అమెరికా(America)లో పెరిగిపోతున్న గన్ (Gun)కల్చర్‌కి శాశ్వత పరిష్కారం కొనుగొనాలని అగ్రరాజ్యం ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా దేశంలో హింసాత్మక ఘటనలు, ఎందరో ప్రాణాలు కోల్పోవడం వంటి వాటిని దృష్టిలో పెట్టుకొని దేశపౌరుల భద్రతతో పాటు తుపాకీ వాడకాన్ని తగ్గించాలని ప్రయత్నం చేస్తోంది. అమెరికా చేస్తున్న ప్రయత్నాలపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గన్ మార్కెట్(Gun market) ని మూసివేసే విధంగా నూతన ఆలోచన చేస్తోంది అమెరికా. తుపాకులు(Guns), పిస్టోల్స్(Pistols) స్థానంలో స్మార్ట్ గన్(Smart guns)లను రూపొందించే పనిలో పడింది అగ్రరాజ్యం. ఇందుకోసం ఇప్పటికే తుపాకులు తయారు చేసే పలు సంస్థలు రూపొందించిన స్మార్ట్గన్(smart guns)లను పరిశీలించడం జరిగింది. అతి త్వరలోనే ఇవి అమెరికాలో అందుబాటులోకి వస్తాయనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే ఇది ముమ్మాటికి అసాధ్యమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అమెరికా (America)మార్కెట్లోకి తేవాలని చూస్తున్న స్మార్ట్ గన్లను కనీసం 20ఏళ్ల (20 Yesrs)పాటు తుపాకీ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే కాల్చగలిగేలా రూపొందించాలని ప్లాన్ చేస్తోంది అమెరికా. ఇలా చేయడం వల్ల అందరికి స్మార్ట్ గన్ ఉపయోగపడదనే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి స్మార్ట్గన్లు తయారై మార్కెట్లోకి వస్తాయని అమెరికాలోని నిపుణులు, మేధావి వర్గాలు ఏమాత్రం నమ్మడం లేదు. స్మార్ట్ గన్లను మార్కెట్లోకి తేవడం వల్ల ఆత్మహత్యలు తగ్గుతాయని, ఒకవేళ స్మార్ట్గన్ పోగొట్టుకున్న, ఎవరైనా ఎత్తుకెళ్లినా వాటిని నిర్వీర్యం చేయవచ్చని, భద్రత సిబ్బందిని రక్షించగలవని స్మార్ట్గన్ ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తున్న వాళ్లు చెబుతున్నారు.
తుపాకులే కాకపోతే స్మార్ట్..
అమెరికాలో తుపాకీ నియంత్రణ దిశగా అక్కడి ప్రభుత్వం ఆలోచించడాన్ని కొన్ని వర్గాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. సంక్షోభ సమయంలో లేదా దాడి జరిగే సమయాల్లో ఇంటిని, లేక వ్యక్తులను రక్షించుకోవడానికి యజమానులు చేసే ప్రయత్నంలో స్మార్ట్గన్ ఏమాత్రం దోహదపడదని విమర్శిస్తున్నారు. అంతే కాదు స్మార్ట్ గన్ని నమ్ముకున్న సంపన్నులకు ఒకరకంగా భద్రత ఉండకపోగా..ప్రమాదకరమనే చెప్పాలంటున్నారు. అయితే అగ్రరాజ్యంలో తుపాకీ వాడకం నియంత్రణపై చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నప్పటికి అవి ఏమాత్రం కార్యరూపం దాల్చలేదంటున్నాయి అగ్రరాజ్యంలోని మేధావి వర్గాలు.
సాధ్యమయ్యే పనేనా..!
జాతీయ తుపాకీ ఆయుధాల సర్వే లెక్కల ప్రకారం అమెరికాలో ఉండే వయోజనుల్లో వన్ థర్డ్ పర్సంటేజ్ తుపాకులు వాడుతున్నారు. ఇక దేశ వ్యాప్తంగా ఉన్న జనాభాలో సుమారు 81.4 మిలియన్ (Million)మంది తుపాకులు కలిగి ఉన్నట్లుగా సర్వేల్లో తేలింది. అంటే ప్రపంచంలోనే అత్యధికంగా తుపాకులు ఉపయోగించే దేశాల్లో అమెరిక (America)మొదటి స్థానంలో నిలిచింది. అందుకే గతేడాది అమెరికాలో 691చోట్ల ఎదురు కాల్పులు జరిగాయి. అయితే స్మార్ట్ గన్ అమెరికా అందుబాటులోకి తెస్తే తుపాకీ కాల్పులు తప్పి ప్రాణనష్టం తగ్గవచ్చేమో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.