హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

అమెరికాలో ఘోర ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న 100 వాహనాలు..

అమెరికాలో ఘోర ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న 100 వాహనాలు..

image-Twitter

image-Twitter

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెక్సాస్ రాష్ట్రంలో 100కు పైగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెక్సాస్ రాష్ట్రంలో 100కు పైగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. గురువారం ఉదయం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. చాలా మంది గాయపడ్డారు. అదే విధంగా పెద్ద సంఖ్యలో కార్లు, కంటైనర్లు ధ్వంసమయ్యాయి. డల్లాస్‌కు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫోర్ట్ వర్త్ ప్రాంతంలోని ఇంటర్‌స్టేట్ 35పై ఈ ఘటన చోటుచేసుకుంది. డల్లాస్-ఫోర్ట్ వర్త్ మెట్రో ప్రాంతంలో మంచుతో కూడిన రహదార్లు ఈ ప్రమాదానికి కారణమై ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మంచు గడ్డలుగా పేర్కొని ఉండటంతో ఉదయం పూట వెళ్లే వాహనదాలు ఈ ప్రమాదం బారినపడ్డారని అధికారులు చెబుతున్నారు.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.. ఈ ఘటనతో పలువురు వాహనాల్లో చిక్కుపోయినట్టుగా స్థానిక ఫైర్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. 100కి పైగా వాహనాలు ధ్వంసం అయినట్టు అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధంచిన దృశ్యాలను స్థానిక మీడియా చానెళ్లు ప్రసారం చేశాయి. అందులో కార్లు ఒకదానిపై మరోకటి ఎక్కినట్టుగా కనిపించాయి. దాదాపు రెండు కిలోమీటర్ల పొడువున ఎక్కడ చూసిన వాహనాలు ఒకదానిపైకి ఒకటి ఎక్కి.. తీవ్రంగా దెబ్బతిని కనిపించాయి.

ఇక, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీస్, ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అత్యవసర సేవల సంస్థ మెడ్‌స్టార్ మొబైల్ హెల్త్‌కేర్ ప్రతినిధి మాట్ జావాడ్స్కీ మాట్లాడుతూ.. ఇప్పటివరకు 36 మందిని ఆస్పత్రులకు తరలించినట్టు చెప్పారు. వారిలో ముగ్గురు పరిస్థితి విషయంగా ఉందని వెల్లడించారు. ఇక, అధికారులు రోడ్డుపై పేర్కొన్న వాహనాలకు క్లియర్ చేసే పనిలో ఉన్నారు.

First published:

Tags: Us

ఉత్తమ కథలు