Home /News /international /

US HOUSE VOTES FOR CAATSA SANCTIONS WAIVER TO INDIA OVER S 400 MISSILE DEAL WITH RUSSIA MKS

Modi పట్టుకు దిగొచ్చిన Biden -భారత్‌పై CAATSA ఎత్తేసిన అమెరికా -రష్యా ఎస్‌-400 రయ్ రయ్

బైడెన్, పుతిన్, మోదీ (పాత ఫొటో)

బైడెన్, పుతిన్, మోదీ (పాత ఫొటో)

ఉక్రెయిన్ యుద్ధ సందర్భంలోనూ రష్యాతో భారత్ అయుధాల ఒప్పందాలను వేగవంతం చేయగా.. ఆంక్షలు విధిస్తామని హెచ్చరిన అమెరికానే చివరికి తలొగ్గక తప్పలేదు. కాట్సా ఆంక్షల నుంచి భారత్‌ను మినహాయిస్తూ రూపొందించిన సవరణ చట్టానికి అమెరికా ఆమోదం..

ప్రపంచ రాజకీయాల్లో భారత్ (India) తనదైన పట్టు నిరూపించుకున్న సందర్భమిది. సుదీర్ఘ కాలంగా రష్యాతో ప్రచ్ఛన్న యుద్ధం చేస్తోన్న అమెరికా (USA).. ఉక్రెయిన్ పై పుతిన్ దురాక్రమణ (Ukraine Russia War) తర్వాత కనీవినీ ఎరుగని ఆంక్షలు విధించి, రష్యాతో సంబంధాలు పెట్టుకునే ఏ దేశానికైనా ఇదే గతి అని గట్టిగా హెచ్చరించింది. కానీ భారత్ మాత్రం అమెరికాకు భయపడి తన సాంప్రదాయ స్నేహం రష్యాతో బంధాలు తెంచుకోడానికి నో చెప్పింది.

ప్రపంచ గతిని మార్చుతోన్న ఉక్రెయిన్ యుద్ధ సందర్భంలోనూ రష్యాతో భారత్ ఎస్-400 క్షిపణి వ్యవస్థ (S-400 Missile) ఒప్పందాలను వేగవంతం చేయగా.. ఆంక్షలు విధిస్తామని హెచ్చరిన అమెరికానే చివరికి తలొగ్గక తప్పలేదు. ‘మీ ప్రయోజనాల కోసం మా అవసరాలను బలిపెట్టలేం’అన్నట్లుగా మోదీ కరాకండిగా నిలబడటంతో మెట్టుదిగటం తప్ప బైడెన్ కు మరో దారి లేకుండా పోయింది. వివరాలివే..

TRS vs BJP : తిరిగి టీఆర్ఎస్‌లోకి ఈటల రాజేందర్? -కేటీఆర్ స్పందన -కేసీఆర్ మరో రికార్డు!


అమెరికా ప్రతినిధుల సభ(దిగువ సభ)లో భారత్‌కు అనుకూలంగా కీలక అడుగు పడింది. కౌంటరింగ్‌ అమెరికా యాడ్వర్సరీస్‌ త్రూ శాంక్షన్స్‌ యాక్ట్‌(అమెరికా విరోధులను ఎదుర్కొనే ఆంక్షల చట్టం-కాట్సా) నుంచి భారత్‌ను మినహాయిస్తూ రూపొందించిన సవరణ చట్టానికి సంబంధించిన బిల్లు ఆమోదం పొందింది. ఇండియన్‌ అమెరికన్‌, డెమొక్రటిక్‌ పార్టీ చట్టసభ సభ్యుడు ఆర్‌వో ఖన్నా ప్రవేశ పెట్టిన ఈ సవరణ ప్రతిపాదనను మూజువాణి ఓటుతో దిగువసభ సభ్యులు ఆమోదించారు. ఫలితంగా రష్యా నుంచి భారత్‌ ‘ఎస్‌-400’ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసే ఒప్పందానికి మార్గం సుగమమైంది.

Monsoon session: 18 నుంచి ఢిల్లీలో దబిడి దిబిడే -బీజేపీకి చుక్కలు చూపించేలా KCR ప్లాన్


తద్వారా పొరుగు దేశం చైనా దూకుడును కట్టడి చేసేందుకు భారత్‌కు అవకాశం లభించినట్టు అయింది. గురువారం అమెరికా జాతీయ రక్షణ ఆథరైజేషన్‌ చట్టం(ఎన్‌డీఏఏ)పై చర్చలో భాగంగా ప్రవేశ పెట్టిన ఈ సవరణ చట్టానికి సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా కాలిఫోర్నియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్‌వో ఖన్నా మాట్లాడుతూ.. చైనా నుంచి భారత్‌కు ఎదురవుతున్న కవ్వింపులను ప్రస్తావించారు. ఇలాంటి సమయంలో అమెరికా.. భారత్‌ పక్షాన నిలవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

CM KCR| CNOS Survey : అసంతృప్తి ఉన్నా కేసీఆర్‌కు తగ్గని ప్రజాదరణ.. జాతీయ సర్వేలో 11వ ర్యాంక్


2018, అక్టోబర్ లో భారత్‌.. రష్యా నుంచి ఎస్‌-400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసేందుకు సుమారు రూ.35 వేల కోట్ల ఒప్పందానికి సంబంధించి సంతకాలు చేసింది. ‘ఎస్‌-400’ అనేది ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే అత్యంత అధునాతనమైన రష్యా క్షిపణి వ్యవస్థ. రక్షణ రంగంలో పాశుపతాస్త్రంగా దీనిని భావిస్తారు. భారత్‌ ఈ వ్యవస్థను కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్న తర్వాత.. అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ‘కాట్సా’ చట్టాన్ని ప్రయోగిస్తామని హెచ్చరికలు జారీ చేసింది.

India Population : అత్యధిక జనాభా గల దేశంగా భారత్.. కొద్ది రోజుల్లోనే చైనాను దాటేస్తున్నాం..


రష్యాతో డీల్స పెట్టుకుంటే ఆంక్షలు తప్పవనే హెచ్చరికలను బేఖాతరు చేస్తూ భారత్ దీటుగా వ్యవహరించడంతో కాట్సా చట్టం నుంచి మనకు మినహాయింపు లభించింది. అయితే, కాట్సా చట్టం నుంచి భారత్‌ను మినహాయించడం ద్వారా అమెరికానే ఎక్కువగా లబ్ధి పొందే అవకాశం కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇండో పసిఫిక్‌లో చైనా దూకుడు, డ్రాగన్‌ దేశం అవలంభిస్తున్న విధానాలు.. వంటివాటిని దృష్టిలో పెట్టుకుంటే.. దక్షిణాసియాలో తమకు మద్దతు ప్రకటించే దేశంగా ఉన్న భారత్‌ను మరింత బలోపేతం చేయాలని అమెరికా భావిస్తోంది. తద్వారా తన ఆధిపత్యం చెదిరిపోకుండా చూసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. అదేసమయంలో భారత్‌ కూడా తనను తాను శక్తిమంతంగా మలుచుకుంటున్న నేపథ్యంలో అమెరికా ఒకింత తగ్గడమే మంచిదన్న భావనలో ఉంది.
Published by:Madhu Kota
First published:

Tags: India, Joe Biden, Missile, Pm modi, Russia, Russia-Ukraine War, USA, Vladimir Putin

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు