హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Donald Trump Pension: డొనాల్డ్ ట్రంప్‌కు పెన్షన్ ఎంత ఇస్తారో తెలుసా?

Donald Trump Pension: డొనాల్డ్ ట్రంప్‌కు పెన్షన్ ఎంత ఇస్తారో తెలుసా?

డొనాల్డ్ ట్రంప్( ఫైల్ ఫోటో)

డొనాల్డ్ ట్రంప్( ఫైల్ ఫోటో)

అమెరిగా మాజీ అధ్యక్షులకు సెక్రటరీ ఆఫ్‌ ట్రెజరీ పెన్షన్ మంజూరు చేస్తుంది. ప్రస్తుతం ఏడాదికి 2,19,200 డాలర్లు అంటే దాదాపు రూ.1.6కోట్లు పెన్షన్ ఇస్తుంది.

  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించారు. 290 ఎలక్టోరల్ ఓట్లతో (ఇప్పటి వరకు) ఘన విజయాన్ని నమోదు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలోనే కనీవినీ ఎరుగని స్థాయిలో జో బైడెన్‌కు పాపులర్ ఓట్లు లభించాయి. దీంతో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ ఖాళీ చేయాల్సిందే. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత, కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకారం మధ్యలో కొంత సమయం ఉంటుంది. 2021 జనవరి 20న కొత్త అధ్యక్షుడు ప్రమాణస్వీకారం చేస్తారు. ఆలోపు ట్రంప్ వైట్ హౌస్‌ను ఖాళీ చేసేయాలి. అయితే, అమెరికా అధ్యక్షులుగా సేవలు అందించిన వారికి ఆ దేశం పెన్షన్ ఇస్తుంది. వారికి ఆఫీసు ఏర్పాటు చేసుకోవడానికి, సిబ్బంది కోసం, ఇతర ఇంటర్నెట్, టెలిఫోన, ప్రింటింగ్, పోస్టల్ సేవలను కూడా ప్రభుత్వం ఖజానా నుంచి చెల్లిస్తుంది.

  అమెరిగా మాజీ అధ్యక్షులకు సెక్రటరీ ఆఫ్‌ ట్రెజరీ పెన్షన్ మంజూరు చేస్తుంది. ప్రస్తుతం ఏడాదికి 2,19,200 డాలర్లు అంటే దాదాపు రూ.1.6కోట్లు పెన్షన్ ఇస్తుంది. అయితే, ఏటా సమీక్ష ఆధారంగా పెన్షన్‌ మొత్తంలో మార్పులు జరుగుతాయి. అధ్యక్ష పదవి నుంచి దిగిన వెంటనే పెన్షన్ ఇవ్వడానికి జరగాల్సిన ప్రక్రియ మొదలవుతుంది. మాజీ అధ్యక్షుడి జీవిత భాగస్వామికి కూడా ఏడాదికి 20వేల డాలర్ల (సుమారు రూ.14 లక్షలు) చొప్పున పెన్షన్ ఇస్తారు.

  మొదట్లో ఇలాంటి సౌకర్యాలు ఉండేవి కావు. 1912లో ఆండ్రూ కార్నెగ్ అనే పారిశ్రామికవేత్త మాజీ అధ్యక్షులకు ఆర్థిక సాయం చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ప్రభుత్వం 1958లో ‘మాజీ అధ్యక్షుల చట్టం’ అమల్లోకి తెచ్చింది. ఆ చట్ట ప్రకారం పెన్షన్, సిబ్బంది కేటాయింపు, భద్రత, ఆరోగ్య బీమా లాంటివి కల్పిస్తారు. మాజీ అధ్యక్షులకు కూడా మిలటరీ ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందిస్తారు.

  రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్లు, హోటల్స్, క్యాసినో వంటి వ్యాపారాలు కలిగిన డొనాల్డ్ ట్రంప్‌కు ప్రస్తుతం సుమారు రూ.18,000 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. అమెరికా చట్టాల్లోని లొసుగులను వాడుకుని ఎదిగినట్టు స్వయంగా ట్రంప్ ఓ సందర్భంలో వెల్లడించారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Donald trump, US Elections 2020

  ఉత్తమ కథలు