ఎన్నికలకు ముందే వ్యాక్సిన్‌ వస్తే..దాన్ని నమ్మలేమన్న కమలా హారిస్

US Elections 2020 | నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దానికంటే ముందే ట్రంప్(Donald Trump) తీసుకొచ్చే కోవిడ్ వ్యాక్సిన్‌ సామర్థ్యం, విశ్వసనీయతపై తనకు నమ్మకం లేదని డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్(Kamala Harris) పేర్కొన్నారు.


Updated: September 6, 2020, 9:37 AM IST
ఎన్నికలకు ముందే వ్యాక్సిన్‌ వస్తే..దాన్ని నమ్మలేమన్న కమలా హారిస్
కమలా హారిస్(ఫైల్ ఫోటో)
  • Share this:
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కోవిడ్ అంశం కీలకంగా మారింది. కోవిడ్ వ్యాప్తిని కట్టడి చేయడంలో ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విఫలం చెందారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ట్రంప్ యంత్రాంగం చేతగానితనం కారణంగానే దేశంలో 1,88,000 మంది కరోనా వైరస్ బారినపడి మరణించాల్సిన దుస్థితి నెలకొందన్న విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశంపై ఎన్నికల ప్రచారంలోనూ డెమోక్రటిక్ పార్టీ ట్రంప్‌ను టార్గెట్ చేస్తోంది. అమెరికాలో నవంబర్ మాసంలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దానికంటే ముందే కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకొచ్చేందుకు ట్రంప్ యంత్రాంగం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డెమోక్రటిక్ పార్టీ తరఫు ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

అమెరికా ఎన్నికలకు ముందే వ్యాక్సిన్‌ను తీసుకొస్తే...దాని సామర్థ్యం, విశ్వసనీయతను తాను నమ్మలేనని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో లబ్ధి పొందే రాజకీయ ఎత్తుగడతో డొనాల్డ్ ట్రంప్ వ్యాక్సిన్‌ను ముందే తీసుకొచ్చే అవకాశముందని అనుమానాలు వ్యక్తంచేశారు. వ్యాక్సిన్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ మాటలపై తనకు నమ్మకం లేదన్నారు.
Published by: Janardhan V
First published: September 6, 2020, 9:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading