డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడానికి . కొన్ని రోజుల ముందే అమెరికాలో అరుదైన ఘటన జరుగింది. 67 ఏళ్లలో తొలిసారిగా ఓ మహిళా ఖైదీకి మరణ శిక్షను ప్రభుత్వం అమలు చేసింది. హత్య కేసులో నేరం రుజువు కావడంతో కోర్టు తీర్పు మేరకు.. లీసా మోంట్గోమెరి (Lisa Montgomery) అనే 52 ఏళ్ల మహిళను అమెరికా ప్రభుత్వం చంపేసింది. ఇండియానాలోని టెర్రె హౌత్ ఫెడరల్ ప్రిజన్ క్లాంప్లెక్స్‌లో.. జనవరి 12 అర్ధరాత్రి 01.31 సమయంలో.. లీసాకు విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చారు. వాస్తవానికి మోంట్గోమెరికి ఈనెల 8నే శిక్ష పడాల్సింది. అయితే ఇద్దరు అటార్నీలకు కరోనా సోకడంతో ఆమె శిక్షను 2021 జనవరి 12కి అటార్నీ జనరల్ విలియమ్ బార్ వాయిదా వేశారు. మరణ శిక్షను ఆపాలని వైట్ హోస్‌ను డిమాండ్ చేస్తూ కొందరు న్యాయవాదులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్న సమయంలోనే శిక్షను అమలు చేసింది అమెరికా ప్రభుత్వం.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన హయాంలోనే అమెరికాలో మళ్లీ మరణశిక్షలను అమలు చేయడం మొదలుపెట్టారు. దాదాపు 17 ఏళ్ల నుంచి ఒక్కర్ని కూడా అమెరికా జైళ్లలో ఇంజక్షన్ ఇచ్చి చంపలేదు. కానీ గత ఏడాది జులై నుంచి మళ్లీ మరణ శిక్షలను అమలు చేస్తున్నారు.
లిసా మోంట్‌గోమెరీ అనే మహిళ 2004లో దారుణానికి ఒడిగట్టింది. ముస్సోరిలో బోబి స్టినెట్ అనే గర్భవతిని పాశవికంగా హత్య చేసింది. కడుపులోని పేగును కొసి ఎనిమిది నెలల పసి కందును బయటికి తీసింది. ఆ బిడ్డ బతికినా.. బోబీ చనిపోయింది. ఆ తర్వాత జీవించి ఉన్న ఆ బిడ్డను తండ్రికి పోలీసులు అప్పగించారు. తర్వాత లిసా మోంట్గోమరీని అరెస్ట్ చేశారు. ఈ దారుణానికి పాల్పడిన ఆమెకు అక్కడి కోర్టు మరణ శిక్ష విధించింది. ఐతే మోంట్‌గోమెరీ శారీరక, మానసిక వ్యాధులతో, ఒత్తిడితో బాధపడుతోందని ఆమె లాయర్ వాదించారు. ఆమె గతంలోనూ లైంగిక వేధింపులకు గురైందని, అప్పుడు ఆమెను ప్రభుత్వం కాపాడలేకపోయిందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆమెకు విధించిన మరణశిక్షను రద్దు చేయాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. కానీ అందుకు నిరాకరించిన కోర్టు.. మరణ శిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది.
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ పదవి చేపట్టే ఎనిమిది రోజుల ముందే లిసాకు మరణశిక్ష అమలు చేశారు. 1953 తర్వాత అమెరికాలో ఓ మహిళను ఉరి తీయడం ఇదే మొదటిసారి. కాగా, అధ్యక్ష బాధ్యత బదిలీ సమయంలో మరణ శిక్ష అమలు కానుండడం వందేళ్ల తర్వాత జరిగింది. ఇక ప్రస్తుతం అమెరికాలో మరణశిక్ష పడిన ఖైదీలు 52 మంది ఉన్నారు. ఒకవేళ అమెరికా తర్వాతి అధ్యక్షుడు తలుచుకుంటే ఒక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తో అన్నీ రద్దు చేయవచ్చు. అలాగే తాను మరణశిక్షలకు సముఖంగా లేనని బైడెన్ కూడా చెప్పారు. అయితే ఆయన బాధ్యతలు చేపట్టే ముందే ఆ జాబితాలో ఉన్న ఏకైక మహిళ మోంట్గోమెరీని చంపేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Crime news, Us news