Home /News /international /

US KILLS AL QAEDA CHIEF AYMAN AL ZAWAHIRI IN DRONE STRIKE IN AFGHANISTAN AND JOE BIDEN SAYS JUSTICE DELIVERED FOR SEPTEMBER 11 ATTACKS MKS

Al Qaeda Al-Zawahiri : అల్‌ఖైదా చీఫ్ అల్-జవహరీని లేపేశాం : US Prez Joe Biden

బిన్ లాడెన్ తో అల్ జవహరీ (పాత ఫొటో)

బిన్ లాడెన్ తో అల్ జవహరీ (పాత ఫొటో)

అగ్రరాజ్యాన్ని జీవితాంతం భయపడేలా చేసిన ‘9/11 దాడుల’ కీలక సూత్రధారి, ఒకప్పటి ఒసామా బిన్ లాడెన్ ప్రధాన అనుచరుడు, ప్రస్తుత అల్ ఖైదా చీఫ్ అల్-జవహరీ (71)ని అమెరికా ఎట్టకేలకు అంతం చేసింది. ఈ విషయాన్ని జో బైడెన్ ప్రకటించారు.

ప్రపంచ రాజకీయ గతిని సమూలంగా మార్చేసిన ‘సెప్టెంబర్ 11 దాడులు’ (September 11 attacks)కు సంబంధించి సంచలన ముగింపు లాంటి ఘటన చోటుచేసుకుంది. అగ్రరాజ్యాన్ని జీవితాంతం భయపడేలా చేసిన ‘9/11 దాడుల’ కీలక సూత్రధారి, ఒకప్పటి ఒసామా బిన్ లాడెన్ ప్రధాన అనుచరుడు, ప్రస్తుత అల్ ఖైదా చీఫ్ అల్-జవహరీ (71)ని (Al Qaeda chief Ayman al Zawahiri) అమెరికా ఎట్టకేలకు అంతం చేసింది. అల్ ఖైదా అధినేత జవహరీని హతం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ (Joe Biden) స్వయంగా వెల్లడించారు. వివరాలివే..

అల్‌ఖైదా చీఫ్ ఇమన్ అల్ జవహరిని అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) హతమార్చింది. అఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో ఆదివారం (జులై 31న) జరిగిన డ్రోన్ దాడిలో జవహరీని అంతమొందిందినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం నాడు అధికారికంగా ప్రకటించారు.

Gold Silver Rates: పసిడి ప్రియులకు కాస్త ఊరట.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే..


9/11 దాడులకు పాల్పడిన ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్‌ను 2011లో హతమార్చిన తర్వాత అల్‌ఖైదాపై మళ్లీ ప్రతీకారం తీర్చుకున్నామని అమెరికన్ అధికారులు పేర్కొన్నారు. ఆదివారం తెల్లవారుజామున ఈ దాడి జరిగినట్లు చెప్పారు. అయితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

PM Modi | Mann ki Baat : ఆగస్టు 2 నుంచి మీ సోషల్ మీడియా డీపీ ఇలా మార్చుకోండి : మోదీ


ఈజిప్ట్ వైద్యుడిగా పేరొందిన అల్ జవహరీ.. లాడెన్ తర్వాత అల్ ఖైదా చీఫ్ గా వ్యవహరిస్తున్నాడు. 2001లో సెప్టెంబర్ 11నాటి అమెరికాపై దాడుల్లో జవహరీది కీలక పాత్ర. అమెరికా గడ్డపైనే నాలుగు విమానాలను హైజాక్ చేసిన టెర్రరిస్టులు.. వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డబ్ల్యూటీసీ)లోని రెండు టవర్లను 2 విమానాలతో ఢీకొట్టించడం, మూడో విమానాన్ని పెంటగాన్‌పై కూల్చడం, నాలుగో విమానం షాంక్‌విల్లేలోని పొలంలో కూలిపోవడం తెలిసిందే. నాటి దాడుల్లో 3,000 మంది చనిపోయారు. దానికి ప్రతీకారంగా అమెరికా అఫ్గానిస్థాన్ పై యుద్ధం చేయడం, 20 ఏళ్ల తర్వాత మళ్లీ తాలిబన్లకే రాజ్యం అప్పగించి వెళ్లిపోవడం వర్తమాన చరిత్ర.

CM KCR : గండం గట్టెక్కేనా? ఉద్యోగులకు సకాలంలో జీతం అందేనా? ఢిల్లీలో కేసీఆర్ ఏం చేశారు?





"అమెరికా తన పౌరులను రక్షించడంలో కోసం ఎల్లవేళలా అండగా ఉంటుంది. అదేవిధంగా మాకు హాని కలిగించే వారికి ప్రతీకారం తీర్చుకునే తీరుతాం. ఉగ్రవాదులు ఎక్కడ దాగి ఉన్నా మేము కనుగొని హతమార్చడానికి ఎంతో సమయం పట్టదని ఈరోజు మళ్లీ రుజువు చేశాం" అని జవహరీ హతం ప్రకటనలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు.



కాగా, ఈ ఘటనపై తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ స్పందిస్తూ అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘిస్తూ దాడి చేశారంటూ తీవ్రంగా ఖండించారు. ఆదివారం తెల్లవారుజామున కాబుల్‌లో భారీ పేలుడు సంభవించిందని అఫ్ఘన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్ధుల్ నఫీ తాకోర్ చెప్పారు. షేర్పూర్‌లోని ఒక ఇంటిపై డ్రోన్ దాడి జరిగిందని.. అయితే, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆయన స్పష్టం చేశారు.
Published by:Madhu Kota
First published:

Tags: Afghanistan, Joe Biden, Terrorists, USA

తదుపరి వార్తలు