US ELECTIONS 2020: అమెరికా ఎన్నికల్లో మనోళ్ల జోరు.. ఇప్పటికే ముగ్గురి ఘనవిజయం
ప్రమీలా, కృష్ణమూర్తి (ఫైల్)
ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఫలితాలు క్షణక్షణానికి తారుమారవుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన వ్యక్తులు కూడా విజయదుందుభి మోగిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులు విజయం సాధించినట్టు ఫలితాలు వెల్లడయ్యాయి.
ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఫలితాలు క్షణక్షణానికి తారుమారవుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన వ్యక్తులు కూడా విజయదుందుభి మోగిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులు విజయం సాధించినట్టు ఫలితాలు వెల్లడయ్యాయి. వారిలో ఇద్దరు డెమొక్రటిక్ పార్టీకి చెందినవారు కాగా, ఒకరు రిపబ్లికన్ పార్టీకి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. డెమొక్రట్లలో విజయం సాధించిన వారిద్దరూ అమెరికా ఉఫాధ్యక్ష స్థానం కోసం పోటీపడుతున్న కమలా హరిస్ తో పాటు.. అధ్యక్ష పదవి రేసులో ఉన్న జో బైడెన్ కు సన్నిహితులే. ఇక ఓహియో నుంచి గెలిచిన నీరజ్ అంథోని.. యూఎస్ ప్రతినిధుల సభకు ఎన్నికయిన అత్యంత పిన్న వయస్కుడు.
ఇప్పటివరకు విడుదలైన ఫలితాల ప్రకారం.. తమిళనాడు వాస్తవ్యుడైన రాజా కృష్ణమూర్తి (ఢిల్లీలో పుట్టి పెరిగారు) వరుసగా మరోసారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. 2016 లోనూ ఆయన డెమొక్రట్ పార్టీ తరఫున విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి లిబర్టేరియన్ పార్టీకి చెందిన ప్రెస్టన్ నెల్సన్ ను సులభంగా ఓడించాడు. మొత్తం పోలైన ఓట్లలో రాజాకే 71 శాతం ఓట్లు రావడం గమనార్హం.
కృష్ణమూర్తితో పాటు డెమొక్రాట్స్ కాంగ్రెస్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న మరో ఇండో అమెరికన్ పవర్ ఫుల్ లేడీ కూడా ఘన విజయం సాధించారు. డెమొక్రాట్స్ అభ్యర్థి ప్రమీలా జయపాల్ (వాషింగ్టన్ నుంచి) కూడా మూడోసారి విజయం సాధించారు. ఈమె కూడా తమిళనాడుకు చెందిన వ్యక్తే కావడం గమనార్హం. వాషింగ్టన్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న జయపాల్.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి క్రెయిగ్ కెల్లర్ పై జయకేతనం ఎగురవేసింది. వీరిరువురి మధ్య ఓట్ల తేడా సుమారు 70 శాతంగా ఉంది. కాగా జయపాల్.. భారత్ తీసుకొచ్చిన సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ ల వంటి చట్టాలపై బహిరంగంగానే గళం వినిపించిన వ్యక్తి ఆమె.
నీరజ్ (ఫైల్)
వీరిరువురే గాక మరో వ్యక్తి కూడా అమెరికా ఎన్నికలలో గెలుపొందాడు. రిపబ్లిక్ పార్టీ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న నీరజ్ అంటోని.. ఓహియో నుంచి సెనేట్ కు ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన ప్రతినిధుల సభల ఎన్నికలలో.. ఆయన డెమొక్రటిక్ కు చెందిన మార్క్ ఫోగెల్ ను ఓడించారు. ఓహియో నుంచి మొట్టమొదటి సెనేటర్ అయిన భారత సంతతి వ్యక్తిగా నీరజ్ రికార్డు సృష్టించారు. ఆయన వయసు 23 సంవత్సరాలే. యూఎస్ లో ప్రతినిధుల సభకు ఎన్నికైన వారిలో అతడే అత్యంత పిన్న వయస్కుడు.
Published by:Srinivas Munigala
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.