Home /News /international /

US FORCES IN CONTROL OF KABUL AIRPORT ALLOW INDIA TO OPERATE TWO FLIGHTS DAILY FOR EVACUATION NS

Afghanistan: కాబుల్ కు నిత్యం రెండు విమానాలు నడిపేందుకు భారత్ కు అనుమతి.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కాబుల్ నుంచి ఇండియాకు నిత్యం రెండు ఫైట్లను నడిపేందుకు అమెరికా బలాగాలు అనుమతులు ఇచ్చాయి. ప్రస్తుతం ఇండియాకు చెందిన 300 మందికి పైగా పౌరులు ఇంకా ఆఫ్గనిస్తాన్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది.

    ఆఫ్గనిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించిన అనంతరం అక్కడ భయానక పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ ఉంటున్న వివిధ దేశాల ప్రజలు అక్కడి నుంచి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వారితో పాటు ఆఫ్గాన్ వాసులు కూడా దేశం విడిచి వెళ్లడానికి యత్నిస్తున్నారు. ఈ పరిణామాలతో కాబుల్ ఎయిర్పోర్ట్ కు భారీగా ప్రజలు చేరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఆ విమానశ్రయం అమెరికా బలగాల ఆధ్వర్యంలో ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇండియా నిత్యం రెండు ఫైట్లను నడిపేందుకు అమెరికా బలాగాలు అనుమతులు ఇచ్చాయి. ప్రస్తుతం ఇండియాకు చెందిన 300 మందికి పైగా పౌరులు ఇంకా ఆఫ్గనిస్తాన్ లోనే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం 90 మందితో కూడిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ కాబుల్ నుంచి బయలుదేరింది. ఈ ఫ్లైట్ ఈ రోజు లేదా ఢిల్లీలో ల్యాండ్ కానుంది. విదేశీ వ్యవహారాల శాఖ అఫ్గనిస్తాన్ లోని భారతీయులు సురక్షితంగా కాబుల్ విమానశ్రయానికి చేరుకునేలా చర్చలు జరుపుతున్నారు.
    Taliban: తాలిబన్ల తొలి ఫత్వా ఇదే.. దానిపై నిషేధం..వీళ్లు మారలేదు.. మారినట్లు నటిస్తున్నారు..

    ఇదిలా ఉంటే.. కాబూల్ విమానాశ్రయం పూర్తి నియంత్రణలో ఉందని, అక్కడి నుంచి పౌరుల తరలింపు కొనసాగుతోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్‌లో కొనసాగుతున్న సంక్షోభంపై ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆఫ్గనిస్తాన్ ను విడిచిపెట్టే సమయం ఆసన్నమైందని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు. అయితే.. కాబుల్ ను తాలిబన్లు వేగంగా చేజిక్కుంచుకోవడంపై బైడెన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాలిబన్ల కన్నా ప్రమాదకర శక్తులు ఉన్నాయని.. వాటిని అడ్డుకట్ట వేసేందుకే తాము అఫ్గాన్ నుంచి వైదొలిగామన్నారు.

    అమెరికా ఆఫ్ఘనిస్తాన్‌లో 20 సంవత్సరాలు పనిచేసిందన్నారు. ఇప్పుడు ఇక్కడ నుండి బయటపడాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు 18 వేల మందిని ఆఫ్ఘనిస్తాన్ నుండి తరలించామన్నారు. ఇంకా 6000 మంది అమెరికన్ సైనికులు సహాయక చర్యల కోసం అక్కడ ఉన్నారని ఆయన చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ జైళ్లలో ఉన్న ఇస్లామిక్ స్టేట్ ఖైదీలను తాలిబన్లు విడుదల చేయడంపై బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల ద్వారా ఉగ్రవాదులు పెద్ద ముప్పుగా మారుతారన్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Afghanistan, Air India, Taliban

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు