Vaccine Policy: వ్యాక్సిన్‌ వేసుకుంటే రూ.7 కోట్లు ఇస్తారట.. ఎక్కడంటే...

ఈ ఏడాది ఆగ‌స్టు నుంచి డిసెంబ‌ర్ మ‌ధ్య దేశంలో మొత్తం 216 కోట్ల టీకా డోసులు అందుబాటులోకి రానున్నాయ‌ని ఆయన చెప్పారు.

అమెరికాలోని ఓ రాష్ట్రంలో వ్యాక్సిన్‌ వేయించుకుంటే ఒక మిలియన్‌ డాలర్లు బహుమతిగా ఇస్తామంటున్నారు. అంటే మన కరెన్సీ ప్రకారం సుమారు ?

  • Share this:
మన దేశంలో వ్యాక్సిన్‌ వేయించుకుందామంటే దొరకని పరిస్థితి. తొలి డోస్‌ వాళ్లకు లేదు, రెండో డోస్‌ వాళ్లకే ఇస్తాం. 45 ఏళ్లు పైబడినవారికే ఇస్తాం అంటూ రకరకాల కొర్రీలు ఉన్నాయి. అయితే అమెరికాలోని ఓ రాష్ట్రంలో వ్యాక్సిన్‌ వేయించుకుంటే ఒక మిలియన్‌ డాలర్లు బహుమతిగా ఇస్తామంటున్నారు. అంటే మన కరెన్సీ ప్రకారం సుమారు రూ.7.35 కోట్లు అన్నమాట. ఇంతకీ ఏంటీ స్కీం, ఏ రాష్ట్రంలో అమలు చేస్తోంది, దానికి అక్కడి ప్రజలు ఏమంటున్నారో చూద్దాం!

యూఎస్‌లోని ఒహియో రాష్ట్రంలో ఈ వ్యాక్సిన్‌ బంపర్‌ ఆఫర్‌ను తీసుకొచ్చారు. అక్కడి గవర్నర్‌ మైక్‌ డివైన్‌ ఆలోచన ఇది. వ్యాక్సిన్‌ వేసుకున్నవారిలో లక్కీ డ్రా తీసి అందులో ఐదుగురికి బహుమతి ఇవ్వాలని నిర్ణయించారు. దీని కోసం రూ.7.35 కోట్లను అక్కడి ప్రభుత్వం కేటాయించింది . దాని వల్ల ఆ రాష్ట్రంలో ఓటర్లందరూ వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి ముందుకొస్తారనేది ఆయన ఆలోచనట. ఈ మేరకు ట్విటర్‌లో ప్రకటించారాయన. బహుమతి గెలుపొందడానికి కనీసం ఫస్ట్‌ డోస్‌ తీసుకొని ఉండాలనేది నిబంధన. ప్రతి బుధవారం ఈ లక్కీ డ్రా విజేతను ప్రకటిస్తారట. అలా ఐదు వారాల పాటు ఈ డ్రా ఉంటుందట. రాష్ట్రంలోని ఓటర్ల జాబితా నుండి ప్రతి వారం డ్రా తీస్తున్నారట. డేటా బేస్‌ ఎవరిదైనా పేరు లేకపోతే ఎంట్రీ చేసుకునేలా ఆప్షన్‌ కూడా ఇచ్చారు.

వ్యాక్సిన్‌ లాటరీ స్కీమ్‌ విషయంలో కొంతమంది నుండి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు అంటూ... కొంతమంది విమర్శిస్తున్నారు. దీనిపై గవర్నర్‌ డివైన్‌ మాట్లాడుతూ ... కరోనా సమయంలో ఇది ఏమంత చెత్త ఆలోచన కాదు. అందరికీ వ్యాక్సిన్‌ అందించాలనే ఆలోచనే కారణం. ఈ విధంగా అయినా చాలామంది కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి ముందుకొస్తారు అని చెప్పారాయన. అయితే గవర్నర్‌ ఆలోచనను కొంతమంది సామాన్యులు కొట్టిపారేస్తున్నారు. ఇలాంటి లాటరీలు పెట్టేకన్నా... అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందని అంటున్నారు. ప్రజల సొమ్మును ఇలా లాటరీల రూపంలో ఏ కొంతమందికో ఇచ్చే కంటే... వ్యాక్సిన్‌ వేయించుకునేలా ప్రజల్ని ప్రోత్సహించేలా ప్రకటనలు ఇచ్చినా సరిపోతుంది కదా అంటున్నారు. దాని వల్ల ఇన్ని డాలర్లు ఖర్చు ఉండదు కదా అని అంటున్నారు.

ఇక యూఎస్‌ వ్యాక్సినేషన్‌ లెక్క చూస్తే... ఆ దేశంలో ఇప్పటివరకు 35 శాతం మందికి వ్యాక్సినేషన్‌ జరిగింది. అందులోనూ ఒహియో రాష్ట్రంలోో అత్యధికంగా 36 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్‌ పొందారు. ఇక ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ శాతం తీసుకుంటే 4.2 శాతంగా ఉంది. మన దేశంలో అయితే అది మూడు శాతమే ఉందట. ప్రస్తుతం మన దేశంలో కావాల్సినన్ని వ్యాక్సిన్లు లేక వ్యాక్సినేషన్‌ వాయిదా పడుతున్న పరిస్థితి. మరోవైపు తొలి రోజుల్లో వ్యాక్సినేషన్‌ అంటే ముందుకురాని జనం, ఇప్పుడు సెకండ్‌ వేవ్‌ను చూసి ముందుకొస్తున్నారు.
First published: