హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

USA: ఇటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. అటు అమెరికా కొత్త టెక్నాలజీ ఆయుధాల పరీక్షలు.. దేనికి సంకేతం..?

USA: ఇటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. అటు అమెరికా కొత్త టెక్నాలజీ ఆయుధాల పరీక్షలు.. దేనికి సంకేతం..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచ భౌగోళిక రాజకీయ గందరగోళం మధ్య కొత్త లేజర్(Laser) ఆయుధాలను యూఎస్‌ నేవీ విజయవంతంగా పరీక్షించింది. లేయర్డ్ లేజర్ డిఫెన్స్ (LLD)గా వ్యవహరించే లేజర్‌ ఆయుధాలను లాక్‌హీడ్ మార్టిన్ రూపొందించారు.

ప్రపంచ భౌగోళిక రాజకీయ గందరగోళం మధ్య కొత్త లేజర్(Laser) ఆయుధాలను యూఎస్‌ నేవీ(America Navy) విజయవంతంగా పరీక్షించింది. లేయర్డ్ లేజర్ డిఫెన్స్ (LLD)గా వ్యవహరించే లేజర్‌ ఆయుధాలను లాక్‌హీడ్ మార్టిన్ రూపొందించారు. మల్టీ డొమైన్‌(Multi Domain), మల్టీ ప్లాట్‌ఫామ్‌ ప్రదర్శన వ్యవస్థగా పనిచేయడానికి లేయర్డ్ లేజర్ డిఫెన్స్(LLD) అభివృద్ధి చేశారు. భూమి ఆధారిత లేజర్ వ్యవస్థ గాల్లోని డ్రోన్‌ను(Drones) కంటికి కనిపించని శక్తి పుంజం ద్వారా కాల్చి వేసిందని యూఎస్‌ నేవీ(US Navy) తెలిపింది. డ్రోన్‌పై నారింజ రంగు మెరుస్తుండగా.. దాని ఇంజిన్(Engine) నుంచి పొగ వచ్చి.. ప్యారాచూట్‌ తెరుచుకొందని.. క్రాఫ్ట్ కిందకి పడిపోయిందని వివరణ ఇచ్చింది. 2022 ఫిబ్రవరిలో ఆఫీస్ ఆఫ్ నేవల్ రీసెర్చ్(ONR) మొదటి ప్రదర్శన జరిగిందని రిపోర్ట్స్‌ వచ్చాయి.

లేయర్డ్ లేజర్ డిఫెన్స్‌ ప్రత్యేకత ఏంటి..?

మానవరహిత వైమానిక వ్యవస్థలు, అధిక శక్తి లేజర్‌తో వేగంగా దాడి చేసే పడవలను LLD ఎదుర్కోగలదు. కృత్రిమ మేధస్సుతో లేయర్డ్ లేజర్ డిఫెన్స్‌ సిస్టమ్‌కు లక్ష్యాలను మెరుగ్గా ట్రాక్ చేసే అవకాశం ఉంది. అధునాతన ఆప్టిక్స్‌తో టార్గెట్‌పై ఫోకస్‌, మ్యాక్సిమమ్‌ ఎఫెక్ట్‌తో లేజర్ పల్స్‌లను విడుదల చేయగల శక్తి దీని సొంతం. పరీక్ష సమయంలో మానవరహిత ఫిక్స్డ్‌- వింగ్ ఏరియల్ ఎయిర్‌క్రాఫ్ట్, క్వాడ్‌కాప్టర్లు, సబ్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్స్‌ను, హై-స్పీడ్ డ్రోన్‌లను LLD కూల్చి వేసింది. LLD యొక్క ఇతర సామర్థ్యాల విషయానికి వస్తే.. ఇన్-బౌండ్ ఎయిర్ థ్రెట్స్‌ను ట్రాక్‌ చేసే వీలు, సపోర్ట్‌ కోంబాట్‌ ఐడెంటిఫికేషన్‌, కండక్ట్‌ బ్యాటిల్‌ డ్యామేజ్‌, అసెస్‌మెంట్‌ లు ఉన్నాయి.

సాంప్రదాయ ఆయుధాల కంటే లేజర్ వ్యవస్థలు మెరుగ్గా ఉన్నాయా..?

కొన్నేళ్లుగా డ్రోన్‌ల ముప్పు పెరగడంతో.. లేజర్ ఆయుధాలు కీలకంగా మారాయి. లేజర్‌ ఆయుధాల్లో వేగం, స్టెల్త్, కచ్చితత్వం, వర్చువల్లీ ఇన్‌ఫైనెట్‌ మ్యాగజైన్‌ వంటి అదనపు ప్రయోజనాలు చేకూరాయి. బలహీనమైన లేజర్ పుంజం కూడా కచ్చితమైన ఫోకస్‌తో ప్రత్యర్థి మిసైల్స్‌ను అడ్డుకోగలదని నిపుణులు చెబుతున్నాయి. లేజర్ ఆయుధాలకు అధిక అవుట్‌పుట్‌తో మిసైల్‌ ఫ్లైట్ కంట్రోల్ రెక్కలను క్షీణింపజేసి, వార్‌హెడ్‌లను థర్మల్‌గా యాక్టివేట్ చేసే శక్తి ఉంటుంది. లేజర్‌ ఆయుధాలను నౌకలలలో సులువుగా తరలించుకొనే సదుపాయం ఉంటుంది. అంతే కాకుండా.. సిబ్బందికి కూడా సురక్షితంగా ఉంటుంది.

