• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • US NEWS JEFF ZIENTS VIVEK MURTHY TO LEAD COVID 19 FIGHT IN JOE BIDEN TEAM SK GH

Vivek Murthy: వైట్‌హౌజ్‌లో వివేక్‌ మూర్తికి కీలక బాధ్యతలు అప్పగించిన బైడెన్

Vivek Murthy: వైట్‌హౌజ్‌లో వివేక్‌ మూర్తికి కీలక బాధ్యతలు అప్పగించిన బైడెన్

ప్రతీకాత్మక చిత్రం

Vivek Murthy in white house: అమెరికాలో కోవిడ్‌ను అరికట్టడం, వ్యాక్సిన్ పంపిణీ వంటి కీలక బాధ్యతలను జియెంట్స్‌, వివేక్ మూర్తి పర్యవేక్షించనున్నారు.

  • Share this:
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన బైడెన్ కొత్త అడ్మినిస్ట్రేషన్ టీమ్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. COVID-19 వ్యాప్తిని నిరోధించడంతో పాటు మహమ్మారి కారణంగా డీలాపడిన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా బైడన్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒబామా హయాంలో పనిచేసిన అధికారులను కొత్త బృందంలోకి తీసుకుంటున్నారు. తాజాగా జెఫ్ జియెంట్స్‌ను వైట్ హౌస్ కరోనావైరస్ కోఆర్డినేటర్‌గా నియమించారు. భారత మూలాలున్న బైడెన్ సలహాదారుడు వివేక్ మూర్తిని సర్జన్ జనరల్‌గా తిరిగి నియమించారు. దీంతో పాటు మూర్తికి అదనపు బాధ్యతలు కూడా అప్పగించనున్నట్లు తెలుస్తోంది. అమెరికా వ్యాప్తంగా మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉండటంతో, కోవిడ్ నిర్మూలనకు సంబంధించిన పోర్ట్‌ఫోలియోను కూడా మూర్తికే ఇచ్చే అవకాశం ఉంది. కోవిడ్‌ను అరికట్టడం, వ్యాక్సిన్ పంపిణీ వంటి కీలక బాధ్యతలను జియెంట్స్‌, మూర్తి పర్యవేక్షించనున్నారు.

వచ్చే ఏడాది జనవరి 20న బైడెన్ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. యూఎస్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకుండా చూడటం, సుమారు 2,74,000 మందికి పైగా అమెరికన్లను బలితీసుకున్న కరోనావైరస్‌ వ్యాప్తిని అరికట్టడం.. ఈ రెండు బైడెన్ ముందున్న సవాళ్లు. వీటిని సమర్థంగా ఎదుర్కోవడం కోసం ఇద్దరు సలహాదార్లకు ఆయన పెద్ద బాధ్యతలు అప్పజెప్పారని విశ్లేషకులు భావిస్తున్నారు. బైడెన్ కొత్తగా నియమించిన COVID-19 అడ్వైజరీ బోర్డులో మార్సెల్ల నూనెజ్ స్మిత్ కూడా ఉన్నారు.

ప్రస్తుతం వైట్ హౌస్ కరోనావైరస్ టాస్క్ ఫోర్స్ మెంబర్‌గా ఉన్న ఆంథోనీ ఫౌసీతో కొత్త బృదం గురువారం మొదటిసారి సమావేశం కానుంది. ఈ మీటింగ్‌లో ముఖ్యమైన చర్చలు జరిగే అవకాశం ఉంది. మహమ్మారిని అరికట్టే బాధ్యతలు స్వీకరించిన కొత్త సభ్యులతో సమగ్ర చర్చలు జరపాలని భావిస్తున్నట్లు ఫౌసీ మీడియాతో చెప్పారు. ప్రస్తుతం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీస్ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్‌గా ఫౌసీ వ్యవహరిస్తున్నారు. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఆయన వైట్ హౌస్ టాస్క్‌ఫోర్స్‌లో హై ప్రొఫైల్ మెంబర్‌గా కొనసాగుతున్నారు. వైరస్‌ను ఎదుర్కొనే విషయంలో చాలాసార్లు ట్రంప్‌తో సైతం ఆయన విభేదించారు.

ఒబామా హయాంలో వివేక్ మూర్తి సర్జన్ జనరల్‌గా సేవలందించారు. అప్పట్లో కీలక బాధ్యతలను సమర్థంగా నిర్వహించినందువల్ల, కోవిడ్‌ రెస్పాన్స్ టీమ్‌లో ఆయనకు బైడెన్ చోటు కల్పించాడు. యూఎస్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. బుధవారం ఒక్కరోజే దాదాపు 2,00,000 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ట్రీట్‌మెంట్ కోసం సుమారు లక్షమంది రోగులు హాస్పిటళ్లలో అడ్మిట్ అయ్యారు. దీంతో మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు కొత్త బృదం పనిచేయాల్సి ఉందని బైడెన్ తెలిపారు.

జెఫ్ జియంట్స్ పెద్ద వ్యాపారవేత్త. వైట్ హౌస్ కరోనావైరస్ కోఆర్డినేటర్‌గా కీలక బాధ్యతలు స్వీకరించిన ఆయన.. అమెరికాలో వందల మిలియన్ డోస్‌ల కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేసే ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తారు. ఇటీవల జియెంట్స్ యూఎస్‌ స్టేట్ గవర్నర్లు, రాష్ట్ర అధికారులతో సమావేశం నిర్వహించారు. తాజాగా నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్‌కు హెడ్‌గా బ్రియాన్ డీస్‌ను బైడెన్ ప్రకటించారు. 2009 ఆర్థిక సంక్షోభం సమయంలో ఆటోమోటివ్ పరిశ్రమను ఆదుకోవడానికి అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం బ్రియాన్ డీస్‌ను ఎంపిక చేశారు.
Published by:Shiva Kumar Addula
First published:

అగ్ర కథనాలు