది తోటి విద్యార్థులే అని తెలిసి పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు.

ప్రస్తుతం ఈ ఘటనలో ఇద్దరు స్టూడెంట్లనూ పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మరొకరు కూడా ఈ కాల్పుల్లో పాల్గొని ఉంటారని తెలుస్తోంది. అమెరికాలో గన్ కల్చర్ పెరుగుతూ ఉంది. గత అధ్యక్షుడు ఒబామా... గన్ కల్చర్‌కు చెక్ పెట్టాలనుకున్నా అది సాధ్యపడలేదు. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి.

నెల రోజులుగా దేశంలో ఎక్కడో ఓ చోట కాల్పుల ఘటనలు నమోదవుతూనే ఉన్నాయి. ఈమధ్యే ఓ యూనివర్శిటీలో జరిపిన ఫైరింగ్‌లో ఇద్దరు స్టూడెంట్స్ చనిపోయారు. వెస్ట్‌ బాల్టిమోర్‌, శాండియోగోలోనూ దుండగులు కాల్పులు జరపడంతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ఘటనలు జరిగిన ప్రతిసారీ గన్ కల్చర్‌పై చర్చ జరుగుతోంది. కానీ నివారణ చర్యలు కనిపించట్లేదు.

 ఇవి కూడా చదవండి :

చౌకీదార్ చోర్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పిన రాహుల్ గాంధీ

బీజేపీ గెలిచినా... కేంద్రంలో అధికారంలోకి రాదా...? ఆ 21 పార్టీల ప్లాన్ ఏంటి...?యూపీలో బీజేపీకి షాక్ తప్పదా... మారుతున్న పరిస్థితులు... పెరుగుతున్న పార్టీల వ్యతిరేకత...

దగ్గరవుతున్న బీజేపీ, వైసీపీ ... ఫలితాల తర్వాత పొత్తు..? ప్రత్యేక హోదా అటకెక్కినట్లేనా.. ?
First published: May 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు