హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

US ELECTIONS 2020: వైట్ హౌస్ కు బైడెన్.. విజయం లాంఛనమే... ట్రంప్ కు అమెరికన్ల షాక్

US ELECTIONS 2020: వైట్ హౌస్ కు బైడెన్.. విజయం లాంఛనమే... ట్రంప్ కు అమెరికన్ల షాక్

జో బిడెన్, డొనాల్డ్ ట్రంప్ (ఫైల్ ఫోటో)

జో బిడెన్, డొనాల్డ్ ట్రంప్ (ఫైల్ ఫోటో)

క్షణం క్షణం ఉత్కంఠ. నిమిష నిమిషానికి చేతులు మారుతున్న ఆధిక్యత. ఓ రాష్ట్రంలో ట్రంప్ ముందంజలో ఉంటే మరో రాష్ట్రంలో బైడెన్ స్వీప్ చేస్తాడు. ఆసాంతం ఓ సస్పెన్స్ థ్రిల్లర్ చూసినంత మజా. టీ-20 మ్యాచ్ లలో డబుల్ సూపర్ ఓవర్ కు వచ్చినంత కిక్. ఇదీ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల పరిస్థితి.

ఇంకా చదవండి ...
  • News18
  • Last Updated :

క్షణం క్షణం ఉత్కంఠ. నిమిష నిమిషానికి చేతులు మారుతున్న ఆధిక్యత. ఓ రాష్ట్రంలో ట్రంప్ ముందంజలో ఉంటే మరో రాష్ట్రంలో బైడెన్ స్వీప్ చేస్తాడు. ఆసాంతం ఓ సస్పెన్స్ థ్రిల్లర్ చూసినంత మజా. టీ-20 మ్యాచ్ లలో డబుల్ సూపర్ ఓవర్ కు వచ్చినంత కిక్. ఎవరు గెలుస్తున్నారో.. ఎవరు ఓడుతున్నారో చెప్పలేని పరిస్థితి. మహా మహా రాజకీయ నాయకులు సైతం ఫలితాల ట్రెండ్ ను చూసి తలలు పట్టుకున్నారు. ఏం విశ్లేషణ చేయాలో వారికీ అర్థం కావడం లేదు. ట్రంప్ గెలిచారని చెబుతామనుకునేసరికి బైడెన్ ఆధిక్యంలోకి వస్తున్నాడు. ఇక బైడెన్ విజయం మీద నల్లేరు మీద నడకే అనుకునేలోపే ట్రంప్ దూసుకొస్తున్నాడు. ఇదీ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల పరిస్థితి. 24 గంటలు గడిచినా ఫలితం తేలే ఉంది. మరోవైపు అభ్యర్థులిద్దరూ విజయం మాదంటే మాదే అంటూ ప్రకటించుకున్నారు. ఇక తుంటరి ట్రంప్ అయితే.. నేనే విజయం సాధించానని.. తన విజయం అంతకుముందే ఖరారైందని.. జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియ మోసం అని తేల్చేశాడు. దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్టు ఆయన తెలిపారు. మరోవైపు అధ్యక్ష పీఠం కైవసం చేసుకోవడానికి అడుగుదూరంలో నిలిచిన బైడెన్.. ‘రా.. కోర్టులోనే చూసుకుందాం..’ అంటూ సవాళ్లు విసరుతున్నారు.

అత్యంత ఉత్కంఠల మధ్య సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతున్నది. అభ్యర్థిలిద్దరూ హోరాహోరి పోటీతో దూసుకుపోతున్నారు. ఇద్దరు నూవ్వానేనా..? అనే రీతిలో పోటీ పడుతున్నా.. పాపులర్ ఓట్లలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైపే అమెరికా మొగ్గు చూపినా.. కీలకమైన ఎలక్ట్రోరల్ కాలేజీ ఓట్లలో మాత్రం బైడెన్ ముందంజలో ఉన్నారు. మొత్తం ఎలక్ట్రోరల్ స్థానాలు 538 కాగా.. అందులో అధ్యక్ష పీఠాన్ని సాధించడానికి 270 ఓట్లు సాధించాలి. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం.. డెమొక్రట్ల అభ్యర్థి జో బైడెన్ కు 253 ఓట్లు రాగా.. డొనాల్డ్ ట్రంప్ కు 214 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇద్దరి మధ్య పాపులర్ ఓట్లలో స్వల్ప తేడాలున్నా.. ఎలక్ట్రోరల్ ఓట్లలో బైడెన్ దూసుకుపోతున్నాడు. మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే బైడెన్ సాధించాల్సిన ఓట్లు ఇంకా 17 మాత్రమే.

మరో ఆరు రాష్ట్రాల ఫలితాలు రావాల్సి ఉంది. ఇవి కూడా బైడెన్ అనుకూల రాష్ట్రాలే అని అమెరికా మీడియా చెబుతున్నది. దీని ప్రకారం చూస్తే.. ఈ సారి వైట్ హౌస్ లో కాలరెగిరేసిది బైడెనే అని రాజకీయ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. ఆ ఆరు రాష్ట్రాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది.

ఇప్పటివరకు 44 రాష్ట్రాల్లో పలితాలు వెల్లడయ్యాయి. ఇక ఫలితం తేలబోయే మిచిగాన్, అరిజోనా తో పాటు మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ బైడెన్ వైపే మొగ్గు ఉందని తెలుస్తుంది. అరిజోనాలో ట్రంప్ పై బైడెన్ 3.4 శాతం ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అరిజోనాతో పాటు అలాస్కా, జార్జియా, నార్త్ కరోలినా, నెవాడా, పెన్సిల్వేనియా ఫలితాలు వెలువడాల్సి ఉంది.

కాగా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, జార్జియా లలో ట్రంప్ అధిక్యంలో ఉన్నారు. ఈ రాష్ట్రాలలో ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నప్పటికీ అధ్యక్ష పీఠం చేరుకునేంత ఓట్లు సంపాదించుకోవడం కష్టమే. మొత్తంగా చూస్తే బైడెన్ విజయం దాదాపు ఖరారైనట్టే. మిగిలింది లాంచనంగా ప్రకటించడమే మిగిలి ఉంది.

First published:

Tags: America, Donald trump, Joe Biden, US Elections 2020

ఉత్తమ కథలు