హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Kamala Harris టీమ్‌లో భారత సంతతి యువతికి కీలక బాధ్యతలు

Kamala Harris టీమ్‌లో భారత సంతతి యువతికి కీలక బాధ్యతలు

కమలా హారిస్‌కు ప్రెస్ సెక్రటరీగా నియమితులైన సబ్రినా సింగ్

కమలా హారిస్‌కు ప్రెస్ సెక్రటరీగా నియమితులైన సబ్రినా సింగ్

Indian-American Sabrina Singh | కమలా హారిస్(Kamala Harris) తన టీమ్‌లో భారతీయ అమెరికా యువతికి కీలక బాధ్యతలు అప్పగించారు. సబ్రినా సింగ్‌ను తన ప్రెస్ సెక్రటరీగా నియమించుకున్నారు.

  అమెరికా ఎన్నికల్లో ‘భారతీయం’ మార్మోగుతోంది. ఇప్పటికే డెమోక్రటిక్ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్(Kamala Harris) అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం తెలిసిందే. తాజాగా కమలా హారిస్ తన టీమ్‌లో భారతీయ అమెరికా యువతికి కీలక బాధ్యతలు అప్పగించారు. సబ్రినా సింగ్(Sabrina Singh)‌ను తన ప్రెస్ సెక్రటరీగా నియమించుకున్నారు. గతంలో ఆమె ఇద్దరు డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థులైన న్యూజెర్సీ సెనెటర్ కోరీ బుకెర్, న్యూయార్క్ మాజీ మేయర్ మైక్ బ్లూమ్‌బెర్గ్‌కు మీడియా బాధ్యురాలిగానూ వ్యవహరించారు.

  కమలా హారిస్ ఉపాధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆమె సెక్రటరీ హోదాలో సబ్రినా సింగ్ కీలక పాత్ర పోషించనున్నారు. కమలా హారిస్ ప్రెస్ సెక్రటరీగా...బైడెన్, హారిస్ టీమ్‌లో చేరుతుండటం చాలా సంతోషాన్ని కలిగిస్తోందని సబ్రినా పేర్కొంది. నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో వారి విజయమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థికి భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి ప్రెస్ సెక్రటరీగా పనిచేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.

  us election news, sabrina singh, who is sabrina singh, kamala harris press secretary, us election latest news, democratic party news, అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020, సబ్రినా సింగ్, కమలా హారిస్ ప్రెస్ సెక్రటరీ, సబ్రినా సింగ్ ఎవరు
  కమలా హారిస్‌కు ప్రెస్ సెక్రటరీగా నియమితులైన సబ్రినా సింగ్

  లాస్ ఏంజెల్స్‌కు చెందిన సబ్రినా సింగ్...గతంలో డెమోక్రటిక్ నేషనల్ కమిటీకి అధికార ప్రతినిధిగానూ పనిచేశారు. అమెరికాలో భారత సంతతికి చెందిన ప్రజలకు సేవలందిస్తున్న ఎన్జీవో - ఇండియా లీగ్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు జేజే సింగ్ మనువరాలు సబ్రినా సింగ్.

  సబ్రినా సింగ్ ఎవరు?

  అమెరికాలో జాతి వివక్ష విధానాలకు వ్యతిరేకంగా సహచర భారత సంతతికి చెందిన వారితో జే జే సింగ్ 1940లలో అమెరికాలో జాతీయస్థాయి ప్రచారాన్ని కూడా చేపట్టారు. ఆయన పోరాట ఫలితంగానే నాటి అమెరికా అధ్యక్షుడు హారీ ట్రూమన్ 1946లో జాతి వివక్ష విధానాలకు వ్యతిరేకమైన లూస్-సెల్లెర్ యాక్ట్‌పై సంతకం చేశారు. దీని ద్వారా అప్పట్లో ప్రతియేటా భారత్ నుంచి అమెరికాకు వలసవచ్చే వారి కోటాను 100కి పెంచారు.

  Published by:Janardhan V
  First published:

  Tags: Kamala Harris, US Elections 2020

  ఉత్తమ కథలు