హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

సముద్రంలో కూలిన అమెరికా యుద్ధ విమానం

సముద్రంలో కూలిన అమెరికా యుద్ధ విమానం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇంగ్లాండ్‌లోని రాయల్ ఎయిర్ ఫోర్స్ లాకెన్‌హీత్ ఎయిర్ బేస్‌ నుంచి ఈ విమానం ట్రైనీ మిషన్‌పై బయలు దేరిందని.. విమానంలో ఫైలట్ ఒక్కడే ఉన్నాడని అధికారులు తెలిపారు.

అమెరికా ఎయిర్ ఫోర్స్‌కు చెందిన యుద్ధ విమానం ఇంగ్లండ్ సమీపంలో సముద్రంలో కూలిపోయింది. 48వ ఫైటర్ వింగ్‌కు చెందిన F-15C ఈగిల్ విమానం తూర్పు సముద్ర జలాల్లో కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. స్థానిక కాల మానం ప్రకారం ఉదయం 9.40కి ఈ ప్రమాదం జరిగింది. ఇంగ్లాండ్‌లోని రాయల్ ఎయిర్ ఫోర్స్ లాకెన్‌హీత్ ఎయిర్ బేస్‌ నుంచి ఈ విమానం ట్రైనీ మిషన్‌పై బయలు దేరిందని.. విమానంలో ఫైలట్ ఒక్కడే ఉన్నాడని అధికారులు తెలిపారు. ఘటనపై సమాచారం అందించిన వెంటనే ఇంగ్లండ్ ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగి సముద్రంలో గాలింపు చర్యలు మొదలుపెట్టింది. పైలట్ ఆచూకీ ఇప్పటి వరకు దొరకలేదు. ఐతే ప్రమాదం ఎలా జరిగిందన్నది తెలియాల్సి ఉంది. ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: America, Plane Crash, USA

ఉత్తమ కథలు