Home /News /international /

US HOUSE SPEAKER NANCY PELOSI HUSBAND PAUL PELOSI ARRESTED GRANTED BAIL AT USD 5000 PVN

Paul Pelosi arrested : అమెరికా స్పీకర్ భర్త అరెస్ట్!..కారణం అదే

'స్పీకర్ నాన్సీ పెలోసితో భర్త పాల్ పెలోసి

'స్పీకర్ నాన్సీ పెలోసితో భర్త పాల్ పెలోసి

Speaker Nancy Pelosi husband arrested : అమెరికా ప్ర‌తినిధుల స‌భ స్పీక‌ర్ నాన్సీ పెలొసి(Nancy Pelosi) భ‌ర్త పౌల్ పెలొసి(82)ని పోలీసులు అరెస్టు చేశారు. శాన్ ఫ్రాన్సిస్‌కోకి చెందిన పాల్ పెలొసికి..1963లో నాన్సీ పెలొసితో పెళ్లి అయింది. వీరికి ఐదుగురు పిల్లలు ఉన్నారు.

ఇంకా చదవండి ...
Paul Pelosi arrested : అమెరికా ప్ర‌తినిధుల స‌భ స్పీక‌ర్ నాన్సీ పెలొసి(Nancy Pelosi) భ‌ర్త పాల్ పెలొసి(82)ని పోలీసులు అరెస్టు చేశారు. పాల్ పెలోసీని మద్యం సేవించి వాహనం నడిపినందుకు అరెస్టు చేశారు. నాపా కౌంటీలో శనివారం రాత్రి ఈ అరెస్టు జరిగింది. రెండు నేరాభియోగాల‌పై ఆయ‌న్ను జైలుకు తీసుకువెళ్లారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం మరియు 0.08 pc లేదా అంతకంటే ఎక్కువ రక్తంలో ఆల్కహాల్ ఉన్న డ్రైవింగ్ చేయడం వంటి రెండు ఆరోపణలపై పాల్ పెలొసి(Paul Pelosi) జైలుకు వెళ్లాడు. అయితే 5 వేల డాల‌ర్ల పూచీక‌త్తుపై పౌల్ పెలొసికి బెయిల్ మంజూరు కావడంతో ఆదివారం ఉదయం ఆయన విడుదలయ్యాడు.

ఈ ఘ‌ట‌న ప‌ట్ల స్పీక‌ర్ పెలొసి ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేద‌ని ఆమె ప్ర‌తినిధి తెలిపారు. పెలోసి ప్రతినిధి డ్రూ హామిల్ నుండి ఒక ప్రకటనలో.."ఈస్ట్ కోస్ట్‌లో ఉన్నప్పుడు జరిగిన ఈ ప్రైవేట్ విషయంపై స్పీకర్ వ్యాఖ్యానించరు" అని చెప్పారు. శాన్ ఫ్రాన్సిస్‌కోకి చెందిన పాల్ పెలొసికి..1963లో నాన్సీ పెలొసితో పెళ్లి అయింది. వీరికి ఐదుగురు పిల్లలు ఉన్నారు.

ALSO READ Nepal Plane Crash : నేపాల్ విమాన ప్రమాదం..14 మంది మృతదేహాలు లభ్యం

మరోవైపు, అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోతోంది. వరుస కాల్పుల ఘటనలు అగ్రరాజ్యాన్ని వణికిస్తున్నాయి. స్కూల్ లో చొరబడి దుండగులు కాల్పులు జరిపిన ఘటనలో 19 మంది విద్యార్థులు సహా 21 మంది చనిపోయిన ఘటన మరవకముందో మరోసారి కాల్పుల మోత మోగింది. తాజాగా ఓక్లహోమా లోని ఓల్డ్ సిటీ స్కేర్ లో మెమోరియల్ డే ఫెస్టివల్ లో ఓ యువకుడు రెచ్చిపోయాడు. చేతిలో తుపాకి పట్టుకుని ఫైర్ చేశాడు. ఈ కాల్పుల్లో ఓ మహిళ చనిపోయింది. చిన్నారి సహా ఏడుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఒక్కసారిగా కాల్పులు జరగడంతో ఫెస్టివల్ కు వచ్చిన జనాలు షాకయ్యారు. భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ప్రాణాలు దక్కించుకునే క్రమంలో పరుగులు తీయడంతో కొందరు కిందపడి గాయపడ్డారు. కాల్పులు జరిపిన వ్యక్తిని 26 ఏళ్ల స్కైలర్ బక్నర్ గా గుర్తించారు. ఫైర్ చేసిన తర్వాత స్పాట్ నుంచి పారిపోయాడు బక్నర్. అయితే దుండగురు పోలీసుల ముందు లొంగిపోయాడని తెలుస్తోంది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Man arrested, USA

తదుపరి వార్తలు