హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

జైల్లో ప్రియురాలు.. ఆమె బెయిల్ కోసం ఇద్దరిని చంపేసిన ప్రియుడు.. చివరకు ఏం జరిగిందంటే..

జైల్లో ప్రియురాలు.. ఆమె బెయిల్ కోసం ఇద్దరిని చంపేసిన ప్రియుడు.. చివరకు ఏం జరిగిందంటే..

US death Penalty: ప్రియురాలిని బయటకు తీసుకొచ్చేందుకు డొనాల్డ్ గ్రాంట్ ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. చివరకు ఆమె బెయిల్ కోసం.. ఓ హోటల్‌లో దొంగతనం చేశాడు. హోటల్‌లో పనిచేసే ఇద్దరు ఉద్యోగులపై కాల్పులు జరిపి చంపేశాడు

US death Penalty: ప్రియురాలిని బయటకు తీసుకొచ్చేందుకు డొనాల్డ్ గ్రాంట్ ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. చివరకు ఆమె బెయిల్ కోసం.. ఓ హోటల్‌లో దొంగతనం చేశాడు. హోటల్‌లో పనిచేసే ఇద్దరు ఉద్యోగులపై కాల్పులు జరిపి చంపేశాడు

US death Penalty: ప్రియురాలిని బయటకు తీసుకొచ్చేందుకు డొనాల్డ్ గ్రాంట్ ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. చివరకు ఆమె బెయిల్ కోసం.. ఓ హోటల్‌లో దొంగతనం చేశాడు. హోటల్‌లో పనిచేసే ఇద్దరు ఉద్యోగులపై కాల్పులు జరిపి చంపేశాడు

  ప్రేమ కోసం కొందరు దేనికైనా సిద్ధపడతారు. ప్రియురాలితో కలిసి బతికేందుకు కన్నవారిని దూరం చేసుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఆస్తులు, అంతస్తులను వదిలేసుకున్న వారిని ఎంతో మందిని చూశాం. కానీ అమెరికాలో ఓ వ్యక్తి ప్రియురాలి కోసం ఎంతటి దారుణానికి తెగబడ్డాడో తెలుసా..? ఓ హోటల్‌పై దాడి చేసి డబ్బులు దోచుకున్నాడు. ఇద్దరు వ్యక్తులను కిరాతకంగా హత్య చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే.. తన ప్రియురాలి ప్రేమ కోసం అతడు రాక్షసుడిలా మారాడు. చావడానికైనా.. చంపడానికైనా సిద్ధమని.. బీభత్సం సృష్టించాడు. ఆ కేసులో చివరికి అతడికి కూడా మరణ శిక్ష పడింది. ప్రియురాలి కోసం అతడు చేసిన ఓ పెద్ద తప్పే.. చివరికి అతడి మరణానికి కారణమయింది.

  NeoCov: నియో కోవ్ వస్తే చావు ఖాయమా? ఈ డేంజరస్ వైరస్‌పై WHO కీలక వ్యాఖ్యలు

  అసలేం జరిగిందంటే..

  ఈ కేసు 2001 నాటిది. అమెరికాలోని ఓక్లహామా రాష్ట్రానికి చెందిన డొనాల్డ్ గ్రాంట్ (Donald Grant Death Penalty) అనే వ్యక్తి ఓ వ్యక్తిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ఐతే ఆమె ఓ కేసులో జైలుకెళ్లాల్సి వచ్చింది. ప్రియురాలిని బయటకు తీసుకొచ్చేందుకు డొనాల్డ్ గ్రాంట్ ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. చివరకు ఆమె బెయిల్ కోసం.. ఓ హోటల్‌లో దొంగతనం చేశాడు. హోటల్‌లో పనిచేసే ఇద్దరు ఉద్యోగులపై కాల్పులు జరిపి చంపేశాడు. వారిలో ఒకరు స్పాట్‌లోనే మరణించారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ఘటన జరిగినప్పుడు గ్రాంట్ వయసు 25 ఏళ్లు. ఈ కేసులో సుదీర్ఘ కాలంగా విచారణ జరిగింది. చివరకు 2005లో కోర్టు తీర్పు వెలువరించింది. జంట హత్యల కేసులో డొనాల్డ్ గ్రాంట్‌ను దోషిగా తేల్చిన కోర్టు.. అతడికి మరణ శిక్ష (Oklahoma Death Penalty)విధిస్తూ తుది తీర్పు చెప్పింది.

  సముద్రంలో మునిగిపోయిన యుద్ధ విమానం కోసం అమెరికా ఎత్తులు.. చైనాను

  ఐతే మరణ శిక్ష నుంచి తప్పించుకునేందుకు డొనాల్డ్ గ్రాంట్ ఎన్నో ప్రయత్నాలు చేశాడు. మరణశిక్షను సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీల్‌కు వెళ్లాడు. గ్రాంట్ చిన్నతనంలో ఎన్నో మానిసిక, శారీరక వేధింపులకు గురయ్యాడని అతడి లాయర్లు ఆన్‌లైన్ పిటిషన్ల పేర్కొన్నారు. మద్యానికి బానిసైన తండ్రి అతడిని చిత్రహింసలకు గురిచేసేవాడని తెలిపారు. ఆ ప్రభావం డొనాల్డ్ గ్రాంట్‌పై తీవ్రంగా పడిందని చెప్పారు. ఫెటల్ ఆల్కాహాల్ సిండ్రోమ్, బ్రెయిన్ ట్రామా సమస్యలతో అతడు బాధపడుతున్నాడని.. గ్రాంట్ మానసిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అతడికి విధించిన మరణశిక్షను రద్దు చేయాలని కోర్టును కోరారు. కానీ వారి వాదనను కోర్టు తోసిపుచ్చింది.

  Viral Story : నువ్వు దేవుడివి బాసూ..70ఏళ్లుగా ఒక్క లీవ్ కూడా తీసుకోని ఉద్యోగి

  వాస్తవానికి ఓక్లహామా రాష్ట్రం 2015లో మరణశిక్షపై తాత్కాలిక తాత్కాలిక నిషేధాన్ని విధించింది. అయితే 2021లో ఆ తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేశారు. దీనికి తోడు డొనాల్డ్ గ్రాంట్ పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో అతడి మరణశిక్ష ప్రక్రియ ప్రారంభమయింది. ఆ తర్వాత గురువారమే అతడికి.. ప్రాణాంతకమైన ఇంజెక్షన్ ఇచ్చి మరణశిక్ష విధించారు. ఈ ఏడాది అమెరికాలో మరణశిక్ష పడిన మొదటి ఖైదీ డొనాల్డ్ గ్రాంటే కావడం గమనార్హం.

  కాగా, యునైటెడ్ స్టేట్స్‌లో ఏటా విధించే మరణశిక్షలు ఇటీవలి కాలంలో బాగా తగ్గాయి. అమెరికాలోని 23 రాష్ట్రాల్లో మరణశిక్షణను పూర్తిగా రద్దు చేశారు. కాలిఫోర్నియా, ఒరెగాన్, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో తాత్కాలిక తాత్కాలిక నిషేధం ఉంది. ఉపయోగం నిషేధించబడింది. ఓక్లహామాలో ఇది వరకు ఉన్న తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేడయంతో.. అతడికి మరణశిక్షను అమలు చేశారు.

  First published:

  Tags: America, Death penalty, International news, Us news

  ఉత్తమ కథలు