Home /News /international /

US ELECTIONS 2020 DONALD TRUMP WINS IN FLORIDA BUT BIDEN LEADS LIVE UPDATES HERE MS

US POLLS 2020: ఫ్లోరిడా నెగ్గినా.. పెత్తనం దక్కేట్టు లేదు..!! మళ్లీ ఆధిక్యంలోకి బైడెన్

డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్

డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు నరాలు తెగే ఉత్కంఠను కలిగిస్తున్నాయి. ఫలితం నిమిష నిమిషానికి తారుమారవుతున్నది. ఇప్పటిదాకా వచ్చిన ఫలితాలను తారుమారు చేస్తూ డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ ముందంజలోకి వచ్చారు.

  • News18
  • Last Updated :
    అమెరికా అధ్యక్ష పీఠానికి జరుగుతున్న ఎన్నికలు హోరాహోరిని తలపిస్తున్నాయి. కీలక రాష్ట్రాలల్ ఆధిపత్యం కనబరిచిన ట్రంప్.. ఒక్కసారిగా వెనుకబడిపోయారు. తాజాగా వస్తున్న ఫలితాలు ఆయనకు ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. కీలకంగా భావించే స్వింగ్ రాష్ట్రాల్లో ఆయన ఆధిపత్యం కనబరిచినట్టు కనిపించినా.. అంతలోనే ఆయన ఆశలు ఆవిరయ్యాయి. ఇప్పటిదాకా ఏకపక్షంగా వచ్చినట్టు కనిపించిన ఫలితాలు.. మళ్లీ బైడెన్ కు ఆధిక్యం కట్టబెడుతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు అత్యంత కీలకమైన ఫ్లోరిడాలో నెగ్గినా పెత్తనం మాత్రం దక్కేట్టు కనిపించడం లేదు.

    అమెరికా అధ్యక్షుడిని ఎన్నుకునే క్రమంలో స్వింగ్ స్టేట్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే.. అత్యంత కీలకమైన ఫ్లోరిడాలో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించినా.. పెన్సల్వేనియాలోనూ ట్రంపే ఆధిక్యంలోనూ ఉన్నా.. ఆయన అధ్యక్షుడయ్యే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం.. కీలకంగా భావించే ఎలక్ట్రోరల్ ఓట్లలో ట్రంప్ బాగా వెనకబడటమే దీనికి కారణం.

    ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ప్రకారం.. మొత్తం పోలైన ఎలక్ట్రోరల్ ఓట్లలో 223 ఓట్లు బైడెన్ కు రాగా.. డొనాల్డ్ ట్రంప్ 212 (ఆధిక్యం నిమిష నిమిషానికి మారుతున్నది) ఓట్లు మాత్రమే దక్కించుకున్నారు. ఇద్దరి మధ్య స్వల్ప ఆధిక్యమే కొనసాగుతున్నా.. బైడెన్ ఇంకా పుంజుకునే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పూర్తి ఫలితాలు రావడానికి ఇంకొంత సమయమున్నా.. తాజాగా వస్తున్న ఫలితాలు మాత్రం తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి.

    ఈ రాత్రికి మీడియా ముందుకు బైడెన్..
    అమెరికా ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుండగా.. ఈ రాత్రికి డెమొక్రట్ అభ్యర్థి జో బైడెన్ మీడియా ముందుకు రానున్నట్టు అధికారిక వర్గాల సమచారం. ఫలితాల సరళిని తన ఇంటి నుంచి పర్యవేక్షిస్తున్న ఆయన.. చివరి ఓటు కౌంటింగ్ దాకా వేచి ఉండాలని సూచించారు.

    భారత సంతతికి చెందిన డెమొక్రట్ అభ్యర్థి ఘన విజయం..
    యూఎస్ ఎన్నికలలో భారత సంతతికి చెందిన అభ్యర్థులు విజయాలు సాధిస్తున్నారు. వారిలో ప్రముఖంగా డెమొక్రట్ పార్టీకి చెందిన రాజా కృష్ణమూర్తి వరుసగా మూడోసారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. న్యూఢిల్లీకి చెందిన కృష్ణమూర్తి.. తన సమీప ప్రత్యర్థి లిబర్టేరియన్ పార్టీకి చెందిన ప్రెస్టన్ నెల్సన్ ను సులభంగా ఓడించాడు. ఆయనతో పాటు డెమొక్రాట్స్ కాంగ్రెస్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రమీలా జయపాల్ (వాషింగ్టన్ నుంచి) కూడా మూడోసారి విజయదుందుభి మోగించింది.
    Published by:Srinivas Munigala
    First published:

    Tags: Donald trump, Florida, Joe Biden, US Elections 2020

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు