అప్ఘానిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఐసిస్-కే ఉగ్రవాదులు అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. తాలిబన్ల చట్టాలతో ఇప్పటికే వణికిపోతున్న అప్ఘన్లు.. ఇఫ్పుడు ఈ ముష్కర మూకల దాడులతో ప్రాణాలరచేత పట్టుకొని కాలం వెల్లదీస్తున్నారు. మూడు రోజుల క్రితం ఆత్మాహుతి దాడులతో కాబుల్‌లో టెర్రరిస్టులు రక్తపుటేరులు పారించిన విషయం తెలిసిందే. వరుస పేలుళ్లలో దాదాపు 200 మంది మరణించారు. ఐతే ఈ నెత్తుటి గాయాలను మరవక ముందే మరో విధ్వంసానికి ఐసిస్-కే ఉగ్రవాదులు స్కెచ్ చేశారు. కారు నిండా బాంబులు నింపి.. కాబూల్ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న ఆత్మాహుతి దళ సభ్యులే లక్ష్యంగా అమెరికా ఆర్మీ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఐదు ఫైటర్ జెట్లతో బాంబులను జార విడిచింది. ఈ ఘటనలో కారులో ఉన్న టెర్రరిస్టులు మరణించారు. ఎయిర్ స్ట్రైక్స్ ధాటికి వారి వాహనాలు తునాతునకలయ్యాయి. ఆత్మ రక్షణ కోసమే వైమానిక దాడులు చేశామని.. ఈ దాడుల్లో సామాన్య పౌరులు చనిపోయినట్లుగా సమాచారం లేదని అమెరికా వెల్లడించిది. పక్కా వ్యూహంతో టార్గెట్‌పై ఎయిర్‌స్ట్రైక్స్ చేయడంతో పెను తప్పిందని అభిప్రాయపడ్డారు.
CENTCOM: “US military forces conducted a self-defense unmanned over-the-horizon airstrike today on a vehicle in Kabul, eliminating an imminent ISIS-K threat to Hamad Karzai International airport," said Capt. Bill Urban, CENTCOM spokesperson.
— Natasha Bertrand (@NatashaBertrand) August 29, 2021
Kabul Blast: కాబూల్‌లో భారీ పేలుడు.. అమెరికా హెచ్చరించిన కొన్ని గంటల్లోనే దాడులు
మరోవైపు ఇవాళ సాయంత్రం కూడా ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కాబూల్ ఎయిర్ పోర్టు సమీపంలో రాకెట్ దాడితో విరుచుకుపడ్డారు. అమెరికా సైనికులే లక్ష్యంగా దాడులు చేశారు. కానీ అవి గురితప్పి అమెరికా ఎంబసీపై కాకుండా, జనావాసాలపై పడ్డాయి. ఖవాజా భఘ్రా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో.. భారీ పేలుడు సంభవించింది. ఓ చిన్నారి సహా ఇద్దరు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కాబూల్ ఎయిర్‌పోర్టులో వరుస పేలుళ్ల తర్వాత.. ఐసిస్-కే ఉగ్రవాద స్థావరాలపై అమెరికా సైన్యం డ్రోన్ దాడి చేసింది. తమ దాడుల్లో ఐసిస్-కే ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక నేత మరణించాడని అమెరికా పేర్కొంది. దానికి ప్రతీకారంగా ఆదివారం సాయంత్రం టెర్రరిస్టులు రాకెట్లతో దాడులకు పాల్పడ్డారు. రానున్న 24 నుంచి 36 గంటల్లో కాబుల్‌లో మరో ఉగ్రదాడి జరగవచ్చని ఇది వరకే అమెరికా హెచ్చరించిన విషయం తెలిసిందే. కాబూల్ విమానాశ్రయంపై ఉగ్రవాదులు బాంబులతో విరుచుకుపడే అవకాశముందని స్వయంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. బైడెన్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే కాబూల్‌లో బాంబు దాడి జరిగింది.
ఆఫ్గానిస్థాన్ లో ఆందోళనకర పరిస్థితులు.. డబ్బులు లేని బ్యాంకులు.. ప్రజల అవస్థలు
కాగా, గురువారం సాయంత్రం కాబూల్ ఎయిర్‌పోర్టులో వరుస పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఐసిస్-కే ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులతో మారణహోమం సృష్టించారు. దాదాపు ఏడు పేలుళ్లు జరిగినట్లు స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ ఘటనల్లో ఇప్పటి వరకు 200 మందికి పైగా మరణించారు. మరో 300 మంది గాయపడ్డారు. మృతుల్లో అమెరికాకు చెందిన 13 మంది సైనికులు కూడా ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Kabul, Kabul blast, Taliban