హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

అమెరికా అధ్యక్ష ఎన్నికలు: డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్ వీడక తప్పదా?

అమెరికా అధ్యక్ష ఎన్నికలు: డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్ వీడక తప్పదా?

డొనాల్డ్ ట్రంప్ (ఫైల్)

డొనాల్డ్ ట్రంప్ (ఫైల్)

US Elections 2020: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మరో రెండు మాసాల్లో నవంబరు 3 తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో ప్రజానాడిని కనుగొనేందుకు నిర్వహించిన తాజా ఒపీనియన్ పోల్స్‌లో అత్యధికులు డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ వైపే మొగ్గుచూపారు.

ఇంకా చదవండి ...

  US Elections 2020 Opinion Poll: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మరో రెండు మాసాల్లో నవంబరు 3వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో ప్రజానాడిని కనుగొనేందుకు నిర్వహించిన తాజా ఒపీనియన్ పోల్స్‌లో అత్యధికులు డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ వైపే మొగ్గుచూపారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కంటే జో బైడెన్ 12 శాతం ఎక్కువ ఓట్లు సాధించినట్లు Reuters/Ipsos ఒపీనియన్ పోల్ వెల్లడించింది. ఈ నెల 3 తేదీ నుంచి 8వ తేదీకి మధ్య చేపట్టిన ఈ అభిప్రాయ సేకరణ వివరాలను బుధవారం వెల్లడించారు. సర్వేలో పాల్గొన్నవారిలో 52శాతం మంది తాము బైడెన్‌కు ఓటువేయబోతున్నట్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేయగా... 40 శాతం మంది ట్రంప్‌కు బాసటగా నిలిచారు. 3 శాతం మంది తాము మరో అభ్యర్థికి ఓటువేయనున్నట్లు చెప్పగా...5 శాతం మంది అధ్యక్ష ఎన్నికల్లో తాము ఎవరికి ఓటు వేయాలన్న విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

  డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

  ప్రస్తుతం ఓటర్ల అభిప్రాయం మేరకు డొనాల్డ్ ట్రంప్‌పై జో బైడెన్ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు ఆ సర్వే తేటతెల్లం చేస్తోంది. దీంతో రెండోసారి అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకోవాలన్న డొనాల్డ్ ట్రంప్ కల నెరవేరే అవకాశాలు తక్కువేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ సర్వే ఫలితాలు డెమొక్రాటిక్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. అయితే రెండోసారి అధికార పగ్గాలు సొంతం చేసుకోవడంపై డొనాల్డ్ ట్రంప్ ధీమాగా ఉన్నారు.

  అటు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ బరిలో నిలుస్తున్నారు. కమలా హారిస్ అమెరికా ఎన్నికల బరిలో నిలవడంపై డొనాల్డ్ ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్థానికత సెంటిమెంట్‌ను రెచ్చగొడుతూ...కమలా హారిస్ దేశాధ్యక్షురాలైతే అమెరికాకు సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. తద్వారా స్థానిక ఓటర్లలో భావోద్రేకాలు రెచ్చగొట్టి తన వైపునకు తిప్పుకునేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు.

  Published by:Janardhan V
  First published:

  Tags: Donald trump, Joe Biden, US Elections 2020

  ఉత్తమ కథలు