Affair: మరిదితో అక్రమ సంబంధం.. దాన్ని కప్పిపుచ్చేందుకు చెల్లిని ఇచ్చి వివాహం.. చివరికి షాకింగ్ ట్విస్ట్


లేజర్‌లు సంప్రదాయ ప్రొపెల్లెంట్‌లు, నౌకల్లో కనిపించే గన్‌పౌడర్ ఆధారిత ఆర్డినెన్స్‌పై ఇవి ఆధారపడవు. లేజర్‌ ఆయుధాల ద్వారా దాడులు జరుగుతున్న ప్రాంతాలకు పేలుడు పదార్థాలను తరలించే అవసరం లేదు. విద్యుత్తు పనిచేసే ఆధునిక హై-పవర్ లేజర్‌ ఆయుధాలు.. ఓడకు శక్తి ఉన్నంత వరకు పని చేసే సత్తా దీని సొంతం. లేజర్ ఆయుధం షాట్‌కు ఖర్చు తక్కువ.. సిస్టమ్‌ను శక్తివంతం చేయడానికి ఉపయోగించే ఇంధనానికి మాత్రమే వ్యయం చేయాల్సి వస్తుంది. తక్కువ మొత్తంలో సామగ్రి సరిపోతుంది.. రహస్యంగా తరలిస్తున్న ట్రూప్స్‌కు ఇది ఎంతో అనుకూలం. విజువల్ రేంజ్ మిసైల్స్‌తో అమర్చబడిన స్టెల్త్ జెట్‌లు లేజర్‌ ఆయుధాల వేగం, కచ్చితత్వం నుంచి తప్పించుకోలేవు.

యూఎస్‌కు లేజర్ ఆయుధాలు ఎందుకు అవసరం..?

యూఎస్‌ నేవీ రీసెర్చ్‌, డెవలప్‌మెంట్‌ వ్యూహంలో భాగంగా LLD టెస్టింగ్‌ జరిగిందన్న యూఎస్ పేర్కొంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలని, విభిన్న ముప్పులను ఎదుర్కోగల లేజర్ ఆయుధాల శ్రేణిని అభివృద్ధి చేయాలని యూఎస్‌ భావిస్తోంది. ప్రాణాంతకం కాని ఆప్టికల్‌ డ్యాజ్లింగ్‌ పద్ధతి, సెన్సార్‌ ఇంపైర్‌మెంట్‌ టూ డెస్ట్రాయ్‌ విధానాల్లో మారే సామర్థ్యం ఉంది. లక్ష్యాన్ని నాశనం చేయడానికి ఆప్టికల్ “మిరుమిట్లుగొలిపే” మరియు సెన్సార్ బలహీనత వంటి ప్రాణాంతకం కాని పద్ధతుల నుండి ఈ సామర్థ్యాలు మారుతూ ఉంటాయి.

LLD వంటి వినూత్న లేజర్ వ్యవస్థలకు నౌకాదళ భవిష్యత్తును, పోరాట నైపుణ్యాన్ని మార్చగల సామర్థ్యాన్ని ఉందన్న నిపుణులు చెబుతున్నారు. లేజర్‌ ఆయుధాలు సైనికులకు ట్రాన్స్‌ఫర్మేషనల్‌ క్యాపబిలిటీస్‌ అందించగలవని, వివిధ ముప్పులను ఎదుర్కొనే అవకాశం కల్పిస్తాయని నావల్ రీసెర్చ్ చీఫ్ లోరిన్ సి.సెల్బీ పేర్కొన్నారు. యుద్ధాల్లో ప్రాణాంతకంగా మారగలవని, డీప్‌ మ్యాగజైన్‌తో సైనికులకు బలంగా మారుతాయని లోరిన్‌ తెలిపారు. LLDలను సైన్యంలోకి ప్రవేశపెట్టే ప్రణాళికలు ఇప్పటికి లేకపోయినా.. భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందని సంకేతాలు వెలువడుతున్నాయి. 2014లో పర్షియన్ గల్ఫ్‌లోని USS పోన్స్‌లో లేజర్ వెపన్ సిస్టమ్ పరీక్షలు నిర్వహించారు. 2021లో USS పోర్ట్‌ల్యాండ్‌లో లేజర్ వెపన్ సిస్టమ్ డెమోన్‌స్ట్రేటర్‌ను ONR మోహరించింది. 2022కు ముందు నుంచి ఇరాన్ UAVల వినియోగాన్ని ఎదుర్కోవడానికి లేజర్ ఆయుధాలపై యూఎస్‌ పని చేస్తుంది.

Hyderabad: ఎప్పుడూ చలాకీగా ఉండే లాయర్ శివాని ఎందుకిలా చేసింది? భర్త లొంగుబాటు..


లేజర్ ఆయుధాల కోసం రేస్‌..

అధునాతన లేజర్ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి రష్యా, చైనా కృషి చేస్తున్నాయి. మైక్రోవేవ్ మెషీన్ రిలేటివిస్టిక్ క్లిస్ట్రాన్ యాంప్లిఫైయర్ (RKA)ని చైనా అభివృద్ధి చేసింది. RKAకి అంతరిక్షంలో ఉపగ్రహాలను జామ్ చేయగల, నాశనం చేయగల సామర్థ్యం ఉంది. ఉపగ్రహాలకు అంతరాయం కలిగించడానికి, నాశనం చేయడానికి చైనా వద్ద వివిధ రకాలైన లేజర్ ఆయుధాలు ఉన్నాయని నివేదికలు తెలుపుతున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఆప్టికల్ టార్గెటింగ్ సిస్టమ్స్ నుంచి గూఢచారి ఉపగ్రహాల వరకు ప్రతిదీ నాశనం చేయగల కొత్త ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ లేజర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు రష్యా ప్రకటించింది.

Published by:Veera Babu
First published:

Tags: Missile, Russia-Ukraine War, Ukraine, USA

ఉత్తమ కథలు