హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Lottery Prize: ఉదయం కారు ప్రమాదం.. సాయంత్రం లాటరీ బహుమానం.. లక్ అంటే ఇతడిదే

Lottery Prize: ఉదయం కారు ప్రమాదం.. సాయంత్రం లాటరీ బహుమానం.. లక్ అంటే ఇతడిదే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొన్ని లక్షల మందిలో డోవ్‌ను లాటరీ వరించింది. ముందు అతడు పది లక్షల డాలర్లు విలువైన లాటరీని గెల్చుకున్నాడు. కానీ మెగాప్లయర్ టికెట్ డ్రా చేసినప్పుడు ఆ మొత్తం రెట్టింపు అయింది. ఇలా రెండుసార్లు అతడిని అదృష్టం వరించింది

అదృష్టం ఎవరిని ఎప్పుడు ఎలా వరిస్తుందో మనం ఏమాత్రం ఊహించలేం. దరిద్రం ఎప్పుడు తలుపు తడుతుందో కూడా ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఎన్నో సమస్యలతో ప్రారంభమయ్యే రోజు, రాత్రి నాటికి ఊహించని సంతోషంతో ముగిసే అవకాశాలూ ఉంటాయి. అమెరికాలోని ఒక వ్యక్తి ఒకే రోజులో ఇలాంటి విభిన్న మానసిక సంఘర్షణను ఎదుర్కొన్నాడు. ఉదయం పూట కారులో వెళ్తుండగా ప్రమాదంలో రెండు దుప్పులను ఢీకొట్టి మనోవేదనతో ఇంటికెళ్లాడు. సాయంత్రం నాటికి అతడు లాటరీలో కొన్ని లక్షల డాలర్లు గెల్చుకున్నాడు. అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన ఆంటొనీ డోవ్ ఒక లాటరీలో ఏకంగా 20 లక్షల డాలర్లు (రూ.14.60 కోట్లు) సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నానని అతడు చెబుతున్నాడు. ఇప్పుడు అతడి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. ఇంటర్నెట్‌లో ఈ వార్త వైరల్ అవుతోంది.

నార్త్ కరోలినాకు చెందిన ఆంటొనీ డోవ్ గతవారం ఎప్పటిలాగే తన కొత్త కారులో ఆఫీసుకు బయలుదేరాడు. అనుకోకుండా రోడ్డుమీదకు పరుగెత్తుకొచ్చిన రెండు దుప్పులను అతడు కారుతో ఢీకొట్టాడు. ఆ రోజంతా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మనసంతా బాలేదు. చాలా డిస్టర్బ్ అయ్యాడు. ఆ ప్రమాదం తరువాత ఇంటికి తిరిగి వెళ్లి, పడుకున్నాడు. సాయంత్రం నిద్ర లేవగానే, గతంలో కొనుగోలు చేసిన లాటరీ గురించి గుర్తుకువచ్చింది. దీంతో తన వద్ద ఉన్న టిక్కెట్లను తనిఖీ చేశాడు. మూడు టికెట్లలో ఎలాంటి ప్రైజ్ రాలేదు. కానీ నాలుగో టికెట్‌లో అతడు ఊహించని మొత్తంలో డబ్బు గెల్చుకున్నాడు. లాటరీలో అతడికి 20 లక్షల డాలర్లు వచ్చినట్లు తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. ఈ వివరాలను నార్త్ కరోలినా ఎడ్యుకేషన్ లాటరీ మంగళవారం వెల్లడించింది.

కొన్ని లక్షల మందిలో డోవ్‌ను లాటరీ వరించింది. ముందు అతడు పది లక్షల డాలర్లు విలువైన లాటరీని గెల్చుకున్నాడు. కానీ మెగాప్లయర్ టికెట్ డ్రా చేసినప్పుడు ఆ మొత్తం రెట్టింపు అయింది. ఇలా రెండుసార్లు అతడిని అదృష్టం వరించింది. ఈ లాటరీ గురించి తెలుసుకున్న తన కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఉన్నారని డోవ్ చెబుతున్నాడు. ఈ సోమవారం రాలేలోని లాటరీ ప్రధాన కార్యాలయంలో తన గిఫ్ట్‌ను క్లెయిమ్ చేసుకున్నాడు. ట్యాక్స్‌ ప్రొసీడింగ్స్ తరువాత అతడికి మొత్తం 14 లక్షల డాలర్లు వచ్చాయి. ఆ డబ్బుతో తన తల్లిదండ్రులకు ఇళ్లు కొనివ్వడంతో పాటు, ఆరోజు ప్రమాదంలో దెబ్బతిన్న తన కారును రిపేర్ చేయించుకుంటానని డోవ్ తెలిపాడు.

First published:

Tags: America, Us news, VIRAL NEWS

ఉత్తమ కథలు