హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

US Employment : ఉద్యోగాలు వీడుతున్న లక్షల మంది... కరోనా తర్వాత అమెరికన్లలో కొత్త ధోరణి..

US Employment : ఉద్యోగాలు వీడుతున్న లక్షల మంది... కరోనా తర్వాత అమెరికన్లలో కొత్త ధోరణి..

US Employment : ఉద్యోగాలు వీడుతున్న లక్షల మంది...

US Employment : ఉద్యోగాలు వీడుతున్న లక్షల మంది...

US Employment : కరోనా ( Corona ) తర్వాత ప్రపంచ దేశాల యువత ఉద్యోగాల వేటలో మునిగి తేలుతుంటే అగ్రరాజ్యం అమెరికాలో ( America ) మాత్రం అందుకు భిన్నంగా పరిస్థితి ఉంది. అక్కడ చాలా మంది ఉన్న ఉద్యోగాలను స్వచ్చందంగా వదులుకుంటున్నారు. దీంతో రిక్రూట్‌మెంట్‌కంటే ఉద్యోగాలు వదులుకునే వారి సంఖ్య ఎక్కువ శాతం ఉంటుంది.

ఇంకా చదవండి ...

కరోనా (Corona ) తర్వాత ప్రపంచ దేశాలు ఆర్థిక కుదేలయ్యాయి. దీంతో ఉద్యోగాలు ( Employment ) కోల్పోయి చాలా మంది రోడ్డు మీద పడ్డారు. సెకండ్ వేవ్ తర్వాత ఇప్పుడిప్పుడే పలు దేశాలు తిరిగి ఆర్థికంగా నిలదొక్కుంటున్నాయి. దీంతో ఉపాధి , ఉద్యోగవకాశాలు కల్పిస్తున్నాయి. అయితే ప్రపంచ దేశాల్లో పరిస్థితి ఇలా ఉంటే అగ్రరాజ్యం అమెరికాలో ( America ) మాత్రం పరిస్థితి మరోలా కనిపిస్తోంది. సామాజిక స్థితిగతుల్లో కూడా మార్పులు తీసుకువచ్చింది. కరోనా సమయంలో జీవన విధానం వారికి కొత్త ఆశలను రేకిత్తించింది. ఎంత సేపు ఉద్యోగాలు చేసి జీవితాన్ని నెట్టుకు రావడం కంటే స్థానికంగా ఉండే అనేక పనులు చేసుకోవడం ద్వారా అంతకంటే ఎక్కువ డబ్బు సంపాదించడంతో పాటు సౌకర్యవంతంగా ఉంటుందని గ్రహించారు. ముఖ్యంగా ఉద్యోగాల్లో టార్గెట్స్, ఒత్తిడిని తట్టుకోలేని వారు తాజాగా ఆ ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నారు. దీంతో ఇపుడు అమెరికాలో ఎక్కడ చూసిన ఉద్యోగాలు రిజైన్ చేయడం అనే ప్రక్రియకు స్పీడ్‌గా కొనసాగుతుందని చెబుతున్నారు.

కరోనా తర్వాత అక్కడి ఉద్యోగుల వైఖరి మారిపోయింది.వర్క్ ఫ్రమ్ హోంతో పాటు ( Work from home ) మహమ్మారి సమయంలో కొందరు ఉద్యోగాలు కోల్పోవడం, సొంత వ్యాపారాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడం, జాబ్‌ లేకపోతే కలిగే ఇబ్బందులును అధిగమించడంలో అనుభవం పొందడం వంటివన్నీ అమెరికన్ల ఆలోచనావిధానాన్ని మార్చేశాయి. ఆ దేశంలో ఇప్పుడు ది గ్రేట్ రిజిగ్నేషన్ విప్లవం నడుస్తోంది. అందుకే పెద్ద ఎత్తున ఉద్యోగాలను వదిలేస్తున్నారు.

ఇది చదవండి : ఆ రైతులకు రైతు భీమా, రైతు బంధులు రద్దు.. గంజాయి సాగుపై సీఎం కీలక నిర్ణయం


ఈ క్రమంలోనే అమెరికాలో ప్రస్తుతం కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న వారి సంఖ్య కంటే…జాబ్‌లు వీడుతున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉందంటే…ఇలా ఒక్క ఆగస్టులోనే 43లక్షలమంది అమెరికన్లు ఉద్యోగాలకు రాజీనామా చేశారంటే.. పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారితో పోలిస్తే…రిజైన్ చేసిన వారి సంఖ్య 2.9శాతం ఎక్కువగా ఉంది.

ఉద్యోగం లేకపోవడంతో గత ఏడాదంతా….ఇతర పనులు చేస్తూ బిజీగా గడిపామని…అప్పుడే ఈ ఆలోచన వచ్చిందని ఓ ఉద్యోగి చెప్పారు.రోజూ ఎంత సమయం వెచ్చిస్తున్నాం…అందుకు ఎంత ప్రతిఫలం దక్కుతుంది అన్నది…రోజువారీ జాబ్‌పై పునరాలోచనలో పడేసిందని తెలిపారు.ముఖ్యంగా మెరుగైన పనివేళలు, పదోన్నతులు, ఇంక్రిమెంట్లు వంటి వాటిల్లో మొత్తంగా ఉద్యోగులు మార్పు కోరుకుంటున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ఇది చదవండి : ఇలా చేస్తోంది ఏమిటీ... భర్త చితభస్మాన్ని వెంటపెట్టుకుని అప్పుడప్పుడు అలా.. !


అమెరికా అంతటా రిజిగ్నేషన్ కార్యక్రమం నడుస్తుండడంతో…కొత్త ఉద్యోగాల భర్తీ కంపెనీలకు సవాలుగా మారింది. దేశంలోని మొత్తం ఉద్యోగుల్లో సగానికి పైగా వచ్చే ఏడాది తాము కొత్త ఉద్యోగంలో చేరాలని భావిస్తున్నట్టు ఓ సర్వేలో వెల్లడించారు. 56శాతం ఉద్యోగులు పనివేళల్లో, పని ప్రదేశాల్లో మార్పులు కావాలని కోరారు. పిల్లల పెంపకం, వారి బాగోగులు పట్టించుకోవడం వంటి అదనపు బాధ్యతలు ఉన్న మహిళా ఉద్యోగులు..మగవాళ్లతో పోలిస్తే..ఎక్కువ సంఖ్యలో రాజీనామాలు సమర్పిస్తున్నారు.

First published:

Tags: America, Employees, International news

ఉత్తమ కథలు