HOME »NEWS »INTERNATIONAL »us first female vice president kamala harris how many kids have kamala harris india want to know sk

Kamala Harris: కమలా హ్యారిస్‌కు ఎంత మంది పిల్లలు? మనోళ్లకు ఇదే కావాలి..

Kamala Harris: కమలా హ్యారిస్‌కు ఎంత మంది పిల్లలు? మనోళ్లకు ఇదే కావాలి..
కమలా హ్యారిస్

Kamala Harris: కమలా హ్యారిస్‌కు పిల్లలు ఉన్నారా? కమలా హ్యారిస్ భర్త ఎవరు? అనే ప్రశ్నలను ఎక్కువ మంది వెతికారు. అంతేకాదు చివరకు ''కమలా హ్యారిస్ న్యూడ్'' అని కూడా చాలా మంది శోధించారు

 • Share this:
  కమలా హ్యారిస్ (Kamala Harris).. అమెరికా మొట్ట మొదటి మహిళా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నేడు ప్రమాణస్వీకార మహోత్సవం ఘనంగా జరగబోతోంది. ప్రపంచమంతటా అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలి ప్రమాణ స్వీకారం గురించి మాట్లాడుతుంటే.. భారతీయులు మాత్రం కమలాహ్యారిస్‌కు ఎంత మంది పిల్లలు అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఆరాటపడుతున్నారు. కమలకు పిల్లలు ఉన్నారా? ఉంటే ఎంత మంది? ఇలాంటి ప్రశ్నలు గూగుల్‌ను అడుగుతున్నారు. ఇండియా లొకేషన్‌లో గత వారం రోజులుగా Does Kamala Harris have children అనే కీ వర్డ్ గూగుల్ సెర్చ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

  కమలా హ్యారిస్‌కు పిల్లలు ఉన్నారా? కమలా హ్యారిస్ భర్త ఎవరు? అనే ప్రశ్నలను ఎక్కువ మంది వెతికారు. అంతేకాదు చివరకు ''కమలా హ్యారిస్ న్యూడ్'' అని కూడా చాలా మంది శోధించారు. ఇలా వెతికేవారి సంఖ్య 300శాతం పెరిగిందని.. గూగుల్ గణాంకాలు చెబుతున్నాయి.
  మరి కమలా హ్యారిస్‌కు పిల్లలు ఉన్నారా? లేదా? ఈ ప్రశ్నకు అవును అని సమాధానం చెబుతోంది గూగుల్. కమలా హ్యారిస్‌కు పిల్లలు ఉన్నారు. ఐతే వారు సొంత పిల్లలు కాదు. తాను జన్మనిచ్చిన వారు కాదు. కమలా హ్యారిస్‌ భర్త డగ్ ఎమాఫ్‌కు ఇంతకు ముందే పిల్లలు ఉన్నారు. కమలా హ్యారిస్‌ కంటే ముందు ఆయన వేరొక మహిళను ఆయన వివాహం చేసుకున్నారు. 16 ఏళ్ల పాటు వారు కలిసి ఉన్నారు. ఆ తర్వాత విడిపోయారు. అనంతరం కమలా హ్యారిస్‌ను డగ్ ఎమాఫ్ పెళ్లి చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు కోల్ (26), ఎల్లా (21).

  కాగా, అమెరికా చరిత్రలో మొట్ట మొదటి ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్. అంతేకాదు ఈ పదవి చేపట్టబోతున్న మొదటి నల్ల జాతీయురాలు, తొలి ఈశాన్య ఆసియా మూలాలు కలిగిన వ్యక్తి. కమలా హ్యారిస్ తల్లి స్వస్థలం తమిళనాడులోని చెన్నై. తన తల్లితో భారత్‌లో గడిపిన క్షణాలను ఆమె అప్పుడప్పుడూ గుర్తు చేసుకుంటారు. అందుకే చాలా మంది భారతీయులు కమలా హ్యారిస్‌ను కూడా సొంంత వ్యక్తిగా భావిస్తున్నారు. అమెరికా ఎన్నికల్లో ఆమె గెలిచినప్పుడు సంబరాలు చేసుకున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published:January 20, 2021, 09:24 IST