ఇకపై ప్రెగ్నెంట్ మహిళలకు అమెరికాలో నో ఎంట్రీ... ఇవీ కొత్త రూల్స్...

తమ పిల్లలకు అమెరికాలో పౌరసత్వం పొందేలా చేసేందుకు చాలా మంది ప్రెగ్నెన్సీ మహిళలు... ఆ దేశంలో డెలివరీ అయ్యేలా చేసుకుంటున్నారు. దాంతో ట్రంప్ ప్రభుత్వం కఠిన కండీషన్లు పెడుతోంది.

news18-telugu
Updated: January 24, 2020, 12:56 PM IST
ఇకపై ప్రెగ్నెంట్ మహిళలకు అమెరికాలో నో ఎంట్రీ... ఇవీ కొత్త రూల్స్...
ఇకపై ప్రెగ్నెంట్ మహిళలకు అమెరికాలో నో ఎంట్రీ... ఇవీ కొత్త రూల్స్...
  • Share this:
అమెరికాలో వీసా అధికారులకు అక్కడి ట్రంప్ ప్రభుత్వం అదనపు పవర్స్ ఇచ్చింది. తద్వారా వారు ఇకపై... ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలు (గర్భిణీలు) అమెరికాకు రాకుండా అడ్డుకునేందుకూ, వారి వీసాను తిరస్కరించేందుకూ వీలవ్వనుంది. ప్రెగ్నెన్సీ ఉన్న ప్రతి ఒక్కర్నీ అమెరికా అడ్డుకోదు. ప్రెగ్నెన్సీతో అమెరికా వచ్చి... అక్కడ డెలివరీ చేయించుకునే అవకాశాలు ఉన్నాయి అని భావించే మహిళల వీసాల్ని మాత్రమే అధికారులు ఆపేస్తారని తెలిసింది. ఇందుకోసం వీసాకు అప్లై చేసుకున్నప్పుడే ఈ వివరాల్ని తెలుసుకుంటారు. ప్రపంచంలో ఎన్నో దేశాలుండగా... అమెరికాలోనే తమ పిల్లలు పుట్టాలని మహిళలు కోరుకుంటూ ఉండటానికి చాలా కారణాలున్నాయి. యూఎస్‌లో పుట్టీ పుట్టగానే... అక్కడి దేశ పౌరసత్వం లభించేస్తుంది. ఇందుకు ఎలాంటి కండీషన్లూ ఉండవు. ఇలా పౌరసత్వం ఇచ్చే దేశాలు కొన్నే ఉన్నాయి. అందువల్ల అమెరికాలోనే తమ డెలివరీ చేయించుకోవాలని చాలా మంది మహిళలు తాత్కాలిక టూరిస్ట్ వీసాలతో ఆ దేశానికి వెళ్తున్నారు. కొంత మంది మెడికల్ వీసాలపై వెళ్తున్నారు. ఈ బర్త్ టూరిజంను అడ్డుకోకపోతే... తమకే నష్టమని భావించిన ట్రంప్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

అమెరికా, దాని పక్కనే ఉండే కెనడాకు ఇలా బర్త్ టూరిజం కింద చాలా మంది వెళ్తున్నారు. ఇలా అమెరికాలో పుట్టే వారికి అక్కడి పౌరసత్వంతోపాటూ... ప్రభుత్వం కల్పించే సదుపాయాలు, వెసులుబాట్లూ, ఇన్సూరెన్సులూ ఇలా ఎన్నో ప్రయోజనాలు లభిస్తున్నాయి. అంతేకాదు... అక్కడ పుట్టే పిల్లల తల్లిదండ్రులు ఏ దేశం వారైనా... పిల్లలు మాత్రం అమెరికాలో ఉద్యోగాలు, శాశ్వత నివాసం అన్నీ పొందగలుగుతున్నారు. ఇది తమ దేశానికి భారంగా ట్రంప్ సర్కార్ భావిస్తోంది.

శుక్రవారం నుంచే ఈ కొత్త రూల్ అమల్లోకి వస్తున్నా... ఇందుకు సంబంధించిన నిబంధనలను పూర్తిగా వెల్లడించలేదు. ఏది ఏమైనా... రష్యా, చైనా, భారత్ లాంటి దేశాల్లో మహిళలకు ఇది ఇబ్బంది కలిగించేదే. అమెరికాకు బర్త్ డెలివరీ కింద వెళ్లే వారిలో భారతీయ మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ఇప్పటికే వీసాలకు సంబంధించి ఎన్నో కండీషన్లు తెచ్చిన ఇమ్మిగ్రేషన్ అధికారులు... ఇప్పుడీ కొత్త రూల్స్ తేవడం ద్వారా... విదేశీయులకు మరో షాక్ ఇస్తున్నట్లే.

First published: January 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు