Home /News /international /

US IRAN CRISIS TEHRAN CLAIMS 80 AMERICAN TERRORISTS KILLED IN MISSILE STRIKE SK

ఇరాన్ క్షిపణి దాడుల్లో 80 మంది అమెరికన్లు మృతి

ఇరాన్ క్షిపణి దాడులు

ఇరాన్ క్షిపణి దాడులు

ఈ దాడుల్లో అమెరికాకు చెందిన 80 మంది టెర్రరిస్టులు హతమయ్యారని ఇరాన్ స్టేట్ టెలివిజన్ తెలిపింది. యూఎస్ ఆర్మీ హెలికాప్టర్లు, ఆయుధ సామాగ్రి పెద్ద మొత్తంలో ధ్వంసమైందని వెల్లడించింది.

    అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మేజర్ జనరల్ ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. బుధవారం 15 క్షిపణులతో అల్ అసద్, ఎర్బిల్ బేస్‌లపై విరుచుకుపడింది. అమెరికా భద్రతా దళాలే లక్ష్యంగా ఈ దాడులకు పాల్పడింది. క్షిపణి దాడుల్లో అమెరికాకు చెందిన 80 మంది టెర్రరిస్టులు హతమయ్యారని ఇరాన్ స్టేట్ టెలివిజన్ తెలిపింది. యూఎస్ ఆర్మీ హెలికాప్టర్లు, ఆయుధ సామాగ్రి పెద్ద మొత్తంలో ధ్వంసమైందని వెల్లడించింది. ఇరాక్‌లో మరో 100 ప్రాంతాలను టార్గెట్ చేశామని.. అమెరికా కవ్వింపులకు పాల్పడితే గట్టి సమాధానం చెబుతామని ఇరాన్ ప్రభుత్వం హెచ్చరించింది.

    రాకెట్ దాడులతో ఇరాన్ సైన్యం ప్రతీకారం తీర్చుకుందని ఇరాన్ సుప్రీం లీడర్ అయితుల్లా అలీ ఖమేనీ వెల్లడించారు. అమెరికా చెంప చెల్లుమనిపించామని ఆయన ఆవేశంగా ప్రసంగించారు.
    ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తత సమయంలోనే ఇరాన్‌లో ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్ 737 ప్యాసింజర్ విమానం కుప్పకూలింది. తెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమీని ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం 176 మంది చనిపోయారు. మృతుల్లో 82 మంది ఇరానీలు ఉన్నారు. ఈ ఘటన తర్వాత ఇరాన్, ఇరాక్ గగనతలం మీదుగా వెళ్లే విమానాలను ఆయా దేశాలు రద్దు చేశాయి. ఎయిర్ ఫ్రాన్స్, సింగపూర్ ఎయిర్ లైన్స్ సంస్థలు ఇరాన్ మీదుగా వెళ్లే తమ విమానాల సర్వీసులను రద్దు చేశాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Iran, Iran US Tension

    తదుపరి వార్తలు